ఉగాది రోజున వండిన ప్రసాదం రుచి బాగుందని మాణిక్యం అంటాడు. తన భార్య మిగిలిపోయిన మటన్ ప్రతిరోజు వండిపెడుతుందని, ఇలాంటి వంటకాలు ఎప్పుడు చేయదని నోరుజారుతాడు.
అతడి మాటలతో సత్యం ఫ్యామిలీ మొత్తం షాకవుతారు. మాణిక్యంపై బాలుకు ఉన్న డౌట్ మరింత పెరుగుతుంది. మీరు వచ్చిన దగ్గర నుంచి మేక మీద సవారీ చేస్తున్నారు. మటన్‌లోనే మునిగితేలుతున్నారు. మీరు మటన్ కొట్టు నడుపుతున్నట్లు అనుమానంగా ఉందని అంటాడు.
నాకు మటన్ అంటే మహా ఇష్టం, మేకను దేవతగా ఫీలవుతాను అంటూ తెలివిగా మాట్లాడి నిజం బయటపడకుండా జాగ్రత్తపడతాడు మాణిక్యం. మీనాను పిలిచి ఆమెకు ప్రేమగా ప్రసాదం తినిపిస్తుంది సుశీల. మరి నాకు అంటూ బాలు వస్తాడు. నువ్వేమైనా పసిపిల్లాడివా అని సుశీల అంటుంది. నీ చేతితో తిని చాలా రోజులైంది అని బాలు ప్రేమగా అడుగుతాడు. బాలుకు ప్రసాదం తినిపిస్తుంది. ఆ తర్వాత రవి, మనోజ్‌తో పాటు శృతి, రోహిణిలకు కూడా తినిపిస్తుంది సుశీల.
తనకు అందరూ సమానమేనని అంటుంది. నువ్వే ఇద్దరు కోడళ్లకు తినిపించి మరో కోడలిని పట్టించుకోవని ప్రభావతిపై సెటైర్ వేస్తుంది సుశీల. అందరూ ఒకటిగా ఉంటే చూడముచ్చటగా ఉందని, మా అమ్మను చూసి నేర్చుకోమని ప్రభావతితో అంటాడు సత్యం. ఓ నోట్‌బుక్ పెన్ను ఇవ్వండి, రోజుకొకటి రాసుకుంటానని ప్రభావతి నిష్టూరమాడుతుంది.
మాణిక్యం దూరంగా ఉండటంతో అతడిని ఫొటో దిగడానికి రమ్మని అంటుంది. ఇప్పుడు మీరు మా కుటుంబంలోని ఓ సభ్యుడేనని చెబుతుంది. మాణిక్యాన్ని స్క్రిప్ చేస్తూ ఫొటో తీయమని రాజేష్‌కు ఐడియా ఇస్తాడు బాలు.అందరూ కలిసి గ్రూప్ ఫొటో దిగుతారు.
ఆ తర్వాత బాలుతో కలిసి రొమాంటిక్‌గా ఫొటో దిగాలని మీనా ఆశపడుతుంది. శృతి ఫోన్‌లో ఫొటో తీయమని అంటుంది. శృతి ఫోన్‌లో ఫొటో దిగడానికి బాలు ఒప్పుకోడు. తన ఫోన్‌లోనే దిగుతానని అంటాడు. మీనా బతిమిలాడటంతో అలక వీడుతాడు. రొమాంటిక్‌గా ఎలా దిగాలో బాలుకు రవి, శృతి కలిసి చూపిస్తారు. వారు చెప్పినట్లే చేస్తాడు.
బాలు, మీనాలను చూసి మనం కూడా అలాగే ఫొటో దిగుదామా అని మనోజ్‌తో అంటుంది రోహిణి. మీ మలేషియా మావయ్యను పిలవమని మనోజ్ బదులిస్తాడు. పొరపాటున మాణిక్యం అని పిలుస్తుంది రోహిణి. అప్పుడప్పుడు పేరు పెట్టి పిలుస్తానని కవర్ చేస్తుంది.
మాణిక్యం చెప్పిన ఫోజు పెట్టబోయి మనోజ్ కిందపడతాడు. నడుం పట్టేసిందని బాధతో విలవిలలాడుతాడు. ఆ సీన్ చూసి రవి, శృతి...మీనా బాలు నవ్వుకుంటారు. మాణిక్యానికి కడుతిలో పడ్డోడు అని పేరు పెడతాడు. తన మావయ్యను బాలు అవమానించాడంటూ రోహిణి ర చ్చ చేస్తుంది. మాణిక్యం మన అతిథి అని, ఆయన్ని ఏమైనా అంటే బాగుదో అని బాలుకు వార్నింగ్ ఇస్తుంది.
అందరికి కిల్లీలు తీసుకొస్తుంది మీనా. ఈ కిల్లీ చూస్తుంటే మంచి మేకపోతు మాంసం గుర్తొస్తుంది మళ్లీ మటన్ కొట్టు భాష మొదలుపెడతాడు మాణిక్యం. నీ ఉద్యోగం ఎలా ఉందని మనోజ్‌ను అడుగుతాడు మాణిక్యం. ఉద్యోగం వెతకడం ఎలా ఉందని అడగంటి అని బాలు పంచ్‌లు వేస్తాడు. మనోజ్ ఎక్కువగా చదువుకున్నాడని ప్రభావతి కవర్ చేయబోతుంది. గవర్నర్ జాబ్‌కు మనోజ్‌ను పిలిచారు కానీ బద్దకంతో పోలేదు అని బాలు వెటకారం ఆడుతాడు.
నాకు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసి మీలా ఎదగాలని ఉందని మాణిక్యంతో అంటాడు మనోజ్. నాకున్న టాలెంట్‌కు సరైన జాబ్ దొరకడం లేదని చెబుతాడు. నన్ను జాబ్‌లో తీసుకునే టాలెంట్ కూడా కంపెనీలకు ఉండటం లేదని బిల్డప్‌లు ఇస్తాడు అవును అది నీ మొహం చూస్తేనే అర్థమవుతుందని మాణిక్యం అంటాడు. మనోజ్ కథలన్నీ తెలిసిపోయాయా అని బాలు పంచ్‌వేస్తాడు. మనోజ్ మొహంలో ఓనర్ కల కనబడుతుందని మాణిక్యం మాట మార్చేస్తాడు.
నా బిజినెస్ కోసం డబ్బు ఇవ్వమని మీరే రోహిణితో ఫాదర్‌తో చెప్పాలని మాణిక్యంతో అంటాడు మనోజ్.
రెండు నెలల్లో డబ్బు తిరిగి ఇస్తానని మనోజ్ చెప్పబోతాడు. మధ్యలోనే అడ్డుకున్న ఆ డబ్బు మొత్తం అమ్యామ్యా అంటూ నాకేస్తాడని వెటకారం ఆడుతాడు.
రోహిణి వల్ల నాన్న పెద్ద బిజినెస్‌మెన్ అని, వ్యాపార వ్యవహారాల్లో పడి భార్యను పట్టించుకోలేదని, క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లమ్ వచ్చి చనిపోయిందని అంటాడు. తన కాపురం కోసం బతికి ఉన్న తల్లి చనిపోయినట్లు చెప్పాల్సివచ్చినందుకు రోహిణి బాధపడుతుంది. తనది ఓ బతుకేనా అని బాధపడుతుంది.
బయటకు వచ్చి తల్లికి ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగి కన్నీళ్లు పెట్టుకుంటుంది. సడెన్‌గా నువ్వు గుర్తొచ్చావని అంటుంది. రోహిణి వాళ్ల నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడని నోటికి వచ్చిన అబద్ధం ఆడుతాడు మాణిక్యం. ఆ విషయంలో రోహిణికి కోపం వచ్చి తండ్రిని దూరం పెట్టిందని అంటాడు.
ఆయన్ని ఒక్కసారి వచ్చి కూతురిని చూసి పొమ్మని చెప్పమని మాణిక్యంతో అంటాడు సత్యం. ఆయన బదులుగా నేను వచ్చానని మాణిక్యం అబద్ధం ఆడుతాడు.
చెరుకు గడ తినాలని ఉందని సత్యం అంటాడు. ఆ చెరుకుగడను విరవమని మనోజ్‌కు ఇస్తాడు బాలు. తన వల్ల కాదని మనోజ్ అంటాడు. చెరుకు గడ తీసుకొని ఈజీగా విరుస్తుంది మీనా. గుడి దగ్గర మీనా చెరుకుబండి నడిపేది కదా...ఆ అనుభవం ఇక్కడ చూపించిందని చులకన చేసి మాట్లాడుతుంది ప్రభావతి. శృతిని కాపాడినప్పుడు ఇటుకలు వాడావు కదా..అందులో నుంచి ఒక్కటి తీసుకొచ్చి ప్రభావతి నెత్తిపై వేయమని బాలు అంటాడు.
తల్లిని గుర్తుచేసుకొని రోహిణి బాధపడుతుంది. ఆమెను మీనా, శృతి ఓదార్చుతారు. బాధపడకు రోహిణి. నీకు నేను ఉన్నాను. అమ్మలా చూసుకుంటానని రోహిణితో అంటుంది ప్రభావతి. ముందు ముగ్గురు కోడళ్లను సమానంగా చూసుకోమని సుశీల అంటుంది. కొడుకుల మధ్య నువ్వు చూపించిన బేధాల వల్ల శత్రవులుగా మారిపోయారు. కోడళ్లనైనా బాగా చూసుకో. నీ కొడుకులు, కోడళ్లు ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోతే నువ్వు, సత్యం తట్టుకోలేకరని ప్రభావతికి క్లాస్ ఇస్తుంది సుశీల.
మాణిక్యానికి మందు తాగించి అతడి దగ్గర నుంచి నిజం రాబట్టాలని ప్లాన్ వేస్తాడు బాలు. బాగా తాగేసిన మాణిక్యం మత్తు ఎక్కువై పడిపోతాడు. ఖచ్చితంగా మాణిక్యం మలేషియా నుంచి రాలేదని, అతడి నుంచి ఎలాగైనా నిజాన్ని రాబట్టాలని బాలు అనుకుంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం