Gunde Ninda Gudi Gantalu Today: సురేంద్రకు చీర కట్టినట్లుగా శ్రుతి- సత్యంకు ఎదురుచెప్పిన కోడలు- రవిని గెంటేసిన బాలు-gunde ninda gudi gantalu january 20th today episode balu satires on shruthi surendra over first night star maa serial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gunde Ninda Gudi Gantalu Today: సురేంద్రకు చీర కట్టినట్లుగా శ్రుతి- సత్యంకు ఎదురుచెప్పిన కోడలు- రవిని గెంటేసిన బాలు

Gunde Ninda Gudi Gantalu Today: సురేంద్రకు చీర కట్టినట్లుగా శ్రుతి- సత్యంకు ఎదురుచెప్పిన కోడలు- రవిని గెంటేసిన బాలు

Sanjiv Kumar HT Telugu
Jan 20, 2025 09:03 AM IST

Gunde Ninda Gudi Gantalu Serial January 20th Episode: గుండె నిండా గుడి గంటలు జనవరి 20 ఎపిసోడ్‌లో రవి ఫస్ట్ నైట్ గదికి బాలు తాళం వేసుకెళ్లడంపై గొడవ జరుగుతుంది. సత్యం వచ్చి బాలుతో కీ ఇచ్చేలా చేస్తాడు. తర్వాత ఆశీర్వాదం గురించి మట్లాడితే సురేంద్రకు చీర కట్టినట్లుగా శ్రుతి ఉందని బాలు పంచ్‌లు వేస్తాడు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ జనవరి 20 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ జనవరి 20 ఎపిసోడ్‌

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో శోభనం గదికి బాలు తాళం వేసి వెళ్లడంపై ప్రభావతి టెన్షన్ పడుతుంది. కొత్త కోడలి ముందు పరువంతా పోయిందే అని బాధపడుతుంది ప్రభావతి. తర్వాత మీనా ఫోన్ తీసుకొచ్చి ఇస్తుంది. దాంతో బాలుకు కాల్ చేస్తుంది ప్రభావతి. కానీ, బాలు కాల్ లిఫ్ట్ చేయడు.

కుర్చీలోనే పడుకున్న శ్రుతి

తర్వాత మీనా కాల్ చేసిన బాలు లిఫ్ట్ చేయడు. ఏయ్.. ఇదంతా నీకు తెలియకుండానే జరిగిందా అని ప్రభావతి అంటుంది. దాంతో నీ మీద ఒట్టు అత్తయ్య అని అంటే.. ప్రభావతి షాక్ అయి చూస్తుంది. దాంతో సరే నా మీద ఒట్టు అని మీనా అంటుంది. తర్వాత కిందకు వచ్చేసరికి శ్రుతి నిద్ర వస్తుందని, మావయ్య వచ్చాకా లేపండి అని కుర్చీలోనే పడుకుండిపోతుంది శ్రుతి. తర్వాత రోహిణికి బాలు తాళం వేసుకెళ్లింది చెబుతుంది ప్రభావతి.

తర్వాత కిందకు వచ్చిన మనోజ్‌తో ఏంటీ లేట్ అని రవి అడుగుతాడు. నీకు ఫస్ట్ నైట్ జరగదురా. నీ శోభనం గదికి బాలు గాడు తాళం వేసుకుని వెళ్లిపోయాడు. బాలు గాడు నీకు రూమ్ ఇచ్చేదాకా చాలా నైట్స్ వస్తాయి. కానీ, నీకు ముహుర్తం ఎప్పుడు కుదుర్తుందో. ఇన్నాళ్లు ఎలా సర్దుకుపోయావో అలాగే సర్దుకుపో అని మనోజ్ అంటాడు. దాంతో వెళ్లి ప్రభావతిని అడుగుతాడు రవి. శ్రుతికి తెలిస్తే ఎంత ఫీల్ అవుతుంది అని రవి అంటాడు.

అంతా ఇదే చేసిందని మీనాను నిందిస్తుంది ప్రభావతి. ఇంతలో సత్యం వచ్చి నాకోసమే ఆగారా అని అంటాడు. అప్పుడే శ్రుతి నిద్రలేస్తుంది. మీకోసమే కాదు ఆ బాలు గాడి కోసం కూడా. రూమ్‌కు తాళం వేసుకుని వెళ్లిపోయాడు దుర్మార్గుడు అని ప్రభావతి అంటుంది. ఆ మాటలు విన్న శ్రుతి షాక్ అయి లేస్తుంది. తర్వాత బాలుకు సత్యం కాల్ చేస్తాడు. అది చూసుకున్న బాలు వీళ్లు ఆఖరు అస్త్రాన్ని వదిలినట్టున్నారు. ఇప్పుడెలాగా అని ఆలోచించి లిఫ్ట్ చేస్తాడు.

కోప్పడిన సత్యం

తొందరగా ఇంటికి వచ్చి తాళం తీయు. సంధు చివరే నీ కారు చూశాను. లోపలికి రా అని సత్యం అంటాడు. దాంతో సరే అని వస్తాడు బాలు. మీకు ఇంకా ఏ రూమ్ దొరకలేదా. ఆ రూమ్‌లోనే అరెంజ్ చేయొచ్చు కదా అని శ్రుతి అంటుంది. అడుగుతుంది కదా చెప్పు. వీడంటే వాడికి పడదని తెలిసి ఎందుకు చేశావ్ అని ప్రభావతిని కోప్పడుతాడు సత్యం. విన్నంటే చేసి ఇలా చేస్తాడని అనుకోలేదు అని ప్రభావతి అంటుంది.

బాలు వచ్చి కారు హారన్ కొడతాడు. దాంతో మీనా వెళ్తుంది. ఏంటండి ఇది అని మీనా అడుగుతుంది. వాడు ఇంట్లోకి రావడమే ఇష్టంలేదు. ఇంకా రూమ్ ఇచ్చి నేను బయటకెళ్లాలంటే నాకు మండదా.. నాన్న చెప్పాడని ఇచ్చాను అని రూమ్ తాళం కీ ఇస్తాడు బాలు. ఆ కీని వెళ్లి ప్రభావతికి ఇస్తుంది మీనా. ఈ పెళ్లాం మొగుడులు ఆడే తైతక్కలు మీకెం తెలుసు అని ప్రభావతి అంటుంది. మధ్యలో మీనా జోలికి రాకు అని సత్యం హెచ్చరిస్తాడు.

పదండి ఆశీర్వదిద్దాం అని ప్రభావతి అంటే.. మనమే కాకుండా వాడి కంటే పెద్దవాళ్లు ఇద్దరు అన్నలు, వదినలు ఉన్నారు. వాళ్ల ఆశీస్సులు కూడా కావాలి అని సత్యం అంటాడు. ఇప్పుడు బాలు గాడు లోపలికి వచ్చి ఆశీర్వదిస్తాడా. శాపనర్థాలు పెడతాడా. ఇందాక రవిని తిట్టి బయటకు గెంటేశాడు అని ప్రభావతి అంటుంది. తప్పులేదు. తప్పు చేసిన తమ్ముడిని అన్నాడు. వీడు చేసింది ఏమైనా గొప్ప పనా అని బాలుకు సపోర్ట్‌గా సత్యం మాట్లాడుతాడు.

కొన్ని రోజులే కోపాలు

మొదటి నుంచి మేము ఆయనకు నచ్చదు. ఏదోటి అంటే మేము హర్ట్ అవుతాం అని శ్రుతి అంటుంది. ఏ ఒక్కరు మరోలా ఆలోచించరు. కోపాలు కొన్నిరోజులే అని సత్యం అంటాడు. మీరున్నారుగా. లేకుంటే మీనా ఉంది కదా. తనది చాలా మంచి మనసు అని శ్రుతి అంటుంది. లేదమ్మా కుటుంబం నిండుగా ఉంటేనే నాకు సంతోషంగా ఉంటుంది. బాలు వల్లే ఈ ఇల్లు, సంసారం జరుగుతుంది. వాడు లేకుంటే నాకు లోటుగానే ఉంటుంది అని సత్యం అంటాడు.

దాంతో మీనా పిలవడానికి వెళ్తుంది. వాళ్లను ఆశీర్వదించాలు రండి అని మీనా అంటుంది. దాంతో బాలు సెటైర్లు వేస్తుంది. నేను రాను, నువ్ కూడా వెళ్లకు. రాత్రి ఇక్కడే పడుకుందాం అని బాలు అంటాడు. మీ సరసాలకు ఇదా సమయం. దంపతులను ఆశీర్వదించాలి అని మీనా అంటుంది. ఆ శ్రుతికి డబ్బుందని పొగరు. నాన్నను చాదస్తం అని మొహంమీదే అంది. వాళ్ల నాన్న అయితే అలానే మాట్లాడుతుందా అని బాలు అంటాడు.

ఇప్పుడు వస్తారా లేకపోతే ఇదే విషయం మావయ్య గారికి చెప్పనా అని మీనా అంటుంది. ఆ రవిగాడు, మనోజ్ గాడు నన్ను చాలా రెచ్చగొట్టారు. మా నాన్నకు గుండెపోటు రాడానికి కారణం నేనేనట. ఆ రవిగాడు మనోజ్ గాడు కలిసిపోయి నన్ను చాలా మాటలు అన్నారు. నువ్ కూడా తిడతావా. తిట్టు. పడటం నాకు అలవాటు అయిందని బాలు అంటాడు. మీరు మంచివాళ్లు. నాకు తెలుసు. వాళ్లకు అర్థం కాదు. మీ పెద్దరికం వాళ్లకు తెలియదు. అన్ని దేవుడుకి తెలుసుకదా అని మీనా అంటుంది.

ఎవరినీ ఓర్వలేరు

తర్వాత బాలును లాక్కెళ్తుంది మీనా. చూశారా. ఆ మీనా కూడా అటే వెళ్లింది. అదేం నూరిపోస్తుందో అని ప్రభావతి అంటుంది. మీనాను ఎందుకంటున్నారు ఆంటీ. మీరు ఏం చెబితే తను అదే చేస్తుంది కదా అని శ్రుతి అంటే.. ప్రభావతి నోరెత్తలేకపోతుంది. కరెక్ట్‌గా చెప్పావమ్మా అని సత్యం అంటాడు. ఇంతలో బాలు మీనా వస్తారు. వాళ్లను ఆశీర్వదించాలి అని సత్యం అంటే.. బాలు సెటైర్లు వేస్తాడు. తర్వాత మీనా వెళ్లి అక్షింతలు తీసుకొస్తుంది.

సత్యం, ప్రభావతి, మనోజ్, రోహిణి ఆశీర్వదిస్తారు. బాలు ఆశీర్వదించడానికి ఒప్పుకోడు. మొండిగా మాట్లాడకు అని సత్యం అంటే.. నాతో వాళ్లే అలా మాట్లాడిస్తున్నారు. నా రూమ్ లాగేసి వాడికిస్తే నాకు మంటగా ఉండదా అని బాలు అంటాడు. చూశారా వాడి కడుపు మంట. మొగుడు పెళ్లాం ఎవరిని ఓర్వలేరు అని ప్రభావతి అంటుంది. మధ్యలో నా పెళ్లాన్ని ఎందుకు లాక్కొస్తావ్. ఆ వెర్రిబాగుల్ది ఏం చేసింది. అన్నది నేను. నన్ను అను అని బాలు అంటాడు.

అంకుల్ మీరు, ఆంటీ బ్లెస్ చేశారు. చాలు కావాలంటే మేము మీనా దగ్గర తీసుకుంటాం అని శ్రుతి అంటే.. తీసుకో అని బాలు అంటాడు. తర్వాత బాలుకు నచ్చజెబుతుంది మీనా. తర్వాత బాలు, మీనా దగ్గర ఆశీర్వాదం తీసుకునేందుకు రవి, శ్రుతి కిందకు వంగుతారు. నాకు తిట్లు తప్పా ఆశీర్వాదం రాదు అని బాలు అంటే.. నాకు తెలుసు అని శ్రుతి అంటుంది. చూశావా నాన్న ఆ డబ్‌డమ్మా ఎలా మాట్లాతుందో అని బాలు అంటాడు.

ఎదురుచెప్పిన శ్రుతి

నేను చెప్పినట్లు చెప్పు అని చల్లగా ఉండండి అని సత్యం అంటే.. ఫ్రిజ్‌లో ఉండండి అని బాలు, సంతోషంగా ఉండండి అని సత్యం అంటే.. ఎవరిని మోసం చేయకుండా ఉండండి అని బాలు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు నా ఇల్లును నిండుగా ఉంది. మీరిద్దరు చేసిన తప్పును మర్చిపోయి అని సత్యం అంటుంటే.. అంకుల్. మేమేం తప్పు చేయలేదు. మీరు ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకున్నాం. అందులో తప్పేముంది. అందరు ఒప్పుకుంటే మేమేందుకు సీక్రెట్‌గా చేసుుంటాం అని శ్రుతి అంటుంది.

చూశావా నాన్నా. ఆ సురేంద్రే చీరకట్టుకుని వచ్చి నిలబడినట్లు ఉందని బాలు అంటాడు. దాంతో మీనా ఆపుతుంది. కరెక్టేనమ్మా. కానీ, మీ నాన్న నాపై కేసు పెట్టారు. నాతో చీప్‌గా మాట్లాడారు అని సత్యం అంటే.. అది నా తప్పు కాదు కదా. మా నాన్నతో మాట్లాడుకునే విషయం అది అని శ్రుతి అంటుంది. మీరు చేసింది ముమ్మాటికి తప్పే. వీన్ని కన్నందుకు మేము సర్దుకుపోయాం. మీనా ఏం చేసింది. తననెందుకు మీ పెళ్లిలోకి లాగారు. మీ వల్ల మీనా జీవితం నాశనం అయ్యేది తెలుసా అని సత్యం అంటాడు.

ప్రామిస్ చేసి చెబుతున్నాను. నాకు ఈయన గురించి అప్పుడు తెలియదు. మీనాను అసలు ఇందులోకి లాగేదాన్నే కాదు. అందులోనూ రవి బ్లెస్సింగ్స్ కావాలని అంటే.. మీనాను తీసుకురమ్మన్నాను అని శ్రుతి చెబుతుంది. అది మీకు వరమైంది, మీనాకు శాపమైందని సత్యం అంటాడు. కోడళ్లను ఒకవైపు, కోడుకులును ఒకవైపుకు సత్యం తీసుకొస్తాడు. వాళ్లను చూస్తూ మురిసిపోతాడు సత్యం. కళ్లకు పండగలా ఉందని, ఈరోజు నుంచి మీకు నాకు కూతుళ్లు. మీరంతా కలిసి ఉండాలి అని సత్యం చెబుతాడు.

రవిని గెంటేసిన బాలు

తెలిసి తెలియకా తప్పు చేసిన అంతా సర్దుకుపోవాలి అని సత్యం అంటాడు. అలాగే ఉంటాం అని మీనా, రోహిణి చెబుతారు. తర్వాత మరుసటి రోజు తన రూమ్ నుంచి రవిని బట్టలతో గెంటేస్తాడు బాలు. ఇంకోసారి గదిలో కాలు పెట్టావంటే చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు బాలు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Whats_app_banner