Gunde Ninda Gudi Gantalu: బాలుతో రవి వార్ - ఒక్కటైన శృతి, రోహిణి- ప్రభావతి పరువు గోవిందా
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు జనవరి 17 ఎపిసోడ్‌లో బాలుతో మాట్లాడి అతడికి క్షమాపణలు చెప్పాలని రవి ప్రయత్నిస్తాడు. రవి మాటల్ని బాలు వినడు. దాంతో బాలుపై రవి రివర్స్ అవుతాడు. నీ కోపం, మూర్ఖత్వం వల్లే నాన్నకు హార్ట్ ఎటాక్ వచ్చిందని బాలును నానా మాటలు అంటాడు రవి.
Gunde Ninda Gudi Gantalu: ఫస్ట్ నైట్ కోసం శృతిని అందంగా రోహిణి రెడీ చేస్తుంది. రోహిణి వెళ్లిపోయిన తర్వాత శృతి దగ్గరకు మీనా వస్తుంది. శృతి చీర కుచ్చిళ్లను సరిచేస్తుంటుంది. ఆ సీన్ చూసిన ప్రభావతి మీనాపై కోపంతో ఎగిరిపడుతుంది.
కిచెన్‌లోకి వెళ్లి పాలు తీసుకురా అని ఆర్డర్ వేస్తుంది. పాలే కదా తెస్తానని మీనా సమాధానం ఇవ్వడంతో ప్రభావతి సహించలేకపోతుంది. చద్దన్నం తినేవాళ్లకు పాల విలువ ఏం తెలుస్తుందని తీసిపడేస్తూ మాట్లాడుతుంది.
నగలపై ఆరాలు…
మీనా ఒక్కదానికే అన్ని పనులు ఎందుకు చెబుతున్నారు ఒక్కతే ఎన్నని పనులు చేస్తుందని ప్రభావతిని శృతి అడుగుతుంది. నాకు పనులు చేయడం రాదని, మీనా అయితే బాగా చేస్తుందని ప్రభావతి బదులిస్తుంది. శృతి మెడలో నగలేవి కనిపించకపోవడం చూసి ప్రభావతి అనుమానపడుతుంది.
నగలు ఎందుకు వేసుకోలేదు...బ్యాగులో దాచావా అని అడుగుతుంది. నగలు వేసుకోవడం తనకు ఇష్టం ఉండదని, మా నాన్న కొన్న నగలు ఇంట్లోనే ఉండిపోయానని శృతి అంటుంది. ఏదో ఒక రోజు ఆ నగలు తనకు వస్తే చాలని మనసులో ప్రభావతి అనుకుంటుంది.
తేడా వస్తే సంగతి చూస్తా...
కిచెన్‌లోకి పాలు కాస్తోన్న మీనా దగ్గరకు వచ్చి పాలు ఇంకా కాచడం అయిపోలేదా అని కసురుకుంటుంది ప్రభావతి. ఇప్పుడే చెప్పారు కదా కాస్తున్నానని మీనా అనడంతో మాటకు మాట ఎదురుచెబుతావేంటి అని కోడలిపై కోప్పడుతుంది ప్రభావతి. పాలు కాయడంతో ఏదైనా తేడా వస్తే నీ సంగతి చెబుతానని వార్నింగ్ ఇస్తుంది. అత్త మాటలతో మీనా నొచ్చుకుంటుంది.
ప్రభావతికి షాక్…
పాలల్లో ప్రభావతి ఇచ్చిన కుంకుమపువ్వుతో పాటు డ్రై ఫ్రూట్స్ కలిపి సిద్ధం చేసి పెట్టి కిచెన్ నుంచి బయటకు వస్తుంది. అప్పుడే కిచెన్‌లోకి ఎంటరైన బాలు ఆ పాలు తన కోసమే మీనా కలిసి ఉంచిదనుకొని మొత్తం తాగేస్తాడుబాలు పాలు తాగాడని తెలిసి ప్రభావతి చిందులు తొక్కుతుంది. ఏం జన్మరా నీది..ఒక్క మంచి పని కూడా చేయవా అని కొడుకును దులిపేస్తుంది.
రవి, శృతిలకు ఇవ్వమంటే ఈ దరిద్రుడికి ఎందుకు ఇచ్చావని మీనాను కోప్పడుతుంది. నేను ఎక్కడ ఇచ్చాను. బాలు తెలియక తాగి ఉంటాడని మీనా బదులిస్తుంది. పాల బిల్లు నేను కడుతున్నాను కదా అని బదులిచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.బాలు బాగా ఓవర్ చేస్తున్నాడని రోహిణి, మనోజ్ అంటారు.
నీచుడిలా చూడొద్దు...
మేడపైన ఉన్న బాలుతో మాట్లాడటానికి వస్తాడు రవి. కానీ తమ్ముడితో మాట్లాడటానికి బాలు ఒప్పుకోడు. తనను పెళ్లి చేసుకోకపోతే శృతి చచ్చిపోతానని అన్నది, అందుకే మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నానని రవి అంటాడు. శృతి ప్రేమ కోసం పాతికేళ్లు నిన్ను కని పెంచిన వాళ్లు చనిపోతే పర్వాలేదని అనుకున్నావా అని రవికి క్లాస్ ఇస్తాడు బాలు.
కొడుకు అన్నాకా కన్నవాళ్లపై కొంతైనా కనికరం ఉంటాడని చెబుతాడు. తనను నీచుడిలా చూడొద్దని, తాను ఏం తప్పు చేయలేదని బాలును బతిమిలాడుతాడు రవి. తనను క్షమించమని, నీ మాటకు మళ్లీ ఎప్పుడు ఎదురుచెప్పనని అంటాడు. తెంచుకుంటే తెగిపోయేది మన బంధం కాదని రవి ఎమోషనల్ అవుతాడు.
ఆ రోజులు మర్చిపోయావా...
నువ్వు నా కోసం ఎంత చేశావు..చిన్నతనంలో ఎప్పుడు నా చేయి వదిలేవాడివి కాదు...నన్ను భుజాలపై ఎత్తుకొని తిరిగిన రోజులు మర్చిపోయావా అని రవి ఎమోషనల్ అవుతాడు. నాన్న తర్వాత నాకు అన్ని నువ్వేనని రవి ఎంత చెప్పిన బాలు వినడు. ఈ సినిమా డైలాగ్స్‌కు తాను కరిగిపోనని బాలు అంటాడు. ఇవన్నీ నీతో శృతి చెప్పిస్తుందా అని అనుమానిస్తూ మాట్లాడుతాడు.
క న్న తండ్రిని జైలు పెట్టించిన నిన్ను క్షమించనని అంటాడు. నాతో మాట్లాడవద్దని, అక్కడి నుంచి వెళ్లిపొమ్మని అంటాడు. తండ్రి జైలులో వెళ్లింది, మానసిక క్షోభ అనుభవించి అంత నీవల్లేనని చెబుతాడు. నీ వల్లే నాన్నకు హార్ట్ ఎటాక్ వచ్చిందని రవితో అంటాడు బాలు.
రవి రివర్స్...
నాన్నకు హార్ట్ ఎటాక్ వచ్చింది నీ వల్ల అయితే నన్ను అంటావేంటి బాలుపై రివర్స్ అవుతాడు రవి. నువ్వు రోజు తాగొచ్చి ఇంట్లో గొడవలు పెట్టుకోవడం వల్లే నాన్నకు హార్ట్ ఎటాక్ వచ్చిందని రవి అంటాడు. నీ కోపం, మూర్ఖత్వం వల్లే నాన్నకు ఆ పరిస్థితి వచ్చిందని రవి కోపంగా మాట్లాడుతాడు.
నా ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి ఒప్పించాలని అనుకున్నాను. కానీ నువ్వు శృతి తండ్రిని కొట్టడం వల్లే వాళ్లతో మనకు ఉన్న శత్రుత్వం ఎక్కువైందని రవి అంటాడు. నీ కోపం నీకు శత్రువు అని రవి అనగానే కోపం పట్టలేని బాలు అతడిని కొట్టబోతాడు. మనోజ్ వచ్చి అడ్డుకుంటాడు చేయి దించమని బాలుకు ఆర్డర్ వేస్తాడు.
మనోజ్ సపోర్ట్...
మనోజ్ మాట్లాడిన దాంట్లో ఏ తప్పు లేదని మనోజ్ అంటాడు. నాన్నకు హార్ట్ ఎటాక్ రావడానికి నీ కోపమే కారణమని మనోజ్ కూడా బాలునే తప్పు పడతాడు. నువ్వు కొట్టని వాళ్లు నాన్న తప్ప ఇంట్లో ఎవరైనా ఉన్నారా? మేము రివర్స్ అయితే నీ పరిస్థితి ఏమిటని బాలుకు క్లాస్ ఇస్తాడు మనోజ్.
మోసగాళ్లు ఒక్కటి...
బాలుకు భయపడాల్సిన అవసరం లేదని రవితో అంటాడు మనోజ్. నాన్న పెన్షన్ డబ్బులు పట్టుకొని పారిపోయిన నువ్వు నాకు సలహాలు ఇస్తున్నావా అని మనోజ్‌పై రివర్స్ ఎటాక్ చేస్తాడు బాలు. ఇద్దరు మోసగాళ్లు ఒక్కటయ్యారని రవి, మనోజ్‌లను అంటాడు. ఈ మూర్ఖత్వమే తగ్గించుకుంటే మంచిదని, లేదంటే ఇంట్లో గొడవలు ఆగవని, ఎ వరూ సంతోషంగా ఉండరని రవి అంటాడు.
రవి మాటలతో బాలు కోపం ఆపుకోలేక మరోసారి కొట్టబోతాడు. మనోజ్ అడ్డుకుంటాడు. బాలుతో మాట్లాడటం వేస్ట్ అని రవిని అక్కడి నుంచి తీసుకుపోతాడు.
రూమ్‌కు లాక్...
రవి తనకు రివర్స్ కావడం, నానా మాటలు అనడంతో బాలు సహించలేకపోతాడు. నీకు శోభనం ఎలా జరుగుతుందో నేను చూస్తానని అనుకుంటాడు. రవి, శృతి ఫస్ట్ నైట్ కోసం అరెంజ్ చేసిన రూమ్‌కు తాళం వేసి కీ తీసుకొని బయటకు వెళ్లిపోతాడు. రూమ్‌కు లాక్ వేసి ఉండటం చూసి ప్రభావతి షాకవుతుంది. శృతి ముందు తన పరువు మొత్తం పోయిందని గగ్గోలు పెడుతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.