Gunde Ninda Gudi Gantalu Today Episode: పొట్టి బట్టల్లో శ్రుతి రచ్చ- ఇబ్బందిపడిన సత్యం- మీనా పనికి ధర కట్టిన చిన్న కోడలు
Gunde Ninda Gudi Gantalu Serial February 18th Episode: గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 18 ఎపిసోడ్లో పొట్టి స్కర్ట్ వేసుకుని హాల్లో తిరుగుతుంటుంది శ్రుతి. అది చూసి ఇబ్బందిగా ఫీల్ అవుతాడు సత్యం. తర్వాత మీనా వచ్చి శ్రుతిని లోపలికి తీసుకెళ్లి నచ్చజెబుతుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో మనోజ్ ఆఫీస్ గురించి రవి చెబుతాడు. అన్నయ్యకు బాగా ఇన్‌ఫ్లూఎన్స్ ఉందని, హెడ్ ఆఫీస్‌లో ఇంగ్లీష్‌లో ఇచ్చిపడేశాడు అని రవి అంటాడు. పాపం వాడికి ఇంగ్లీష్ రాక వీడు బతికిపోయాడు అని ప్రభావతి అంటుంది. అదేంటీ ఆంటీ అని రోహిణి అంటుంది.
16 లక్షలకే ఇప్పిస్తానని
వీడికి కోపం వస్తే ఇంగ్లీష్‌లో తిడతాడమ్మా. అది అర్థం అయితే అడ్రస్ కనుక్కుని వచ్చి మరి తన్ని వెళ్తారు కదా. ఆయన కూడా పాపం అని ప్రభావతి కవర్ చేస్తుంది. ఇంతకీ కారు సెలెక్ట్ చేసుకున్నారా అని సత్యం అంటే.. ఈయనే వద్దన్నారు అని శ్రుతి అంటుంది. వీడికేం సంబంధం అని ప్రభావతి షాక్ అవుతుంది. నేనే కదా సేల్స్ మేనేజర్ అని మనోజ్ అంటాడు. 18 లక్షల కారుని 16 లక్షలకే ఇప్పిస్తానని చెప్పాడమ్మా అని రవి అంటాడు.
అన్ని లక్షలకు నేను ఎక్కడ చావాల్రా అని ప్రభావతి అంటుంది. మీరెందుకు ఇస్తారు. ఆయనే కదా డిస్కౌంట్ ఇప్పిస్తారని అన్నారు అని శ్రుతి అంటుంది. హా ఇప్పించురా. డిస్కౌంట్ ఇప్పించు. వీడిదేంపోయింది అని ప్రభావతి అంటుంది. చాలా థ్యాంక్స్ అన్నయ్య. నెక్ట్స్ వీక్ వస్తాం అని రవి అంటే.. అలా సడెన్‌గా రాకురా అని మనోజ్ అంటాడు. ఎందుకు అని రవి అంటే.. ఇరుక్కుంటాడుగా అని ప్రభావతి అంటుంది.
అంతా ప్రభావతిని చూస్తారు. అంటే, ఇవాళ్టీలాగా ఎక్కడో పార్క్‌లో, అదే పార్క్ పక్కన ఉన్న హెడ్ ఆఫీస్‌లో ఇరుక్కుపోతే రాలేడు కదా అని కవర్ చేస్తుంది ప్రభావతి. మీ హస్బండ్కు ఉన్న టాలెంట్‌తో సొంతంగా షో రూమ్ స్టార్ట్ చేయొచ్చు కదా అని శ్రుతి అంటుంది. హా ఈ ఐడియా బాగుంది. మీ నాన్నని ఇండియాకు పిలిపించి ఒక షో రూమ్ పెట్టించేయమ్మా ఓ దరిద్రం పోతుంది అని ప్రభావతి అంటుంది. ఎందుకు ఆ డబ్బు కూడా మింగడానికా అని బాలు ఎంట్రీ ఇస్తాడు.
కూతురు గురించి పట్టించుకోరా
వీడు ఇదివరకే లక్షలు మింగాడు. మీ నాన్నను అయినా జాగ్రత్తగా ఉండమను పార్లరమ్మా అని బాలు అంటాడు. అదంతా నీకెందుకురా అని ప్రభావతి అంటే.. నువ్ ఆగు ప్రభావతి. ఇన్నాళ్లకు నాకు కూడా అనిపిస్తుంది. మీ నాన్న ఫోన్ చేసి అల్లుడితో కానీ, మాతో కానీ మాట్లాడట్లేదు. ఎందుకలా ఉంటున్నారు. కన్న కూతురు గురించి పట్టించుకోరా అని సత్యం అంటాడు. అవును మావయ్య. నేను కూడా కోపంతో తిట్టి అలిగి మాట్లాడట్లేదు. అప్పుడు అయితేనే ఆయనకు తెలిసి వస్తుందని రోహిణి అంటుంది.
ఇంతలో మంచి మసాలా వాసన వస్తుందనుకున్న మనోజ్ ఏం తెచ్చావురా అని అడుగుతాడు. కుక్కలా భలే వాసన చూశావురా. తందూరి చికెన్ తెచ్చాను. తిన్నాక బొక్కలు పడేస్తాను అని బాలు అంటాడు. ఏం మాటల్రా అవి అని సత్యం అంటాడు. లేకుంటే ఏంటీ నాన్న నా భార్యకు ఏం తెచ్చినా అడుగుతాడు. వాళ్లు తెచ్చుకుంది నేను తొంగి చూస్తున్నానా. వీళ్లంతా చికెన్, చికెన్ సూప్ చేయించుకుని తిన్నారు. నా భార్యను కనీసం తిన్నావా అని కూడా అడగలేదు అని బాలు అంటాడు.
దాంతో ప్రభావతిని కోపంగా చూస్తాడు సత్యం. వంట చేసింది కదా. తీసి పక్కన పెట్టుకుందేమో అనుకున్నా అని ప్రభావతి అంటుంది. ఇప్పుడు ఇది చెప్పాలా. నేను పక్కకు పెట్టి దాచుకుంటున్నట్లు మాట్లాడుతున్నారు అని మీనా అంటుంది. ఆవిడలాగే అందరూ చేస్తారనుకుంటుంది కానీ నువ్ రా అని మీనాను పైకి తీసుకెళ్తాడు బాలు. చూశారా వాడిని అని ప్రభావతి అరుస్తుంది. వాడి భార్యకు తెచ్చుకుంటే నీకేంటీ. పైగా మీనాపై వాడు చూపిస్తున్న ప్రేమ చూపిస్తుంటే ముచ్చటగా ఉందని సత్యం అంటాడు.
వాడి తలతో దిష్టి
ఇక్కడ తినడం ఎందుకు, డైనింగ్ టేబుల్‌పైన తింటే సరిపోతుంది కదా అని మీనా అంటుంది. ఇంతమంది ముందు తింటే దిష్టి తగుల్తుంది. కష్టం అంటే ముందుకు రారు కానీ చికెన్ అంటే అందరూ వస్తారు. నువ్ ఒక్కదానివే తిను అని బాలు అంటాడు. మీరు ఊకే నా భార్య అంటుంటే మనమీద అందరి దిష్టి పడుతుందేమోనండి అని మీనా అంటుంది. మనోజ్ గాడి తలకాయ బూడిదగుమ్మడికాయలా ఉంటుంది కదా దాంతో దిష్టి తీస్తానులే అని బాలు అంటాడు.
మీరు కూడా తినండి అని మీనా అంటే.. నువ్ నిల్చోని అన్ని పనులు చేస్తావ్. నాకంటే మంచి తిండి నువ్వు తినాలు. నీ గురించి ఎవరు పట్టించుకోరు అని బాలు అంటాడు. దాంతో భర్త ప్రేమకు మురిసిపోతుంది మీనా. మరోవైపు ఉగాదికి తన అమ్మ వాళ్ల ఇంటికి రమ్మందని ప్రభావతితో సత్యం చెబుతాడు. మనోజ్ వస్తే.. ఉగాదికి నానమ్మ వాళ్ల ఇంటికి వెళ్లాలి. లీవ్ దొరుకుతుంది కదా అని అడుగుతాడు సత్యం. దాంతో మనోజ్ తల్లిని చూస్తాడు.
వాడిని నేను చూసుకుంటాను, రోహిణికి కుదురుతుందో లేదో అని ప్రభావతి అంటుంది. అన్ని రోజులు వెళ్తే పార్లర్ ఎవరు చూసుకుంటారు అని రోహిణి అంటుంది. ఉద్యోగులు ఉన్నారు కదా. వాళ్లు చూసుకుంటారు అని ప్రభావతి అంటుంది. నేనే అక్కడ పనిచేస్తున్నాను. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందో అని నేను భయపడి చస్తున్నాను. అన్ని ఇలాంటివే నాకు ఎదురవుతాయి ఏంటో అని మనసులో అనుకుంటుంది రోహిణి.
పొట్టి బట్టల్లో శ్రుతి
మీ ఇద్దరికి ఇష్టం లేదా అని ప్రభావతి అంటుంది. అలాంటిదేం లేదు అని రోహిణి అంటుంది. ఊరేళ్లముందు నేను ఓసారి పార్లర్‌కు వస్తానమ్మా. ఫేసిషియల్ చేయించుకోవాలి. ఊర్లో ఎండలు ఎక్కువ. చర్మం నల్లబడిపోతుంది కదా అని ప్రభావతి అంటుంది. దాంతో సెటైర్లు వేసిన సత్యం రవి, శ్రుతికి కూడా చెప్పాలి అని అంటాడు. ఇంతలో మోకాళ్లపైకి ఉన్న స్కర్ట్ వేసుకుని దోమల బ్యాట్‌తో వస్తుంది శ్రుతి. అది చూసి అంతా షాక్ అవుతారు.
ఏంటమ్మా శ్రుతి ఇది అని ప్రభావతి అంటే.. దోమలు ఆంటీ. వీర విహారం చేస్తున్నాయి. నేను కత్తి యుద్ధం చేస్తున్నాను కస.. బిస అని శ్రుతి అంటుంది. మనోజ్ అలాగే చూస్తుండిపోతాడు. అది రోహిణి చూస్తుంది. సత్యం ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. ఇల్లంతా తిరుగుతుంటుంది శ్రుతి. దాంతో సత్యం లోపలికి వెళ్లిపోతాడు. దోమలు లీటర్ రక్తం తాగిన పర్వాలేదు. ముందు మీ మావయ్యకు గుండెనొప్పి తెప్పించకుంటే చాలు అని ప్రభావతి అంటుంది.
తర్వాత ప్రభావతి బ్యాట్ తీసుకుని మనోజ్‌కు ఇచ్చి పంపిస్తుంది. ఇంతలో మీనా కిందకు వచ్చి శ్రుతిని ఇలాగే కిందకు వచ్చావా అని అడుగుతుంది. ఇలాగే అంటే అని శ్రుతి అంటే.. ఇదే ఇలా పొట్టి పొట్టి బట్టలతో వచ్చావ్. చలి వేయడం లేదా అని ప్రభావతి అంటుంది. లేదు నార్మల్‌గానే ఉందని శ్రుతి అంటుంది. పైన వేసుకునే బట్టలు తెచ్చుకోలేదా అని ప్రభావతి అంటే శ్రుతి అర్థం కాకుండా అడుగుతుంది. ఇవి ఇన్నర్స్ అనుకుంటుంది ఆంటీ అని రోహిణి చెబుతుంది.
అర్థమయ్యేలా చెబుతా
లేదు. ఇంట్లో కూడా నేను ఇవే వేసుకుంటాను అని శ్రుతి అంటుంది. వేరే బట్టలు వేసుకోకూడదా అని ప్రభావతి అంటే.. నాకు ఇందులోనే కంఫర్ట్‌గా ఉంటుంది. నాకు నచ్చింది వేసుకుంటుంది. చూసేవాళ్లకు ఎందుకు నచ్చాలి. ఇంట్లోవాళ్లు ఏమనలేదు. ఇక్కడ ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు అని శ్రుతి అంటుంది. నేను ఇక చెప్పలేను అని రోహిణి వెళ్లిపోతుంది. నేను అర్థమయ్యేలా చెబుతా అని మీనా అంటుంది. నాకు నిజంగా అర్థం కావడంలేదు. నా ఏజ్‌కు ఈ డ్రెస్ వేసుకుంటే తప్పేంటీ. ఆంటీ వేసుకుంటే బాగుండదు కానీ అని శ్రుతి అంటుంది.
దాంతో ప్రభావతి నేనా అని షాక్ అవుతుంది. అంతా షాక్ అవుతారు. నాతో రా శ్రుతి అని మీనా తీసుకెళ్తుంది. తీసుకెళ్లి శ్రుతికి డ్రెస్ గురించి నచ్చజెబుతుంది మీనా. అమ్మాయిల డ్రెస్‌ల మీదనే డిబెట్స్ ఎందుకు పెడతారో అర్థం కాదు. వీళ్లు చూసే దాంట్లోనే ఉంది. మనం వేసుకునే డ్రెస్‌లో లేదు. సరే నా వల్ల ఇబ్బందిపడుతున్నారు కాబట్టి వేరే వేసుకుంటాను. నన్ను అంతా తప్పుబట్టకూడదని చెబుతున్నావ్ కాబట్టి వింటాను అని శ్రుతి అంటుంది.
మనోజ్ బట్టలు ఉతకమని మీనాను అడిగితే తల్లి ఉందిగా అని ప్రభావతిని అంటుంది. తర్వాత శ్రుతి వచ్చి ఇన్ని బట్టలు ఒక్కదానివే ఉతుకుతావా. ఆంటీ కూడా ఉన్నారు కదా అని అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. తర్వాత మీనాకు బట్టలు ఉతకడానికి రెండు వేలు ఇస్తుంది శ్రుతి. అది అవమానంగా ఫీల్ అవుతుంది మీనా. పొగరు బాగా అణగినట్టుంది. మా పని మాత్రం ఫ్రీగా చేయాలి. తిండి పెడుతున్నాం కదా అని ప్రభావతి అంటుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్