Gunde Ninda Gudi Gantalu: బాలుకు ఎదురుతిరిగిన శృతి - ఒంటరైన మీనా - ప్రభావతి బ్యాడ్‌లక్
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు ప్రోమోలో రవి, శృతిలను ఆశీర్వదించమని బాలుకు ఆర్డర్ వేస్తాడు సత్యం. కానీ బాలు ఆశీర్వాదం తమకు అవసరం లేదని శృతి గొడవ చేస్తుంది. బ్లెస్సింగ్స్ అడుక్కోవాల్సిన ఖర్మ మాకు పట్టలేదని బాలును తక్కువ చేసి మాట్లాడుతుంది.
Gunde Ninda Gudi Gantalu: బాలుకు సారీ చెప్పి అతడితో గొడవలకు పుల్‌స్టాప్ పెట్టాలని రవి ప్రయత్నిస్తాడు. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా శృతిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సివచ్చిందో అర్థమయ్యేలా బాలుకు వివరిస్తాడు. కానీ రవి మాటలను బాలు నమ్మడు. నీ వల్లే నాన్న చాలా ఏళ్లుగా భద్రంగా కాపాడుకుంటూ వస్తోన్న పరువుమర్యాదలు పోయాయని, ఆయన హార్ట్ ఎటాక్ వచ్చిదంటూ రవిపై ఫైర్ అవుతాడు. అతడిని కొట్టబోతాడు. రవి చేసింది తప్పేనని అంటాడు, రవి, శృతిలకుసపోర్ట్ ఇస్తోన్న తల్లి ప్రభావతిని కక్షవతమ్మ అంటూ నానా మాటలు అంటాడు బాలు. రవిని కొట్టబోతాడు బాలు.

మనోజ్ అండ...
రవికి సపోర్ట్‌గా గొడవలోకి మనోజ్ ఎంట్రీ ఇస్తారు. తాగొచ్చి నువ్వు చేస్తోన్న గొడవల వల్లే ఇంట్లో ప్రశాంతత లేకుండాపోయిందని బాలుతో వాదిస్తాడు. నీ కోపం, మూర్ఖత్వమే గొడవలకు కారణమని, నాన్నకు హార్ట్ ఎటాక్ రావడానికి కారణం నువ్వేనని బాలుపై రవి, మనోజ్ నిందలు వేస్తారు.
రూమ్‌కు తాళం...
రవి, మనోజ్ ఒక్కటైపోవడం బాలు సహించలేకపోతాడు. రవిపై రివేంజ్ తీర్చుకోవాలని ఫిక్సైపోతాడు. రవి, శృతిలకు శోభానాన్ని అడ్డుకోవాలని అనుకుంటాడు. ఫస్ట్ నైట్ కోసం డెకరేట్ చేసిన రూమ్‌కు తాళం వేసి బయటకు వెళ్లిపోతాడు.
మీనాపై అరిచిన అత్త...
శోభనం గదికి తాళం వేసి ఉండటం చూసి ప్రభావతి లబోదిబోమని అంటుంది. మీనానే తాళం వేసిందని ఆమెపై అరుస్తుంది. నేను మీతోనే ఉన్నాను కదా...ఎలా తాళం వేస్తానని అత్తకు మీనా బదులిస్తుంది. ఇది బాలు చేసిన పనే అని ఇద్దరు కనిపిపెడతారు. సొంత తమ్ముడికి శోభనం జరగకుండా ఇలా అడ్డుకంటున్నాడేంటి దరిద్రుడు అని బాలుపై కోప్పడుతుంది. బాలు మేడపై కనిపించకపోవడంతో టెన్షన్ పడతారు.
సత్యం ఫోన్ కాల్‌తో...
ప్రభావతి, మీనా ఎన్నిసార్లు ఫోన్ చేసిన బాలు లిఫ్ట్ చేయడు. చివరకు సమస్య గురించి సత్యానికి చెబుతుంది ప్రభావతి. సత్యం ఫోన్ చేయడంతో బాలు ఇంటికిస్తాడు.
బాలు బెట్టు...
సత్యం, ప్రభావతితో పాటు కుటుంబసభ్యుల ఆశీర్వాదం తీసుకోవాలని రవి, శృతి అనుకుంటారు. బాలు ఇంట్లోకి రాకుండా బయటే ఉంటాడు. కొత్త దంపతులను ఆశీర్వదించడానికి ఇంట్లోకి రమ్మని బాలును పిలుస్తుంది మీనా. బాలు రానని బెట్టు చేస్తాడు. నేను రాను...నువ్వు కూడా ఆశీర్వదించడానికి వీలు లేదని, మనోజ్, రవి తనను నానా మాటలు అన్నారని బాలు కోపంగా అంటాడు. బాలును బుజ్జగించి ఇంట్లోకి తీసుకెళుతుంది మీనా.
ఆశీర్వాదాలు అవసరం లేదు...
లోపల అడుగుపెట్టిన బాలుతో రవి, శృతిలను ఆశీర్వదించమని సత్యం ఆర్డర్ వేస్తాడు. మీరు ఉన్నారుగా అని తండ్రికి బాలు సమాధానమిస్తాడు. మీరు, అత్తయ్య మమ్మల్ని ఆశీర్వదించారు అది చాలు అని కోపంగా శృతి అంటుంది. బ్లెస్సింగ్స్ కోసం అడుక్కోవల్సిన ఖర్మ మాకు పట్టలేదని బాలుకు తన మనసులో ఉన్న ద్వేషాన్ని శృతి బయటపెడుతుంది.
శృతి పొగరు...
పొగురగా శృతి అన్న మాటల్ని బాలు సహించలేకపోతుంది. అచ్చ సురేంద్రలాగే మాట్లాడుతుందని అంటాడు. తన ముందే తండ్రిని బాలు కించపరుస్తూ మాట్లాడటం శృతి తట్టుకోలేకపోతుంది. బాలుతో గొడవ పడినట్లుగా ప్రోమోలో చూపించారు.
ఈ గొడవల కారణంగా బాలు, మీనా ఓ పార్టీ, రవి, శృతి, మనోజ్ రోహిణి మరో పార్టీగా మారిపోతారు. సత్యం ఫ్యామిలీ ముక్కలు కాబోతున్నట్లు సోమవారం నాటి ఎపిసోడ్‌లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. శృతి తన గ్రిప్‌లో పెట్టుకొని ఆమె ఆస్తిని సొంతం చేసుకోవాలకు ప్రభావతి కలలకు పుల్‌స్టాప్ పడుందా లేదా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఆసక్తికరంగా మారనుంది.