Gunde Ninda Gudi Gantalu: బాలును శాడిస్ట్ అన్న శృతి - మీనాకు విడాకులు ఇప్పించేందుకు స్కెచ్ - మనోజ్ గుట్టురట్టు
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు జనవరి 16 ఎపిసోడ్‌లో శృతి ఇచ్చే షాకులకు ప్రభావతి విలవిలలాడుతుంది. రవిని తన కళ్ల ముందే తీసిపడేసి మాట్లాడటం తట్టుకోలేకపోతుంది. మరోవైపు బాలు శాడిస్ట్ అని, మీనాకు అతడిని నుంచి విడాకులు ఇప్పిస్తే మంచిదని రోహిణితో అంటుంది శృతి.
Gunde Ninda Gudi Gantalu: గెస్ట్ హౌజ్ ఖాళీ చేసి ఇంటికొస్తారు రవి, శృతి. వారిని చూడగానే హమ్మయ్య వచ్చారా ఆలస్యమయ్యేసరికి కంగారు పడ్డానని ప్రభావతి అంటుంది. అటు నుంచి అటే మళ్లీ పారిపోయామని అనుకున్నారా అని శృతి పంచ్‌లు వేస్తుంది. రవి, శృతిలను భోజనం చేయమని ప్రభావతి చెబుతుంది.
అల్రెడీ మేము బయట తినేసివచ్చామని రవి బదులిస్తాడు. బయట ఎందుకు తిన్నారు అని ప్రభావతి ఇద్దరిని నిలదీస్తుంది. మేము బయట తినడానికి మీ మమ్మి పర్మిషన్ తీసుకోవాలా అని రవిపై ఫైర్ అవుతుంది శృతి. నేను బయట తినడం వల్లే వీడు దొరికాడని రవిని తీసిపడేసి మాట్లాడుతుంది శృతి.
శోభనం తిప్పలు...
మీ లగేజీ పై రూమ్‌లో పట్టుకోమని రవి, శృతితో అంటుంది ప్రభావతి. అది బాలు రూమ్ కదా అని భయంగా రవి అంటాడు. ఈ రోజు నుంచి మీరు ఆ రూమ్‌లోనే ఉండాలని ప్రభావతి ఆర్డర్ వేస్తుంది. . మీరు రెడీ అయ్యి వస్తే ఇంకో సంప్రదాయం ఉందని ప్రభావతి అంటుంది. ఈ ట్రెడిషన్స్ పాటించడం తన వల్ల కాదని శృతి అంటుంది.
శోభనం గురించి ఇన్‌డైరెక్ట్‌గా ప్రభావతి, రోహిణి ఎంత చెప్పిన రవి, శృతిలకు అర్థం కాదు. శోభనం గురించి శృతికి చెప్పడానికి తెగ తిప్పలు పడుతుంది ప్రభావతి. తెలుగులో ఆమె చెప్పిన మాటలేవి అర్థం కాకపోవడంతో ఈ రోజు మీకు ఫస్ట్ నైట్ అని రోహిణి అసలు నిజం చెప్పేస్తుంది. ఈ మాట ఏదో అప్పుడే చెప్పొచ్చుగా...ఇంటర్నేషనల్ లెవెల్‌లో సీక్రెట్ అన్నట్లుగా ఈ డొంక తిరుగుడు మాటలు ఎందుకు అని శృతి ఈజీగా తీసుకుంటుంది. రవికి కూడా నేనే ఈ విషయం చెబుతానని అంటుంది.
బాలు, మీనాకు కష్టాలు...
ఫస్ట్ నైట్ అనగానే శృతి సిగ్గుపడుతుందని ప్రభావతి, రోహిణి ఊహిస్తారు. కానీ ఆమె స్పీడు, వాలకం చూసి ఇద్దరు షాకవుతారు. మేడపై ఒంటరిగా ఉన్న బాలు పాటలు పాడుకుంటూ ఉంటాడు. చాప వేసుకొని పడుకోవడానికి సిద్ధపడతాడు. నలభై లక్షలు మింగినోడు, లేచిపోయినాడు, ఇళ్లు తాకట్టు పెళ్లినవాళ్లు అందరూ బాగున్నారని, ఏ తప్పు చేయమని తమకు మాత్రం కష్టాలు వచ్చిపడ్డాయని బాలు అనుకుంటాడు.
బయటపడ్డ రవి సీక్రెట్...
శోభనం ఏర్పాట్లు ఆలస్యం చేస్తున్నావని మీనాపై కోప్పడుతుంది ప్రభావతి. ఫస్ట్ నైట్ కోసం మామూలు డ్రెస్‌లోనే శృతి ఉండటం చూసి ప్రభావతి షాకవుతుంది. చీర కట్టుకోమని అంటుంది. తనకు చీర కట్టుకోవడం రాదని, ఎప్పుడైనా పండగలకు రవి చీర కట్టేవాడని శృతి అంటుంది. తన సీక్రెట్స్ ఒక్కొకటిగా తల్లి మందు బయటపడుతుండటంతో రవి ఫోన్ వచ్చినట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
మీనాపై ఫైర్...
శృతికి తాను చీర కడతానని మీనా అంటుంది. అవసరం లేదని ఆమెను కసురుకుంటుంది ప్రభావతి. రోహిణిని పిలిచి శృతికి అందంగా రెడీ చేయమని అంటుంది. చీర కట్టమని చెబుతుంది. శృతి ఇస్తోన్న షాకులకు తన బుర్ర వేడెక్కిపోతుందని అనుకుంటుంది.
శృతి సంబరం...
శృతిని అందంగా రెడీ చేస్తుంది రోహిణి. తనకు మీనా, రోహిణి రూపంలో ఇద్దరు అక్కలు దొరికారని శృతి సంబరపడిపోతుంది. మలేషియాలో మీ ఇళ్లు ఎక్కడ అని రోహిణిని అడుగుతుంది శృతి. తనకు అక్కడ స్నేహితులున్నారని అంటుంది. శృతికి సమాధానం చెప్పకుండా నోర్‌మూస్తావా అని రోహిణి అంటుంది. ఆ తర్వాత లిప్‌స్టిక్ పెట్టడానికి నోరూ మూయమని అన్నానని కవర్ చేస్తుంది.
మా వల్ల నిందలు...
మీ పెళ్లి మీనానే చేసిందా అని శృతిని అడుగుతుంది రోహిణి. అసలు మా పెళ్లి జరుగుతున్నట్లు కూడా మీనాకు తెలియదని ఆ రోజు ఏం జరిగిందో రోహిణికి వివరిస్తుంది శృతి. మీనా తమకు ఎంతో సాయం చేసిందని అంటుంది. మా వల్ల ఎన్నో నిందలు పడిందని చెబుతుంది. కానీ బాలు మాత్రం మంచివాడు కాదని, తాగొచ్చి గొడవలు పడుతుంటాడని శృతి అంటుంది.
మీనాకు విడాకులు...
బాలుతో మీనా ఎలా వేగుతుందోనని , అలాంటి శాడిస్ట్‌తో కలిసి బతకడం కంటే మీనాకు విడాకులు ఇప్పించడం మంచిదంటూ శృతి అనడంతో రోహిణి షాకవుతుంది. మీనాతో మాట్లాడి ఆమెకు మనం ఇద్దరం కలసి విడాకులు ఇప్పిద్దామని రోహిణితో అంటుంది. శృతి మాటలు విని రోహిణి వణికిపోతుంది.
మనోజ్ జాబ్ గురించి రోహిణిని అడుగుతుంది శృతి. తన భర్త కార్ షోరూమ్‌లో పనిచేస్తున్నాడని గొప్పలు చెబుతుంది రోహిణి. తాను, రవి కలిసి ఓ కారు కొందామని అనుకుంటున్నామని, మనోజ్ ద్వారా కారు ఇప్పించమని అంటుంది. తన జాబ్ సీక్రెట్ ఎక్కడ బయటపడుతుందోనని మనోజ్ వచ్చి టాపిక్ డైవర్ట్ చేస్తాడు. రోహిణిని తమ రూమ్‌కు తీసుకొస్తాడు.
మలేషియా టాపిక్...
శృతికి దూరంగా ఉండమని రోహిణికి సలహాలు ఇస్తాడు మనోజ్. శృతికి డబ్బున్న అమ్మాయి అని, ఆమెతో రిలేషన్ కొనసాగించడం మనకు హెల్పవుతుందని రోహిణి అంటుంది. మీ నాన్నే బాగా రిచ్...వాళ్లతో మనకు అవసరం లేదని మనోజ్ అంటాడు. మళ్లీ మలేషియా టాపిక్ రావడంతో రోహిణి కంగారు పడతాడు.
భార్యభర్తల్ని విడదీయాలని అనడం, విడాకులు అంటూ శృతి ఏదేదో మాట్లాడుతుందని అందుకే ఆమెకు దూరంగా ఉండమని అంటున్నానని మనోజ్ అంటాడు. నువ్వు జెంటిల్‌మెన్ కదా...మంచి జాబ్ ఉందని మనిద్దరం ఎందుకు విడిపోతామని రోహిణి అంటుంది. భార్య తనపై పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ చూసి మనోజ్ టెన్షన్ పడిపోతాడు.
మనోజ్ అబద్దాలు...
శృతి, రవి కారు కొనాలని అనుకుంటున్నారని, వారికి నువ్వే డిస్కౌంట్ ఇప్పించమని మనోజ్‌తో అంటుంది రోహిణి. ఇంట్లో వాళ్లకు డిస్కౌంట్ ఇవ్వరని అబద్ధం ఆడుతాడు. రవి కంటే మనమే ముందు కారు కొందామని భార్యకు అబద్దపు ప్రామిస్ చేస్తాడు. శృతిని అడ్డుపెట్టుకొని సొంతంగా ప్లారర్ పెట్టాలనే తన ఐడియాను మనోజ్‌కు చెబుతుంది రోహిణి. అల్రెడీ నీకు సొంతంగా పార్లర్ ఉందిగా అని మనోజ్ అనగానే...కొత్త బ్రాంచ్‌లు అని అబద్ధం చెబుతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.