Gunde Ninda Gudi Gantalu: సంజు ట్రాప్‌లో పడ్డ బాలు - భర్త కోసం మీనా రిస్క్ - శృతితో రవి గొడవ
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు జనవరి 1 ఎపిసోడ్‌లో సంజును కిడ్నాప్ చేయాలనే బాలు ప్లాన్ రివర్స్ అవుతుంది. సంజు మనుషులకే బాలు దొరికిపోతాడు. మౌనికతో తన పెళ్లిని బాలు అడ్డుకోకుండా అతడిని కట్టేస్తాడు సంజు. బాలును మీనా సేవ్ చేస్తుంది.
Gunde Ninda Gudi Gantalu: సంజును కిడ్నాప్ చేస్తాడు బాలు. కారు డిక్కీలో సంజును దాచేసి ఫామ్‌హౌజ్ నుంచి జంప్ అవుతాడు. సంజును బాలు కిడ్నాప్ చేయడం చూసిన రోహిణి ఈ విషయం ప్రభావతికి చెబుతుంది. మీనాకు ఈ కిడ్నాప్ ప్లాన్ ముందే తెలిసి ఉంటుందని ప్రభావతి అనుమానపడుతుంది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
బాలు అరెస్ట్...
పెళ్లి ముహూర్తం లోగా బాలును ఎలాగైన పట్టుకొని సంజును విడిపించుకురమ్మని పోలీసులకు చెబుతాడు నీలకంఠం. బాలు కారును ఛేజ్ చేసి పట్టుకుంటారు పోలీసులు. కారులో పెళ్లి కొడుకు లేడని బాలు బుకాయించబోతాడు. సంజును డిక్కీలో బాలు దాచిపెట్టాడని పోలీసులు కనిపెడతారు. సంజును విడిపించి బాలును అరెస్ట్ చేస్తారు.
నీలకంఠం యాక్టింగ్...
సంజు కిడ్నాప్ అయిన విషయం తెలిసినా కూడా సత్యం కుటుంబసభ్యుల ముందు తెలియనట్లుగా నీలకంఠం నటిస్తాడు. ఈ పెళ్లి ఆగిపోతే సంజుకు జీవితంలో ఎవరూ పిల్లను ఇవ్వరని అనుకుంటాడు. సంజును కిడ్నాప్ చేసింది ఈ కుటుంబంలోని వాడే కదా...ఈ సంబంధం అవసరమా అని రేవతి అంటుంది. ఈ బోడి సలహాలు నాకు అక్కరలేదని భార్యకు వార్నింగ్ ఇస్తాడు నీలకంఠం.
మౌనిక భవిష్యత్తు...
సంజును బాలు కిడ్నాప్ చేసిన విషయం సత్యానికి చెబుతుంది ప్రభావతి. మారిపోయినట్లు నమ్మించి పెళ్లి కొడుకును మాయం చేశాడా? పీటల మీద పెళ్లి ఆగిపోతే మౌనిక భవిష్యత్తు ఏమవుతుందని సత్యం కంగారు పడతాడు. బాలు సంగతి చూస్తానని అంటాడు.
పోలీసులు కాదు....
బాలును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి మీనాకు ఫోన్ చేసి చెబుతాడు రాజేష్. బాలును పోలీస్ స్టేషన్‌కు కాకుండా ఓ పాడుబడిన గోడౌన్‌కు తీసుకొచ్చి కట్టేస్తారు. వారు పోలీసులు కాదని తన మనుషులేనని అసలు నిజం సంజు బయటపెడతాడు. నీ ఫ్యామిలీపై పగతోనే మౌనికను పెళ్లిచేసుకోబోతున్నట్లు చెబుతాడు. పెళ్లి తర్వాత నీ చెల్లిని అడ్డుపెట్టుకొని ఒక్కొక్కరిని చెడుగుడు ఆడుకుంటానని బాలుకు వార్నింగ్ ఇస్తాడు.
నేను కరెక్ట్...నువ్వు రాంగ్...
నీ గురించి నేను ఊహించింది కరెక్ట్ అయ్యిందని సంజుకు బాలు రిప్లై ఇస్తాడు. పెళ్లి మండపంలో బయటపడాల్సిన నీ అసలు రూపం ఇక్కడ బయటపడిందని, నేను కరెక్ట్ అని, నువ్వే రాంగ్ అని తెలిసిన తర్వాత నా చెల్లి మెడలో నీ చేత తాళి ఎలా కట్టనిస్తానని సంజును హెచ్చరిస్తాడు బాలు.
ఒక్కసారి కట్లు విప్పితే...నీతో పాటు నీ మనుషులు అందరిని మట్టి కరిపిస్తానని చెబుతాడు. నన్ను ప్రాణాలతో వదిలేస్తే నీకే ప్రమాదమని సంజుకు వార్నింగ్ ఇస్తాడు. పెళ్లి జరిగే వరకు బాలును జాగ్రత్తగా చూసుకోమని, ఆ తర్వాత వదిలేయమని తన మనుషులకు చెబుతాడు సంజు. పెళ్లి మండపానికి బయలుదేరుతాడు.
సంజు ఎంట్రీ...
మరోవైపు నీలకంఠానికి సంజు కిడ్నాప్ అయిన విషయం తెలియదని సత్యం అనుకుంటాడు. బాలు చేసిన పని గురించి చెప్పబోతుండగా...అక్కడికి సడెన్‌గా సంజు ఎంట్రీ ఇస్తాడు. సంజు ఒంటరిగా రావడం, బాలు, మీనా కనిపించకపోవడంతో పార్వతి కంగారు పడుతుంది. పెళ్లి ఆపాలని చూసిన వారు వచ్చిన రాకపోయిన పర్వాలేదని ప్రభావతి అంటుంది.
ఫ్యామిలీని కలవడం ఇష్టం లేదు...
శృతితో కలిసి మౌనిక పెళ్లికి వెళ్లాలని రవి అనుకుంటాడు. కానీ శృతి మాత్రం డబ్బింగ్ స్టూడియో నుంచి ఆలస్యంగా ఇంటికొస్తుంది. తాను పెళ్లికి రానని అంటుంది. నువ్వు ఒక్కడివే వెళ్లి మీ అన్నయ్య బాలు చేత దెబ్బలు, తిట్లు పడమని చెబుతుంది. నీ ఫ్యామిలీని కలవడం నాకు ఇష్టం లేదని అంటుంది. ఎంత చెప్పిన శృతి రానని అనడంతో రవి ఒక్కడే ఒంటరిగా పెళ్లికి వెళ్లాలని ఫిక్సవుతాడు.
సంజు రివేంజ్...
పెళ్లి వేదిక ఎక్కడో తెలియకపోవడంతో అడ్రెస్ కోసం కార్డు ఓపెన్ చేస్తాడు. అందులో పెళ్లి కొడుకుగా సంజు పేరుతో పాటు ఫొటో ఉండటం చూసి రవితో పాటు శృతి షాకవుతారు. తమపై పగతోనే మౌనికను సంజు పెళ్లి చేసుకుంటున్నాడని ఇద్దరు అనుకుంటారు. పెళ్లి ఆపడానికి ప్రభావతికి ఫోన్ చేస్తాడు. కానీ బ్యాండు మేళం సౌండ్ కారణంగా రవి చెప్పింది ప్రభావతికి వినపడదు. అడ్రెస్ కోసం ఫోన్ చేశాడని అనుకొని తొందరగా రమ్మని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. మనోజ్, రోహిణిలకు చేసిన ఫోన్ ఎత్తరు.
తాళికట్టే టైమ్‌లో…
మీనాకు ఫోన్ చేసి అసలు సంగతి చెబుతుంది శృతి. కానీ తాను పెళ్లి మండపంలో లేనని మీరే ఎలాగైనా మౌనికను సంజు బారి నుంచి కాపాడమని రవి, శృతితో చెబుతుంది మీనా. బాలును సంజు దాచిపెట్టిన గోడౌన్‌కు వస్తుంది మీనా. బాలును అపార్థం చేసుకున్నందుకు బాధపడుతుంది. సంజు మనుషులు కళ్లు గప్పి మీనా, రాజేష్ కలిసి బాలు కట్లు విప్పేస్తారు.
సంజు మనుషుల్ని చితక్కొట్టి కళ్యాణ మండపానికి బయలుదేరుతాడు. మౌనిక మెడలో సంజు తాళికట్టే టైమ్‌లో మండపంలోకి వస్తాడు బాలు. డైరెక్ట్‌గా వెళ్లి సంజు కాలర్ పట్టుకుంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.