Gunde Ninda Gudi Gantalu: ఒక్కటైన బాలు, మీనా -సారీతో గొడవలకు పుల్‌స్టాప్ - నోరుజారి ప్రభావతికి దొరికిపోయిన రోహిణి
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడి గంటలు డిసెంబర్ 6 ఎపిసోడ్‌లో తన ఆపరేషన్ కోసం బాలు కారు అమ్మేసి క్లీనర్‌గా జాబ్ చేస్తూ అవమానాలు పడటం సత్యం సహించలేకపోతాడు. ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి బాలు కారును అతడికి తిరిగి ఇవ్వాలని అనుకుంటాడు. ప్రభావతి అందుకు ఒప్పుకోదు...
ఫైనాన్షియర్‌కు క్షమాపణలు చెప్పడానికి మీనా వెళ్లిందని తెలిసి ఆమెపై బాలు ఫైర్ అవుతాడు. భార్యను కొట్టడానికి చెయ్యెత్తుతాడు. కొట్టండి అదొక్కటే కదా మీకు తెలిసిందని బాలుతో అంటుంది మీనా. ఫైనాన్షియర్ దగ్గరకు నేను ఏ ఉద్దేశంతో వెళ్లానో మీకు అవసరం లేదు కదా అని అంటుంది. నేను పొగరుబోతునే...మొండోడినే... ఇలాగే ఉంటాను. మారనని బాలు వాదిస్తాడు. ఫైనాన్షియర్‌ను ఎందుకు కొట్టాల్సివచ్చిందో మీనాకు వివరిస్తాడు బాలు. నేను డబ్బులు ఇచ్చిన తర్వాత మీ నాన్న చచ్చిపోతే ఎలా అని ఫైనాన్షియర్ అనడంతో కోపం పట్టలేక కొట్టానని బాలు అంటాడు.
నాన్న గురించి తప్పుగా మాట్లాడితే...
మా నాన్న గురించి తప్పుగా మాట్లాడితే ఎవరినైనా కొడతానని బాలు అంటాడు. మావయ్య గారిని అంత మాట అన్న తర్వాత క్షమించమని వాడిని నేను ఎలా అడుగతాను... ఆ టైమ్‌లో అక్కడ ఉంటే మీ కంటే ముందే నేనే చెప్పుతీసి కొట్టేవాడినని బాలుతో అంటుంది మీనా. ఇక నుంచి ఏదైనా నాతో చెప్పి చేయి...నా విషయంలో జోక్యం చేసుకోవద్దని మీనాకు వార్నింగ్ ఇస్తాడు బాలు.
గణపతి దగ్గరకు సత్యం....
బాలు కారు కొన్న గణపతిని వెతుక్కుంటూ వస్తాడు సత్యం. కారు అమ్మడం బాలుకు ఇష్టం లేకపోయినా తన ఆపరేషన్ కోసం అమ్మాడని గణపతికి చెబుతాడు. ఈ కారును తిరిగి తమకు ఇచ్చేయమని గణపతిని సత్యం రిక్వెస్ట్ చేస్తాడు. కారు అమ్మేసి బాలు క్లీనర్ జాబ్ చేస్తున్నాడని, ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నాడని సత్యం ఎమోషనల్ అవుతాడు...
నాలుగు లక్షలు...
నన్ను బతికించుకోవడం బాలు అన్ని త్యాగం చేసి ఇప్పుడు బాధలు పడుతుండటం తాను చూడలేకపోతున్నానని గణపతితో చెబుతాడు బాలు. మీరు ఇచ్చిన డబ్బులు మొత్తం తిరిగి ఇచ్చేస్తానని, కారు తిరిగి తనకు అమ్మమని గణపతితో అంటాడు సత్యం. కారు కొన్న తర్వాత తాను కొన్ని మార్పులు చేశానని, మొత్తం నాలుగు లక్షలు ఇవ్వమని సత్యంతో అంటాడు గణపతి.
అతడు చెప్పిన రేటు విని సత్యం షాకవుతాడు. తాను అంత డబ్బు ఇచ్చుకొనే స్థితిలో లేనని అంటాడు. చివరకు బేరం మూడున్నర లక్షలకు కుదురుతుంది. డబ్బు రెడీ చేసి కారు తీసుకెళతానని గణపతితో చెప్పి వచ్చేస్తాడు సత్యం.
జన్మలో గడప తొక్కనివ్వను...
కారు కోసం డబ్బు ఎలా అడ్జెస్ట్ చేయాలా అని సత్యం చాలా ఆలోచిస్తాడు. అతడి దగ్గరకు ప్రభావతి వస్తుంది. రవి గురించి సత్యంతో చెప్పాలని ప్రభావతి అనుకుంటుంది. రవి పేరు వినగానే సత్యం కోపంతో ఎగిరిపెడతాడు. వాడి గురించి నా దగ్గర మాట్లాడొద్దని భార్యతో అంటాడు. నా పరువు తీసి రోడ్డుకు ఈడ్చాడు. వాడిని జన్మలో ఈ గడప తొక్కనివ్వనని చెబుతాడు.
ఇంటి పత్రాలు తాకట్టు...
తాను ఇంటి పత్రాలు తాకట్టు పెట్టాలని అనుకుంటున్నట్లు ప్రభావతితో చెబుతాడు సత్యం. తాకట్టు పెట్టడానికి ప్రభావతి ఒప్పుకోదు. నేను నీలా చెప్పపెట్టకుండా పత్రాలను తాకట్టు పెట్టేవాడిని కాదని భార్యపై సెటైర్లు వేస్తాడు. నేను నీలా కాదని మంచి, చెడు ఏదైనా నీకు చెప్పే చేస్తానని సత్యం అంటాడు. నా తప్పుల్ని ఎత్తిచూపడం కాకుండా అసలు ఇంటి పత్రాలు ఎందుకు తాకట్టు పెట్టాలని అనుకుంటున్నారో అది చెప్పమని ప్రభావతి అంటుంది.
బాలు కోసమే...
బాలు నా ఆపరేషన్ కోసం కారు అమ్మేశాడని, సొంత కారులో తిరగాల్సిన వాడు ఇప్పుడు వేరేవాళ్ల కార్లు కడుగుతూ దిక్కుతోచని స్థితిలో ఉండిపోవడం చూస్తుంటే బాధగా ఉందని ప్రభావతితో చెబుతాడు సత్యం. తండ్రిగా బాలుకు జన్మనైతే ఇచ్చాను కానీ మంచి జీవితాన్ని ఇవ్వలేకపోయానని బాధపడతాడు.
బాలు కారు కోసమే డాక్యుమెంట్స్ తాకట్టు పెట్టాలనుకున్న విషయం చెప్పేస్తాడు. మనకంటూ ఉన్న ఒకే ఒక ఆస్తిని తాకట్టు పెడతారా, బాలుకు ఎంత చేసినా ఉపయోగం ఉండదని ప్రభావతి అంటుంది. ఈ ఇంటిని మిగలనివ్వమని చెబుతుంది.
పని చేసేవాడికి కోపం రాకూడదు...
ఎప్పుడైనా పని ఇచ్చేవాడికి కోపం రావాలి కానీ...పని చేసే వాడికి కోపం రాకూడదని వస్తే ఇలాగే ఉంటుందని బాలుపై తన మనసులో ఉన్న ద్వేషాన్ని బయటపెడుతుంది ప్రభావతి.
బాలు కోపం గురించి కాకుండా వాడు పడుతోన్న బాధ గురించి ఓ సారి ఆలోచించమని ప్రభావతికి అర్థమయ్యేలా వివరిస్తాడు. బాలుకు కారు తిరిగి ఇస్తే కష్టాల నుంచి బయటపడి గౌరవంగా బతకుతాడని చెబుతాడు. చివరకు ఇంటి పత్రాలు తాకట్టు పెట్టడానికి ప్రభావతి అంగీకరిస్తుంది.
అవసరమైతే జాబ్ చేస్తా...
మరో రెండు లక్షలు అప్పు ఎక్కువ తీసుకోమని చెబుతుంది. మీ ఆపరేషన్ కోసం తాను బంగారం తాకట్టు పెట్టినట్లు, ఆ డబ్బుతో వాటిని విడిపించుకుంటానని అంటుంది. సత్యం అందుకు అంగీకరిస్తాడు. ఆ అప్పును సంవత్సరం లోగా తిరిగి తీర్చేస్తానని, అవసరమైతే జాబ్ చేస్తానని అంటాడు.
బాలుతో మీనా రొమాన్స్...
బాలు నిద్రలో ఉంటాడు. మీనా లేపడానికి ప్రయత్నిస్తే కసురుకుంటాడు. చెవిలో గిలిగింతలు పెట్టి బాలు నిద్రను డిస్ట్రబ్ చేస్తుంది. మీనాను ఆపడానికి చేయిపట్టుకోవడంతో బాలుపై పడిపోతుంది మీనా. ఆమెను అలాగే చూస్తూ ఉండిపోతాడు.
నీ ముఖం చూశా కదా...
ఈ రోజు పనికి వెళ్లడం లేదా, లేటవుతుందని బాలుతో అంటుంది మీనా. ఇంకేం వెళతాం పొద్దునే నీ ముఖం చూశాను కదా...ఈ రోజు నన్ను ఎవరు ఎలా అవమానిస్తారోనని తలుచుకుంటేనే భయమేస్తుందని సమాధానమిస్తాడు బాలు. మీరు భయపడాల్సిన అవసరం లేదు...నా ముఖం చూస్తే అంత శుభమే జరుగుతుందని మీనా అంటుందిఒక్కసారి నా ముఖం ప్రేమగా చూస్తే మీకు అంత మంచే జరుగుతుందని భర్తతో చెబుతుంది మీనా. నీ వల్ల నాకు ఇప్పటివరకు జరిగిన నష్టం చాలు..పొగొట్టుకోవడానికి నా ఒంటి మీద బట్టలు తప్ప ఏం లేవని సమాధానమిచ్చి వెళ్లిపోతాడు బాలు.
నిజం బయటపెట్టిన రోహిణి...
బాలుకు టిఫిన్ వడ్డిస్తుంది మీనా. చట్నీ వేయబోతుండగా...ఇంకా తినేవాళ్లు ఉన్నారు...మొత్తం వాడికే తోడిపెట్టకని అవమానిస్తుంది. తినేటప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదా అంటూ అత్తపై మీనా కోప్పడుతుంది. రోహిణి సీరియస్‌గా ఏదో రాసుకుంటూ ఉండటంతో ఏం రాస్తున్నావని ప్రభావతి అడుగుతుంది.
అకౌంట్స్ రాస్తున్నా....రేపు మేడమ్ వస్తారటా అని రోహిణి సమాధానమిస్తుంది. ఆమె ఆన్సర్‌తో అందరూ షాకవుతారు. పార్లర్‌లో నువ్వే కదా మేడమ్‌వి...వేరే మేడమ్ ఎవరనున్నారని అనుమానంగా ప్రభావతి అడుగుతుంది. టాక్స్ కోసం ఆడిటర్‌కు అకౌంట్స్ చూపించాలని రోహిణి అబద్ధం ఆడుతుంది.
తినేవాళ్లు ఎక్కువైపోయారు...
ఈ ఇంట్లో జాబ్ చేసేదానికి నువ్వు ఒక్కదానికే అని ప్రభావతి అంటుంది. బాలుకు కూడా ఏ ఉద్యోగం లేదని వెటకారం ఆడుతుంది ప్రభావతి. మనోజ్ కూడా జాబ్ చేస్తున్నాడు కదా అని రోహిణి అంటుంది.
మీరు కష్టపడి పనిచేస్తుంటే ఇంట్లో కూర్చొని తినేవాళ్లు ఎక్కువైపోయారని మనోజ్, మీనాను అవమానిస్తుంది ప్రభావతి.
కార్లు కడగటమే బెటర్...
వీళ్ల నోటి నుంచి వచ్చే మాటలు పడే కంటే ఆ కార్లు కడగటడానికి వెళ్లడమే మంచిదని బాలు అంటాడు. మెతుకు మెతుక్కి లెక్కలు కట్టే ఈ తల్లి ఎలా మాట్లాడుతుందో తెలుసు కాబట్టే ఈ రోజు నుంచి అదే పనిని వెళతానని పట్టుపడతాడు. మావయ్య వద్దన్నారు కదా అని మీనా అంటే బాలు వినడు.
బాలు క్షమాపణలు...
మీనా వల్లే తిరిగి తన కారు తనకు దక్కడంతో బాలు ఆనంద పడతాడు. తొందరపడి ఆమెను తిట్టినందుకు ఆమెకు క్షమాపణలు చెబుతాడు.నా జీవితంలో ఎవరికి సారీ చెప్పలేదని అంటాడు. భర్తను క్షమించేస్తుంది మీనా. భార్యను కారులో కూర్చుండబెతాడు. ఆమెకు గాజులను బహుమతిగా ఇస్తాడు. అయితే నాపై కోపం పోయిందా అని మీనా అంటుంది. ఆ కోపం అలాగే ఉందని, ఈ బహుమతి మాత్రం కారు దక్కినందుకని బాలు అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.