Gunde Ninda Gudi Gantalu: చెల్లి లైఫ్ కోసం బాలు రిస్క్ - సంజు కిడ్నాప్ - ప్రభావతి ప్లాన్ రివర్స్
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 27 ఎపిసోడ్‌లో మౌనిక పెళ్లిని అడ్డుకునేందుకు సంజును కిడ్నాప్ చేయాలని అనుకుంటాడు బాలు. మరోవైపు మౌనిక పెళ్లికి రవి, శృతిని ఆహ్వానిస్తుంది ప్రభావతి. తాము పెళ్లికి రామని అత్తయ్య ముఖం మీదే చెప్పేస్తుంది శృతి.
Gunde Ninda Gudi Gantalu: సంజుతో మౌనిక పెళ్లిని ఫిక్స్ చేస్తారు సత్యం, ప్రభావతి. సంజు మంచివాడు కాదని బాలు ఎంత చెప్పిన తల్లిదండ్రులు వినరు. రెండు రోజుల్లోనే పెళ్లి ఉండటంతో సత్యం, ప్రభావతి, మనోజ్ పెళ్లి పనులతో బిజీ అవుతారు. తన కళ్ల ముందే చెల్లి జీవితం నాశనం అవుతోన్న ఏం చేయలేకపోతాడు బాలు.
తనలో తానే కుమిలిపోతుంటాడు. ఇది నీ చెల్లెలి వివాహమని, పెళ్లి పనులు చూసుకోమని బాలుతో అంటాడు సత్యం. నా చేతులతో నేను మౌనికను నిప్పుల కొలిమిలోకి తోయనని, నన్ను ఇందులోకి లాగొద్దని తండ్రికి బాలు సమాధానమిస్తాడు.
సుశీల ఎంట్రీ...
అప్పుడే సుశీల అక్కడికి రావడంతో టాపిక్ డైవర్ట్ అవుతుంది. బాలు ముభావంగా కనిపించడం చూసి ఏమైందని సుశీల అంటుంది. కానీ బాలు సమాధానం చెప్పడు. ఇంట్లో అందరి ముఖాల్లో నవ్వు కనిపిస్తోన్న బాలు మాత్రం కోపంగా కనిపిస్తాడు.
కనిపించని రవి...
మౌనిక పెళ్లి టైమ్‌లో రవి కనిపించకపోవడంతో సుశీల అనుమానపడుతుంది. రవి ఎక్కడికి వెళ్లాడని అడుగుతుంది. సమాధానం చెప్పకుండా పెళ్లి పనుల పేరుతో ప్రభావతి మాట దాటేస్తుంది. ఇంట్లో వాళ్లందరికి డ్రెస్‌లు తీసుకుంటాడు మనోజ్.
రోహిణి తండ్రికి కూడా డ్రెస్ తీసుకుంటే బాగుంటుందని సుశీల సలహా ఇస్తుంది. మీ నాన్నను పెళ్లికి తానే స్వయంగా పిలుస్తానని రోహిణి అంటుంది. ఫోన్ చేయమని అంటుంది. నాన్నకు పెళ్లి విషయం తాను చెప్పానని, ఇప్పుడు మీటింగ్‌లో బిజీగా ఉంటారని రోహిణి అబద్ధం ఆడుతుంది.
ప్రభావతి సెంటిమెంట్ డైలాగ్స్....
మళ్లీ రవి టాపిక్ ఎత్తుతుంది సుశీల. రవి జాబ్‌లో బిజీగా ఉన్నాడని, పెళ్లికి వస్తే జాబ్ పోయే ప్రమాదం ఉందని సత్యం అబద్ధం చెబుతాడు. ఆ తర్వాత భర్తను పక్కకు తీసుకెళ్లి...రవి, శృతిని పెళ్లికి పిలుద్దామని అంటుంది. ఇదే మాట బాలుతో చెప్పమని సత్యం అంటాడు. నా మాట ఇంట్లో ఎవరు వినడం లేదని భర్తను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తుంది ప్రభావతి. నువ్వే వెళ్లి రవి, శృతిని పిలవమని సత్యం అంటాడు.
రవి ఆనందం...
కామాక్షితో కలిసి రవి ఇంటికి వెళుతుంది ప్రభావతి. రవి వంట చేయడం చేసి ప్రభావతి, కామాక్షి సెటైర్లు వేస్తారు. శృతిని వంట చేయమని అడగొచ్చుగా అని ప్రభావతి అంటుంది. శృతికి వంటపై ఇంట్రెస్ట్ లేదని భార్యను వెనకేసుకువస్తాడు రవి. మౌనిక పెళ్లికి ఇద్దరిని పిలుస్తుంది.
ఈ పెళ్లితోనైనా మళ్లీ మనం అందరం ఒక్కటి కావాలని ప్రభావతి అంటుంది. కానీ బాలు అన్నయ్య ఏమనుకుంటాడోనని రవి భయపడిపోతాడు. బాలును చూసి భయపడాల్సిన అవసరం లేదని, ఆ ఇంటిపై బాలుకు ఎంత హక్కు ఉందో నీకు అంతే హక్కు ఉందని ప్రభావతి అంటుంది. బాలు ఏం అంటాడో నేను చూస్తానని, వాడి సంగతి పట్టించుకోకుండా పెళ్లికి రమ్మని అంటుంది.
పెళ్లికి రాను....
పెళ్లి కార్డు ఓపెన్ చేయబోతుండగా శృతి ఎంట్రీ ఇస్తుంది. ప్రభావతి, కామాక్షిని చూసి సంబరపడుతుంది. మౌనిక పెళ్లి గురించి శృతికి చెబుతుంది ప్రభావతి. కానీ తాము పెళ్లికి రామని అత్తయ్యకు ముఖం మీదే చెప్పేస్తుంది శృతి. పెళ్లికి వస్తే మమ్మల్ని అందరూ వింతగా చూస్తారని, బాలు కూడా మమ్మల్ని చూస్తూ ప్రశాంతంగా ఉండలేడని, రవిని కొట్టిన కొడతాడని శృతి అంటుంది.
మనింట్లో పెళ్లికి మీరు రాకపోతే ఎలా...ఏదన్నా ఉంటే నేను చూసుకుంటానని ప్రభావతి సర్ధిచెప్పబోతుంది. కానీ శృతి ఆమె మాటలు వినదు. ఇంకొకరి సంతోషం కోసం నేను బాధపడలేను. ఇప్పటివరకు జరిగింది చాలని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
బాలు కాంప్రమైజ్...
శృతి తరఫున తల్లికి సారీ చెబుతాడు రవి. ఎలాగైనా శృతిని ఒప్పించి పెళ్లికి తీసుకురమ్మని ప్రభావతి అంటుంది. మౌనిక పెళ్లికి వెళ్లడానికి బాలు రెడీ అవుతాడు. సడెన్‌గా బాలు కాంప్రమైజ్ కావడం చూసి రాజేష్ షాకవుతాడు. తన ప్లాన్‌ను రాజేష్‌కు చెబుతాడు బాలు. సంజును కిడ్నాప్ చేయబోతున్నట్లు తన ప్లాన్ వివరిస్తాడు. బాలుకు సాయం చేయడానికి రాజేష్ భయపడతాడు. కానీ తన కోసమే సంజుతో బాలు గొడవపెట్టుకున్న విషయం గుర్తొచ్చి హెల్ప్ చేయడానికి అంగీకరిస్తాడు.
పంచెకట్టులో బాలు...
పెళ్లికి ఇంట్లోవాళ్లందరూ బయలుదేరుతారు. బాలు పంచెకట్టుతో రెడీ అయ్యివస్తాడు. అతడిని చూసి ఇంట్లో వాళ్లందరూ షాకవుతారు. పంచెకట్టులో ఎలా ఉన్నానని మీనాను అడుగుతాడు బాలు. బాగున్నారని మీనా కాంప్లిమెంట్ ఇస్తుంది. పంచెకట్టులో అచ్చం మీ తాతలాగే ఉన్నావని సుశీల అంటుంది. బాగున్నారు తాతగారు మీనా అంటుంది. థాంక్స్ బామ్మగారు అని బాలు బదులిస్తాడు.
కొడుకుకు వార్నింగ్...
పెళ్లిలో ఎవరితో గొడవపెట్టుకోవద్దని కొడుకుకు వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి. నేను ఏం చేసినా మీరు ఈ పెళ్లి ఆపరని తెలిసినప్పుడు నేను ఎందుకు గొడవ పెట్టుకుంటానని బాలు అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.