Gunde Ninda Gudi Gantalu: క్లీనర్ నుంచి ఓనర్‌గా మారిన బాలు - మీనాకు ట్రీట్ - కొడుకును సర్‌ప్రైజ్ చేసిన సత్యం
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు డిసెంబర్ 9 ఎపిసోడ్‌లో బాలు అమ్మేసిన కారును తిరిగి అతడికి కొని ఇస్తాడు సత్యం. తండ్రి సర్‌ప్రైజ్‌కు బాలు ఎమోషనల్ అవుతాడు. మీనా చేతలు మీదుగా కారు కీస్‌ను బాలుకు ఇప్పిస్తాడు సత్యం.
రోహిణి, మనోజ్ కష్టపడి జాబ్ చేస్తుంటే ఇంట్లో తిని కూర్చునేవాళ్లు ఎక్కువైపోయారని బాలు, మీనాలను ఎగతాళి చేసి మాట్లాడుతుంది ప్రభావతి. తల్లి మాటలను భరించడం కంటే అపార్ట్‌మెంట్ క్లీనర్ జాబ్ చేయడమే మంచిదని బాలు నిశ్చయించుకుంటాడు.
తండ్రిగా నా బాధ్యత...
అప్పుడే సత్యం ఇంట్లోకి వస్తాడు. బాలుతో పాటు ఇంట్లో వాళ్లందరిని బయటకు రమ్మని అంటాడు. ఎందుకు నాన్న అని బాలు అడిగినా సత్యం సమాధానం చెప్పడు. కొడుకుగా నీ బాధ్యత నువ్వు చూపించావు. తండ్రిగా నా బాధ్యత నేను చూపించాలిగా అని అంటాడు. ఇంటి ఎదురుగా తాను అమ్మేసిన సొంత కారు కనిపించడంతో బాలు ఆనందంగా ఫీలవుతాడు. ఈ కారు ఇక్కడికి ఎలా వచ్చింది? గణపతికి అమ్మేశానుగా అని అంటాడు బాలు. గణపతి దగ్గర నుంచి నీ కోసం మీ నాన్న ఈ కారు కొన్నాడని బాలు ఫ్రెండ్ చెబుతాడు.
ఇంటి పత్రాలు తాకట్టు...
కారు కోసం అంత డబ్బు ఎక్కడి తెచ్చారని సత్యాన్ని అడుగుతుంది మీనా. ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చామని ప్రభావతి సమాధానమిస్తుంది. ఇంటి పత్రాలు తాకట్టు పెట్టడానికి నువ్వు ఒప్పుకున్నావా... నాతో ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదని మనోజ్ అంటాడు. మీ అమ్మతో చెప్పే అప్పు తీసుకొచ్చాను, నీతో చెప్పాల్సిన పనిలేదని మనోజ్‌పై సత్యం ఫైర్ అవుతాడు. మీరు ఆధారం మాత్రమే చూపించలేదు. ఆయన ఆత్మాభిమానం కూడా నిలబెట్టారని మీనా ఎమోషనల్ అవుతుంది.
నా ప్రాణం కాపాడిన కారును...
నా ఆపరేషన్ కోసం కారు అమ్మేశాడు. నన్ను ఒక్క మాట అన్నందుకు ఫైనాన్షియర్‌ను కొట్టి అద్దె కారు పొగొట్టుకున్నాడు. మీరు తినే తిండికి లెక్కలుకడతారని తెలిసి ఆత్మాభిమానం చంపుకొని క్లీనర్ జాబ్ చేస్తుంటే నేను ఎలా చూస్తుండగలను. నా ప్రాణం కాపాడిన కారును తిరిగి వాడికి ఇవ్వాలని అనుకునే ఇదంతా చేశానని సత్యం అంటాడు.
బాలు ఎమోషనల్...
తండ్రి మాటలతో బాలు ఎమోషనల్ అవుతాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ తండ్రిని హత్తుకుంటాడు. నువ్వు ఎప్పుడు బాలులానే ఉండాలి. అంత ఎత్తున ఉండాలని సత్యం కొడుకును ఓదార్చుతాడు. కారు కీస్‌ను నీ చేతుల మీదుగానే బాలుకు ఇవ్వమని మీనాకు ఇస్తాడు సత్యం. పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశావో..నీ కారు నీకు తిరిగి వచ్చిందని బాలు స్నేహితుడు అంటాడు. పొద్దుపొద్దున్నే నీ ముఖం చూసినందుకు...ఎవరు నన్ను ఎన్ని మాటలు అంటారో అని మీనాను అవమానించిన విషయం గుర్తొచ్చి బాలు బాధపడతాడు.
కారుకు మీనా పూజ చేస్తుంది…
తండ్రికి థాంక్స్ చెబుతాడు బాలు. నాకు కాదు మీనాకు చెప్పమని సత్యం అంటాడు. నువ్వు క్లీనర్‌గా కష్టపడుతున్నావని కారు కోసం మీనా ఫైనాన్షియర్ చుట్టూ తిరగడం వల్లే నాకు ఈ విషయం తెలిసిందని అంటాడు. నీ థాంక్స్ మీనాకే చెందాలని సత్యం అంటాడు. సత్యం, మౌనిక, మీనాలను తీసుకొని కారులో ట్రిప్ వేస్తాడు బాలు. నేను ప్లాన్ చేసిన బిజినెస్ సక్సెస్ అయితే కోటి రూపాయల కారు కొంటానని మనోజ్ బిల్డప్‌లు ఇస్తాడు.
మీనాకు థాంక్స్...
మీనా ముఖం చూడగానే కారు తనకు దక్కిందని బాలు నమ్ముతాడు. మీనాకు థాంక్స్ చెప్పాలని రూమ్‌లోకి వస్తాడు. మీనా తన తల్లితో ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తుంది. కారు అమ్మేసి ఇష్టం లేని పనిచేస్తూ ఆయన ఎంత బాధపడ్డారో...కుమిలిపోయారో నేను కళ్లారా చూశాను. మళ్లీ కారు చూసిన తర్వాతే బాలు ముఖంలో సంతోషం చూశానని, ఆయన ఎప్పుడు ఇలా సంతోషంగా ఉంటే చాలానిపించిందని తల్లితో మీనా చెబుతుంది. మీనా మాటలు విని బాలు ఎమోషనల్ అవుతాడు.
బాలు ఈగో...
మీనాకు థాంక్స్ చెప్పాలని పిలుస్తాడు. కానీ ఈగో అడ్డొచ్చి ఆగిపోతాడు. నా ఫోన్ కనపడటం లేదని అబద్ధం ఆడుతాడు. నువ్వు త్వరగా రెడీ అయితే బయటకు వెళ్దామని మీనాతో అంటాడు బాలు. బిర్యానీ తినేసి బయట తిరిగొద్దామని చెబుతాడు. ఈ రోజు నేను సంతోషంగా ఉన్నాను.
ఆ సంతోషాన్ని నీతో పంచుకోవాలని అనుకుంటాడు. కానీ బాలు వెంట వెళ్లడానికి మీనా ఒప్పుకోదు. నీ భర్తగా పిలుస్తున్నాను వస్తావా రావా అని ఆర్డర్ వేస్తాడు బాలు. నీకు నాకు ఏ సంబంధం లేదని అన్నది మీరే...మళ్లీ ఇప్పుడొచ్చి నీ భర్తను అంటున్నారు. రెస్టారెంట్‌కు వెళ్లిన తర్వాత మాట మార్చితే నేను ఎక్కడికి వెళ్లాలి అని మీనా అంటుంది. నేను మాట మార్చను..నీ మీద కొప్పడను, తిట్టనను మీనాకు మాటిస్తాడు.
ముద్దు ముచ్చట తెలియదు...
ఈ ఇంట్లో అడుగుపెట్టిన మహాలక్ష్మికి నువ్వు అంటూ తండ్రి మీనా గురించి చెప్పిన మాటల్ని గుర్తుచేసుకుంటాడు. మీనానే చూస్తుంటాడు. నన్ను ఎందుకు చూస్తున్నారని భర్తను అడుగుతుంది మీనా. నిన్ను చూడలేదని కారు గ్లాస్ చూస్తున్నానని అబద్ధం ఆడుతాడు. మీకు ముద్దు, ముచ్చట, సరసాలు ఏం తెలియవని బాలుపై మీనా సెటైర్లు వేస్తుంది.
మీడియేటర్...
కారును ఓ చోట ఆపుతాడు బాలు. అక్కడ బాలు స్నేహితుడు కనిపిస్తాడు. వీడు నీతో ఏదో చెప్పాలని అనుకుంటున్నాడని తన స్నేహితుడిని చూపించి మీనాతో అంటాడు బాలు. మీనాకు డైరెక్ట్‌గా సారీ చెప్పడానికి అహం అడ్డురావడంతో స్నేహితుడిని మీడియేటర్‌గా ఉండమని బాలు బతిమిలాడుతాడు. ఇక నుంచి మీనాను ఏం అనద్దని బాలుతో స్నేహితుడు అంటాడు. ఇప్పటివరకు జరిగిన దానికి సారీ చెప్పమని అంటాడు. బాలు మీనా వైపు కాకుండా తన స్నేహితుడి వైపు చూస్తూ సారీ చెబుతాడు.బాలు సారీ ఎవరికి చెప్పాడు..మీకా..నాకా అని మీనా అనుమానంగా అడుగుతుంది. నీకేనని బాలు బదులిస్తాడు.
రోషం..పౌరుషం...
నాకు ఎందుకు సారీ చెప్పారని మీనా అడుగుతుంది. నిన్ను తొందరపడి తిట్టినందుకు బాలు సారీ చెప్పాడని అతడి స్నేహితుడు అంటాడు. తిట్టినప్పుడు కొట్టినప్పుడు లేని పౌరుషం, రోషం సారీ చెప్పడానికి వచ్చిందా అని మీనా సెటైర్లు వేస్తుంది. ఈ పొగరే వద్దనేది...నేను నా జీవితంలో ఎవరికి సారీ చెప్పలేదని బాలు అంటాడు.
క్షమించానని చెప్పు అన్నయ్య అంటూ బాలు స్నేహితుడితో అంటుంది మీనా. నీ క్షమాపణలు నాకు అక్కరలేదని బాలు అంటాడు. నోరుమూసుకొని ఉండమని బాలును అతడి స్నేహితుడు కంట్రోల్ చేస్తాడు.
మీనాకు గిఫ్ట్...
బాలు, మీనా కారులో కూర్చుంటారు. మీనాను కళ్లు మూసుకోమని బాలు అంటాడు. ఆమె చేతికి గాజులు తొడుగుతాడు. భర్త ఇచ్చిన బహుమతి చూసి మీనా మురిసిపోతుంది. గాజులనే చూస్తూ ఉండిపోతుంది. ఏంటి వాటినే చూస్తున్నావు...నచ్చలేదా అని బాలు అంటాడు. మీ కోపం లాగే ఎర్రగా ఉన్నాయని మీనా పంచ్‌లు వేస్తుంది.
నీకు పుట్టలేదని అనుకో...
శృతి, రవి రెస్టారెంట్‌కు వస్తారు. ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలో వెయిటర్‌కు చెబుతుంటాడు. నీ చెఫ్ బుద్ది పోనిచ్చుకోలేదని రవిపై శృతి వెటకారం ఆడుతుంది. . శృతి ఆర్డర్ ఇస్తుంది. ఆ ఫుడ్ ఎలా చేస్తాడో నేను కిచెన్‌లోకి వెళ్లి చూస్తానని రవి అంటాడు.
రవిని క్షమించి ఇంటికి పిలిస్తే మంచిదని సత్యంతో అంటుంది క్షమాక్షి. నేను వాడిని ఎప్పుడో క్షమించేశానని ప్రభావతి అంటుంది. రవిని ఇంటికి తీసుకొద్దామని పట్టుపడుతుంది. ఇలాగే వదిలేస్తే నా కొడుకు నాకు కాకుండాపోతాడని అంటుంది. వాడు నీకు పుట్టలేదని అనుకో అని బాలు సమాధానమిస్తాడు. అక్కడితో నేటి గుండెనిండా గుడిగంటలు సీరియల్ ముగిసింది.