Gunde Ninda Gudi Gantalu: మీనాను మోసం చేసిన ప్రభావతి - భార్యకు సపోర్ట్‌గా బాలు ఫైట్ - రవి, శృతి శోభనం క్యాన్సిల్
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు జనవరి 15 ఎపిసోడ్‌లో బాలు రూమ్‌లో రవి, శృతి కోసం శోభనం ఏర్పాటు చేయిస్తుంది ప్రభావతి. వారికి తన రూమ్ ఇచ్చేది లేదని తల్లితో గొడవపడతాడు బాలు. తన రూమ్‌కు లాక్ వేసుకొని బయటకు వెళ్లిపోతాడు.
Gunde Ninda Gudi Gantalu: తన ఫ్యామిలీతో పాటు మనోజ్, రోహిణి గురించి గొప్పలు చెబుతూ అడ్డంగా బుక్కైపోతుంది ప్రభావతి. అత్త అబద్దాలను శృతి ఈజీగా కనిపెట్టేస్తుంది. మలేషియాలోని ట్విన్ టవర్స్‌కు రోహిణి తండ్రి ఓనర్ అని చెబుతుంది ప్రభావతి. అది టూరిస్ట్ స్పాట్ అని, ఈ మాట మలేషియాలో అంటే రోహిణి తండ్రితో పాటు మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారని ప్రభావతి గాలి తీసేస్తుంది శృతి. ప్రభావతి బిల్డప్పుల వల్ల తన నాటకం ఎక్కడ బయటపడుతుందోనని రోహిణి కంగారు పడుతుంది.
ప్రభావతి డైలామా...
తాను అలిసిపోయానని రెస్ట్ తీసుకుంటానని శృతి అంటుంది. రవి, శృతిలకు సఫరేట్‌గా రూమ్ లేకపోవడంతో ఏం చేయాలో తెలియక ప్రభావతి డైలమాలో పడుతుంది. తమ రూమ్ ఎక్కడ అడుగుతారో అని రోహిణి, మనోజ్ అక్కడి నుంచి జంప్ అవుతారు.
ఇటుకరాయి తీసేయ్...
మీనా రూమ్‌లో బట్టలు సర్ధుతుండగా అక్కడికి వస్తుంది ప్రభావతి. రూమ్ మొత్తం నీట్‌గా సర్దమని అంటుంది. ఆ రూమ్‌లో ఉన్న ఇటుకరాయిని తీయమని ఆర్డర్ వేస్తుంది. ఈ ఇటుకరాయి తీయడం మాత్రం కుదరదని మీనా అంటుంది. నా తల బద్దలు కొట్టే టైమ్ కోసం చూస్తున్నావా అని ప్రభావతి అనుమానంగా అడుగుతుంది. ఆ ఇటుకరాయికి రోజు మీ అబ్బాయి పూజలు చేస్తున్నాడని మీనా బదులిస్తుంది.
పూల దుకాణం కోసం...
గదిని శుభ్రం చేసి ధూపం వేయమని మీనాకు ఆర్డర్ వేస్తుంది ప్రభావతి. ఎందుకు ఈ గది ఏమైనా అద్దెకు ఇస్తున్నారా అని అత్తయ్యను మీనా అడుగుతుంది. అవును మీ అమ్మవాళ్లను పూల దుకాణం పెట్టుకోమని అంటూ ప్రభావతి సెటైర్లు వేస్తుంది. రవి, శృతి శోభనానికి ఈ గదిలోనే ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభావతి చెబుతుంది. మా రూమ్ వారికి ఇవ్వాలా అని మీనా అనగానే...నా ఇంట్లో నీ పర్మిషన్స్ ఏంటి, నీకు ఈ రూమ్ ఏం రాసివ్వలేదని అని మీనా ఫైర్ అవుతుంది ప్రభావతి.
గతిలేనివాళ్లం కాదు...
రవి, శృతిలకు మా రూమ్ ఇస్తే మేము ఎక్కడ పడుకోవాలని మీనా అంటుంది. ఏ రాణిగారికి బెడ్ లేనిది నిద్ర రాదా...నీ ఇళ్లు ఎలా ఉందో...అక్కడ ఎలా బతికావో మర్చిపోయావా.. పెకి జరిగినా, కిందకు జరిగినా తల, కాళ్లు గొడవలకు తగులుతాయని మీనా పుట్టింటి గురించి తక్కువ చేసి మాట్లాడుతుంది ప్రభావతి. తన పుట్టింటిని కించపరుస్తూ అత్త మాట్లాడటం మీనా సహించలేకపోతుంది. మేమేం మరి అంత గతిలేని వాళ్లం కాదని అంటుంది.
సెంటిమెంట్‌డైలాగ్స్..
రవికి రూమ్ ఇవ్వడానికి బాలు ఒప్పుకోడని మీనా అంటుంది. బాలును నువ్వే ఒప్పించమని మీనాతో అంటుంది ప్రభావతి. అత్తింట్లో తమకు సఫరేట్‌గా రూమ్ లేదని తెలిస్తే శృతి ఎక్కడ ఇంట్లో నుంచి వెళ్లిపోతుందోనని ప్రభావతి కంగారు పడుతుంది. తన అవసరం కావడంతో మీనాను బతిమిలాడటం మొదలుపెడుతుంది ప్రభావతి. రవి, శృతి పెళ్లి చేసింది నువ్వే...వారిని ఇంటికి తీసుకొచ్చింది నువ్వే...వారు బాగుండాలని నీకు లేదా అని సెంటిమెంట్‌డైలాగ్స్ కొట్టి మీనాను మనసు మార్చే ప్రయత్నం చేస్తుంది ప్రభావతి.
పెద్ద కోడలివి...
నువ్వు ఈ ఇంటికి వచ్చిన మొదట కోడలివి ఆ మాత్రం అర్థం చేసుకోలేవా అని అడుగుతుంది. పెద్ద కోడలిని అనే విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా అంటూ మీనా పంచ్‌లు వేస్తుంది.
లోలోన మీనా మాటలకు కోపం వస్తున్నా...పైకి మాత్రం నవ్వుతూ మాట్లాడుతుంది ప్రభావతి. రూమ్‌ను రవి, శృతిలకు ఇవ్వడానికి బాలును ఒప్పించేలా చేస్తానని మీనా దగ్గర మాట తీసుకుంటుంది. ఇష్టం లేకపోయినా అత్తకు మాటిస్తుంది మీనా.
శోభనం ఏర్పాట్లు...
డ్యూటీ ముగించుకొని ఇంటికొస్తాడు బాలు. ప్రభావతి, మీనా అతడికి హాల్‌లోనే ఆపుతారు. వారి మాటల్ని పట్టించుకోకుండా బాలు తన రూమ్‌కు వెళతాడు. రూమ్ మొత్తం పూలతో డెకరేట్ చేసి ఉండటం చూసి బాలు షాకవుతాడు. తమ కోసమే మీనా ఆ అరేంజ్‌మెంట్స్ చేసిందని బాలు పొరపడతాడు.
పూలు, పళ్లు ఉంటే బాగుండేదని బాలు అంటాడు. ఇవన్నీ మన కోసం కాదని, రవి, శృతి శోభనం కోసంఏర్పాటు చేసినట్లు మీనా చెబుతుంది. వాళ్ల కోసం మన రూమ్‌లో శోభనం ఏర్పాట్లు చేస్తావా అని మీనాపై కోప్పడుతాడు. అత్తయ్యే ఈ అరెంజ్‌మెంట్స్ చేయమని చెప్పిందని మీనా అనగానే ఇప్పుడే తేల్చుకుంటానని కిందికి దిగుతాడు బాలు. ప్రభావతితో గొడవకు దిగుతాడు. తన గదిలో శోభనం జరగడానికి వీలులేదని ఖరాఖండిగా చెప్పేస్తాడు.
మనోజ్ జోక్యం…
మధ్యలో మనోజ్ జోక్యం చేసుకున్న మనోజ్...రవి, శృతిలకు సపోర్ట్‌గా మాట్లాడుతాడు. ఎవరు ఎంత చెప్పిన బాలు వినడు. లేచిపోయినోళ్లకు జరిగింది ఓ పెళ్లి...మళ్లీ దానికి ఓ శోభనం అని బాలు అంటాడు.
నీ భార్యే దగ్గరుండి వాళ్ల పెళ్లి చేసిందని మనోజ్ అంటాడు. మీరు దగ్గరుండి ఫొటో తీశారా అని మీనా ధీటుగా బదులిస్తుంది. గొడవ ముదరడంతో బాలును రెచ్చగొట్టింది నువ్వే అని మీనాపై కోప్పడుతుంది ప్రభావతి.
నా భార్యను అంటే ఊరుకునేది లేదు...
రోహిణి, శృతిని పల్లెత్తు మాట అనకుండా నా భార్యను అంటావేంటి. ఇంకోసారి నా భార్యను ఏమన్నా ఊరుకునేది లేదని ప్రభావతికి వార్నింగ్ ఇస్తాడు. ఏమన్నా అమ్మ ఆస్తి అడిగిందా...నీ రూమ్ అడిగింది అంతే కదా మనోజ్ అంటాడు. అయితే నీ రూమ్ ఇవ్వొచ్చుగా...మీరు హాల్‌లో పడుకోవచ్చుగా అని బాలు అనగానే మనోజ్ సైలెంట్ అయిపోతాడు. నువ్వు, వాడు తేల్చుకొండి...నాకేం సంబంధం లేదని తల్లికి చెప్పి తనకు ఉదయం ఆఫీస్ ఉందని అక్కడి నుంచి మనోజ్ జారు కుంటాడు.
కాళ్లు నరికేస్తా...
రవి, శృతి తన రూమ్‌లో అడుగుపెడితే కాళ్లు నరికేస్తానని బాలు కోపంగా అంటాడు. బాలునుపక్కకు తీసుకెళుతుంది మీనా. రవి, శృతిలను మావయ్య క్షమించారని, మీరు మాత్రం కోపం పక్కన పెట్టలేకపోతున్నారని భర్తతో మీనా అంటుంది. తప్పు చేసిన వారిని తాను క్షమించేది లేదని బాలు అంటాడు.
నాకు తెలియకుండా...
ఇలా పాపం అనుకుంటూ పోతే మనల్ని ఎవరూ పట్టించుకోరని, ఈ రోజు రూమ్ నుంచి బయటకు పంపించారు. రేపు ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటారని మీనాతో బాలు అంటాడు.అసలు నాకు తెలియకుండా నువ్వెందుకు మన రూమ్ వారికి ఇచ్చావని మీనాతో కోపంగా అంటాడు బాలు.
నువ్వు ఇలా మోస పోయినన్ని రోజులు అమ్మ బెదిరించి నిన్ను ఆడుకుంటూనే ఉంటుందని మీనాకు సర్ధిచెబుతాడు, ప్రభావతి, రోహిణి రూమ్‌లకు ఇవ్వొచ్చుగా...మన రూమ్ ఎందుకు అడగాలి అని బాలు అంటాడు. నిన్ను ఏదో ఒక రోజు ఇంట్లో నుంచి వెళ్లగొడతారని, ఆ రోజు నేను ఎందుకుఈ మాట చెప్పానో నీకు అర్థం అవుతుందని మీనాతో కోపంగా చెప్పి బాలు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
రూమ్ లాక్ చేసిన బాలు...
బాలు కోపంగా చాప పట్టుకొని మేడపైకి వెళతాడు. మేడపైన ఉన్న బాలుతో మాట్లాడటానికి రవి వస్తాడు. రవితో మాట్లడటానికి బాలు ఒప్పుకోడు. రవికి మనోజ్ సపోర్ట్ చేస్తాడు. మేమంతా రివర్స్ అయితే నీ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోమని బాలుకు వార్నింగ్ ఇస్తాడు. మనోజ్ వార్నింగ్‌తో బాలు ఫైర్ అవుతాడు. రవి, శృతి ఫస్ట్ నైట్ కోసం అలంకరించిన రూమ్‌కు లాక్ వేసుకొని బయటకు వెళ్లిపోతాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.