Gunde Ninda Gudi Gantalu: బాలును కొట్టిన సత్యం - మౌనిక పెళ్లి పనులకు మీనా దూరం - సంజు కన్నింగ్ ప్లాన్
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు డిసెంబర్ 26 ఎపిసోడ్‌లో సంజుతో మౌనిక పెళ్లిని ఎలాగైనా ఆపాలని బాలు ఫిక్సవుతాడు. తాగొచ్చి సంజు ఇంటి దగ్గర గొడవ చేస్తాడు. అక్కడే ఉన్న సత్యం బాలును కొట్టి అక్కడి నుంచి పంపిచేస్తాడు.
Gunde Ninda Gudi Gantalu: సంజు బారి నుంచి మౌనిక ఎలాగైనా కాపాడాలని ఫిక్సవుతాడు బాలు. కొట్టింది తానే అని తెలిసి కూడా మౌనికను పెళ్లి చేసుకోవడానికి సంజు ఇంటికిరావడం, పెళ్లికి నీలకంఠం ఒప్పుకోవడం వెనుక ఏదో పెద్ద కుట్ర ఉండి ఉంటుందని బాలు అనుకుంటాడు.
ఇంటి దగ్గర తాను ఎంత అవమానించిన తమ నిజస్వరూపం బయటపడకుండా పెద్ద మనసుషుల్లా నీలకంఠం, సంజు చాలా తగ్గి మాట్లాడటంతో బాలు అనుమానం మరింత బలపడుతుంది. తనపై పగతోనే మౌనికను సంజు టార్గెట్ చేశాడని గ్రహించిన బాలు ఎలాగైనా పెళ్లి ఆపాలని అనుకుంటాడు.
సంజుకు సారీ...
బాలు తరఫున నీలకంఠం, సంజుకు సారీ చెప్పడానికి సత్యం, ప్రభావతి వారి ఇంటికివస్తారు. బాలు కుటుంబంపై నీలకంఠానికి కోపం ఉన్నా కొడుకు పగ కోసం ఏ బాధ లేనట్లుగా నటిస్తాడు. అది చూసి సత్యం, ప్రభావతి ఆనందపడతారు. మీ సంబంధం మాకు ఎంతో నచ్చిందని సత్యం అంటాడు.
వెంటనే తాంబూలాలు మార్చుకొని ముహుర్తం పెట్టుకుందామని నీలకంఠం తొందరపెడతాడు. ఇప్పుడు తాంబూలాలు మార్చుకొని మరోసారి ముహూర్తం పెట్టుకుందామని సత్యం సమాధానమిస్తాడు. ఆడపిల్ల పెళ్లి అంటే ఖర్చుల చూసుకోవాలి...ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభావతి అంటుంది.
బాలు ఎంట్రీ...
అవన్నీ తాము చూసుకుంటామని, తమ ఫామ్‌హౌజ్‌లోనే పెళ్లిని గ్రాండ్‌గా చేద్ధామని ప్రభావతి, సత్యంతో నీలకంఠం చెబుతాడు. ఫుల్‌గా మందుకొట్టిన బాలు...నీలకంఠం ఇంటికొచ్చి గొడవ చేస్తాడు.బాలు ఇంటి లోపలికి వెళ్లకుండా నీలకంఠం మనుషులు అడ్డుపడతారు. బాలు గొడవను తనకు అనుకూలంగా మార్చుకుంటారు సంజు నీలకంఠం. బాలు మాటను అతడి తల్లిదండ్రులతో పాటు మిగిలిన కుటుంబసభ్యులు ఎవరూ వినకుండా చేయాలని ఫిక్సవుతారు.
చచ్చిన పెళ్లి జరగనివ్వను...
నేను చచ్చిన ఈ పెళ్లి జరగనివ్వనని సంజుతో ఛాలెంజ్ చేస్తాడు బాలు. నిన్ను చంపైనా మౌనికను పెళ్లి చేసుకుంటానని బాలుతో చెబుతాడు సంజు. అతడి మాటలతో బాలు ఆవేశం పట్టలేకపోతాడు. నిన్ను, నీలకంఠాన్ని చంపేస్తానని రచ్చ చేస్తాడు. బాలు చేసిన గొడవ వల్ల పెళ్లి ఆగిపోయిందని, మౌనికకు పెద్ద గండం తప్పిందని అనుకున్నానని, కానీ ఆస్తికి ఆశపడి మళ్లీ సంజును వెతుక్కుంటూ వచ్చారని, మీ ఖర్మ అని సంజు తల్లి రేవతి మనసులో అనుకుంటుంది.
సంజు కాలర్ పట్టుకున్న బాలు...
బాలు మాటలు విని కంగారుగా సత్యం, ప్రభావతి బయటకు వస్తారు. సంజు కాలర్ పట్టుకొని బాలు అతడిని కొట్టబొతుండటం చూసి సత్యం కొడుకును ఆపేస్తాడు. నీలకంఠం ఇంట్లో సత్యం ప్రభావతి ఉండటం చూసి బాలు షాకవుతాడు. మీరేంటి ఇక్కడ అని అడుగుతాడు. నువ్వు వద్దన్నా ఈ సంబంధమే ఖాయం చేసుకోవడానికి వచ్చామని ప్రభావతి అంటుంది. ఇళ్లు, ఆస్తి చూసి మోసపోవద్దని బాలు అంటాడు. సంజు మనిషి కాదని అతడిని కొట్టడానికివస్తాడు.
బాలును కొట్టిన సత్యం...
ఎంత ఆపిన వినకపోవడంతో సత్యం... బాలు చెంపపై గట్టిగా ఒక్కటి కొడతాడు. తండ్రి కొట్టిన దెబ్బకు బాలు ఎమోషనల్ అవుతాడు. కన్నీళ్లతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. బాలు ప్రవర్తన చూస్తుంటే పెళ్లి జరగనిచ్చేలా లేదని, అతడు అడ్డుకునే లోపే ఈ పెళ్లిని తొందరగా జరిపిద్దామని నీలకంఠం అంటాడు. రెండు రోజుల్లోనే మంచి ముహూర్తం ఉందని పంతుల అంటాడు. ఖర్చులన్నీ తాము చూసుకుంటామని నీలకంఠం అనడంతో ప్రభావతి పెళ్లికి ఒప్పుకుంటుంది. తాంబూలాలు మార్చుకుంటారు.
ప్రభావతి ఫైర్...
ఇంటికొచ్చిన ప్రభావతి బాలుపై ఫైర్ అవుతుంది. నువ్వు అసలు మనిషివేనా...ఇంటికొచ్చిన వారిని అవమానించి పంపించావు. అక్కడికి వచ్చి గొడవ చేశావు. ఇంత చేసినా వాళ్లు నీ చెల్లెలిపై ఇష్టంతో మౌనిక పెళ్లి చేసుకోవడానకి ఒప్పుకున్నారని బాలును కోప్పడుతుంది. వాళ్ల డబ్బు, పరపతికి ఈ పాటికి నీపై కేసు పెట్టేవాళ్లని, కానీ మౌనిక ముఖం చూసుకొని ఆగిపోయారని ప్రభావతి అంటుంది. తాంబూలాలు మార్చుకున్న తర్వాత బాలు ఏం చేయలేదని మనోజ్ అంటాడు. ఎంతటి అదృష్టవంతులకైనా దురదృష్టం పట్టించగలడని బాలును నానా మాటలు అంటుంది ప్రభావతి.
మౌనిక నాకు శత్రువు కాదు...
సంజు తాగాడాని, గొడవ చేశాడని పెళ్లి వద్దన్నావు. మరి నువ్వు చేసింది ఏమిటి అని కొడుకును నిలదీస్తాడు సత్యం. నా బాధను ఎవరూ ఎందుకు అర్థం చేసుకోవడం లేదని, మౌనికకు తాను శత్రువును కాదని బాలు అంటాడు. సంజుతో పెళ్లి జరిగితే మౌనిక జీవితం ఏమైపోతుందోనని భయపడిపోతాడు. వాడు మంచివాడు కాదని బాలు చెప్పబోతుండగా ప్రభావతి అతడి మాటలను అడ్డుకుంటుంది.
నువ్వు అసలు పెళ్లికే రావద్దని అంటుంది. సత్యం కూడా బాలు మాటలను విననని చెబుతాడు. పెళ్లి నిశ్చయమైపోయిందని, రెండు రోజుల్లోనే ముహూర్తం ఉందని సత్యం అనడంతో బాలు సైలెంట్ అవుతాడు.
మీనాపై చెయ్యేత్తిన బాలు...
బాలుకు మీనా సపోర్ట్ చేస్తుంది. బాలు చెప్పేది ఒక్కసారి వినమని సత్యాన్ని బతిమిలాడుతుంది.మీనా మాటలను బాలు అడ్డుకుంటాడు. వదిలేయమని చెబుతాడు. అయినా వినకుండా మీనా మాట్లాడుతుంటే బాలు కోపంగా భార్యను కొట్టడానికి చెయ్యేత్తుతాడు. అతడి చూసి మీనా షాకవుతుంది. కన్నీళ్లతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
పెళ్లి ఏర్పాట్లు...
ప్రభావతి, మనోజ్, రోహిణి కలిసి పెళ్లి ఏర్పాట్లు చేస్తుంటారు. సత్యం పెళ్లి కార్డులను ప్రింట్ చేసి తీసుకొస్తాడు. పెళ్లి పనులకు మీనా, బాలు దూరంగా ఉంటారు. మౌనిక, సంజు ఒకరికొకరు ఫోన్‌లో సంతోషంగా బాలు కళ్ల ముందే మాట్లాడుకుంటుంటారు. పెళ్లి పత్రికలు కూడా పంచడం పూర్తయిందని, మౌనిక కూడా సంజును భర్తగా ఒప్పుకుందని, ఇప్పుడు ఏం చేయలేరని వదిలేయమని బాలుతో అంటుంది మీనా.
బాలు స్కెచ్...
పెళ్లికి సత్యంకుటుంబం అంతా బయలుదేరుతారు. బాలు రాడని అనుకుంటారు. కానీ పంచెకట్టులో రెడీ అయిపోయి బాలు పెళ్లికి బయలుదేరుతాడు. సంజును కిడ్నాప్ చేసి మౌనిక పెళ్లిని ఆపాలని బాలు స్కెచ్ వేస్తాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.