Gunde Ninda Gudi Gantalu: సంజును బురిడీ కొట్టించిన బాలు -మౌనిక పెళ్లి నగలు కొట్టేసిన రోహిణి -అత్త ముందు బుక్కయిన మీనా
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 31 ఎపిసోడ్‌లో మౌనిక పెళ్లి ఆపేందుకు సంజును కిడ్నాప్ చేస్తాడు బాలు. కారు డిక్కీలో అతడిని దాచేసి ఫామ్‌హౌజ్ నుంచి జంప్ అవుతాడు. మీనాకు చెప్పే బాలు ఈ కిడ్నాప్ చేశాడని కోడలిపై ప్రభావతి చిందులు తొక్కుతుంది.
Gunde Ninda Gudi Gantalu: మారువేశంలో మౌనిక పెళ్లికి వస్తాడు వర్ధన్. అతడిని చూడగానే రోహిణి భయంతో వణికిపోతుంది. మీ నాన్న మలేషియా నుంచి ఓ గిఫ్ట్ పంపించాడని రోహిణికి ఇస్తాడు వర్ధన్. ఆ గిఫ్ట్ బాక్స్‌లో ఏముందో చూపించి మీనా ఫ్యామిలీ ముందు బిల్డప్ ఇవ్వాలని ప్రభావతి అనుకుంటుంది.
మనోజ్ కూడా గిఫ్ట్ ఓపెన్ చేయమని రోహిణిని బలవంతం చేస్తాడు. కానీ రోహిణి భయపడిపోతుంది. మిమ్మల్ని పెళ్లి మండపంలో ఎవరో పిలుస్తున్నారని ప్రభావతిని డైవర్ట్ చేసి అక్కడి నుంచి పంపించేస్తుంది రోహిణి.
వర్ధన్ బ్లాక్‌మెయిల్...
వర్ధన్ వెళ్లిపోయినట్లే వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చేస్తాడు. మౌనికకు సంజు ఫ్యామిలీ పెట్టిన నగలలో నుంచి ఓ నగను దొంగతనం చేసి తనకు తెచ్చి ఇవ్వాలని రోహిణిని బ్లాక్‌మెయిల్ చేస్తాడు. లేదంటే తండ్రి కోటీశ్వరుడు అని, తల్లి లేదంటూ రోహిణి ఆడుతోన్న నాటకమే కాకుండా ఆమెకు ఓ కొడుకు ఉన్న సంగతిని బయటపెడతానని బెదిరిస్తాడు.
మనోజ్‌ను ఆపిన బాలు...
పెళ్లి కొడుకును పీటలపైకి తీసుకురావాలని పంతులు అంటాడు. మనోజ్ వెళ్లబోతుండగా అతడిని ఆపుతాడు బాలు. పెళ్లి మండపం పైకి బావను తానుతీసుకొస్తానని వెళతాడు. . సంజు రూమ్‌కు బాలు వెళ్లబోతుండగా అతడిని మీనా ఆపేస్తుంది. నిజంగా మౌనిక పెళ్లి విషయంలో మీరు మారిపోయారా?
మనస్ఫూర్తిగా ఈ పెళ్లికి ఒప్పుకున్నారా అని అనుమానంగా భర్తను అడుగుతుంది. లక్షలు దొంగతనం చేసిన అన్నను ఈ రోజుకు క్షమించలేదు...తమ్ముడు ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు అతడిని కొట్టారు..కానీ మౌనిక పెళ్లికి ససేమిరా అన్న మీరు ఇప్పుడు మారిపోయారంటే అనుమానంగా ఉందని ప్రశ్నలు వేస్తుంది మీనా. మౌనికను అతడు ఇష్టపడుతున్నాడని తెలిసిన తర్వాత తాను మారిపోయానని బాలు అబద్దం ఆడుతాడు.
బాలుకు కాంప్లిమెంట్...
బాలు వెంట సంజు రూమ్‌కు తాను వస్తానని మీనా పట్టుపడుతుంది. ఆమెను ఆపేస్తాడు బాలు. పంచెకట్టులో ముద్దొస్తున్నారని బాలుకు కాంప్లిమెంట్స్ ఇస్తుంది మీనా. భార్య పొగడ్తలతో బాలు సంబరపడతాడు.
బాలు కాంప్రమైజ్...
బావగారు అని పిలుస్తూ సంజు రూమ్‌లోకి బాలు ఎంటరవుతాడు. బాలు తనను బావ అని పిలవడంతో సంజు షాకవుతాడు. బాలు కాంప్రమైజ్ అయ్యాడని అనుకుంటాడు. సడెన్‌గా సంజు పీక పట్టుకుంటాడు బాలు. నువ్వు అందరిని నమ్మించినా...ఈ బాలు నమ్మించలేవని చెప్పి సంజును చితక్కొడతాడు. సంజును స్ప్రహ కోల్పోయేలా చేసి కళ్యాణ మండపం నుంచి ఎవరు చూడకుండా ఎత్తుకెళతాడు.
దొంగతనం చేసిన రోహిణి...
పెళ్లికూతురు గదిలో ఉన్న మౌనికను ఏమార్చి ఆమె నగను దొంగతనం చేస్తుంది రోహిణి. ఎవరూ చూడకుండా తీసుకొచ్చి వర్ధన్‌కు ఇస్తుంది. అదే టైమ్‌లో సంజును ఎత్తుకెళ్లి కారు డిక్కీలో దాస్తోన్న బాలును రోహిణి చూస్తుంది. ఈ కిడ్నాప్ గురించి ప్రభావతికి చెబుతుంది రోహిణి. సంజును బాలు కిడ్నాప్ చేశాడని తెలియగానే ప్రభావతి షాకవుతుంది. రోహిణి మాటలు విని మీనా కూడా కంగారుపడుతుంది.
మీనాకు తెలిసే ఈ కిడ్నాప్ జరిగిందని ప్రభావతి చిందులు తొక్కడం మొదలుపెడుతుంది. పెళ్లి టైమ్‌లోపు బాలును తాను తీసుకొస్తానని మీనా అంటుంది.
నీలకంఠం అనుమానం...
సంజును తీసుకొస్తానని వెళ్లిన బాలు చాలా సమయమైన తిరిగిరాకపోవడంతో నీలకంఠంలో అనుమానం మొదలవుతుంది. సంజు కోసం అతడి రూమ్‌కు వస్తుంది రేవతి. కానీ సంజు రూమ్‌లో కనిపించదు. కొ
డుకు మాయమైనందుకు బాధపడాలో...పెళ్లి ఆగిపోయినందుకు సంతోషపడాలో తెలియక అయోమయానికి లోనవుతుంది. నీలకంఠానికి ఈ విషయం తెలియగానే తాను బాలు సంగతి చూస్తానని ఆవేశంగా అంటాడు. బాలును పట్టుకొని సంజును విడిచిపించుకురమ్మని తన మనుషులతో పాటు పోలీసులకు ఆర్డర్ వేస్తాడు నీలకంఠం.
పోలీసులకు దొరికిన బాలు...
బాలుకు ఫోన్ చేస్తుంది మీనా. కానీ బాలు ఫోన్ లిఫ్ట్ చేయడు. తమ కారును పోలీసులు ఫాలో అవుతోన్న సంగతి కనిపెట్టిన రాజేష్ కంగారు పడతాడు. బాలు కిడ్నాప్ అయిన సంగతి అందరికి తెలిసిన ఎవరూ ఏం తెలియనట్లు మండపంలో నటిస్తోంటారు.
మాటిమాటికి మీనాను టార్గెట్ చేస్తూ ఆమెను సూటిపోటి మాటలు అంటుంది ప్రభావతి. పోలీసులకు దొరికిపోతాడు బాలు. అతడిని పట్టుకొని సంజును విడిపిస్తారు. బాలు పెళ్లికి కాకుండా అతడిని కట్టిపడేస్తాడు సంజు. మీ ఫ్యామిలీపై రివేంజ్ తీర్చుకోవడానికే మౌనికను పెళ్లిచేసుకుంటున్నట్లు చెబుతాడు.అక్కడితో గుండెనిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.