Gunde Ninda Gudigantalu Serial: హోట‌ల్ స‌ప్ల‌య‌ర్‌గా మారిన మ‌నోజ్ -నోరు జారి చిక్కుల్లో ప‌డ్డ రోహిణి -బాలుకు మీనా క్లాస్-gunde ninda gudi gantalu april 22nd episode balu insults manoj about his unemployment star maa serial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gunde Ninda Gudigantalu Serial: హోట‌ల్ స‌ప్ల‌య‌ర్‌గా మారిన మ‌నోజ్ -నోరు జారి చిక్కుల్లో ప‌డ్డ రోహిణి -బాలుకు మీనా క్లాస్

Gunde Ninda Gudigantalu Serial: హోట‌ల్ స‌ప్ల‌య‌ర్‌గా మారిన మ‌నోజ్ -నోరు జారి చిక్కుల్లో ప‌డ్డ రోహిణి -బాలుకు మీనా క్లాస్

Nelki Naresh HT Telugu

గుండె నిండా గుడి గంట‌లు ఏప్రిల్ 22 ఎపిసోడ్‌లో ప్ర‌భావ‌తికి ఎదురు మాట్లాడే ధైర్యం ఎందుకు లేద‌ని మీనాను నిల‌దీస్తాడు బాలు. అత్త‌య్య త‌న‌కు అమ్మ కంటే ఎక్కువ అని మీనా బ‌దులిస్తుంది. అత్తారింట్లో ఉన్నంత కాలం ఎవ‌రికి ఎదురుచెప్ప‌న‌ని అమ్మ‌కు మాటిచ్చాన‌ని మీనా స‌మాధాన‌మిస్తుంది.

గుండె నిండా గుడి గంట‌లు ఏప్రిల్ 22 ఎపిసోడ్‌

ప్ర‌భావ‌తి పార్ల‌ర్‌ను రోహిణి అమ్మేసింద‌ని, ఆమె ఇప్పుడు పార్ల‌ర్‌కు ఓన‌ర్ కాద‌నే విష‌యం కుటుంబ స‌భ్యుల‌కు చెప్ప‌లేక‌, త‌న‌లో దాచుకోలేక స‌త‌మ‌త‌మువ‌తాడు బాలు. నేను కారుకు ఓన‌ర్ క‌దా...కానీ కాదు. పేరు ఉంటుంది కానీ నేను ఓన‌ర్ కాదు...కొంత‌మందికైతే అదీ ఉండ‌దు అని బాలు అంటాడు. అస‌లు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావ‌డం లేద‌ని మీనా అంటుంది.

అర్ధ‌రాత్రి గోల‌....

ప్ర‌భావ‌తి నిద్ర‌కు డిస్ట్ర‌బ్ కావ‌డంతో అర్ధ‌రాత్రి వేళ మీ గోల ఏంటి అని అంటుంది. గండుపిల్లి అరుస్తుంది నిద్ర‌పోదాం ప‌దా మీనా అని ప్ర‌భావ‌తి సెటైర్లు వేస్తాడు బాలు. వేళ కానీ వేళ తిండి ఏంటి అని బాలుతో అంటుంది ప్ర‌భావ‌తి. ఏడ‌వ‌కు వెళుతున్నాం అని బాలు కోపంగా అంటాడు.

ఆ పార్ల‌ర్ గొడ‌వ ఆప‌మ‌ని బాలును రిక్వెస్ట్ చేస్తాడు స‌త్యం. ఈ రాత్రికి ఆపేస్తాన‌ని బాలు అంటాడు. దేవుడా వీడి నోటికి తాళం వేసే మార్గం ఉంటే చూడ‌మ‌ని దేవుడిని వేడుకుంటాడు స‌త్యం.

మ‌నోజ్ ఆర్డ‌ర్‌...

మ‌నోజ్ టిప్‌టాప్‌గా రెడీ అయ్యి వ‌స్తాడు. ఇంట‌ర్వ్యూకు టైమ్ అవుతుంద‌ని, టిఫిన్ రెడీనా అంటూ త‌ల్లిని అడుగుతాడు. మీనా అంటూ ప్ర‌భావ‌తి కేక‌లు వేస్తుంది. ఏ ప‌ని ఉన్నా మీనానే పిలుస్తావేంటి అని త‌ల్లిని అడుగుతాడు బాలు. వంట ప‌ని మీనాదే క‌దా అని ప్ర‌భావ‌తి అంటుంది. అలా అని రాసిచ్చిందా? అగ్రిమెంట్ చూపించ‌మ‌ని బాలు అంటాడు. అయ్య‌గారికి జాబ్ వ‌స్తుందో లేదో తెలియ‌దు. దున్న‌పోతులా తిని షికార్లు చేస్తాడు. లేదంటే పార్కులో ప‌డుకుంటాడు అని మ‌నోజ్ గాలితీసేస్తాడు బాలు.

నాకు మోసం చేయ‌డం రాదు...

కాస్త సైలెంట్‌గా ఉండ‌మ‌ని కొడుకును మంద‌లిస్తాడు స‌త్యం. అది ఈ జ‌న్మ‌కు జ‌ర‌గ‌దు అని రోహిణి అంటుంది. సైలెంట్‌గా ఉంటూ అంద‌రిని మోసం చేయ‌డం నాకు రాద‌ని రోహిణిపై పంచ్ వేస్తాడు బాలు. మ‌నోజ్‌కు పెద్ద జాబ్ వ‌స్తుంద‌ని అసూయ నీకు అని బాలుతో అంటుంది ప్ర‌భావ‌తి. ఇది పెద్ద జోక్ అని, వీడు వ‌ర‌ల్డ్ బ్యాంక్ మేనేజ‌ర్‌...నేను అసూయ ప‌డ‌టం... కామెడీ కాక‌పోతే అని బాలు అంటాడు.

పొయ్యి వెలిగించ‌రు...

లాండ్రీ అత‌డు బ‌ట్ట‌లు తీసుకొని వ‌స్తాడు. డ్రెస్‌లు ఐర‌న్‌కు ఎవ‌రు ఇచ్చార‌ని అడిగితే తాము ఇవ్వ‌లేద‌ని, మీనా, స‌త్యం అంటారు. మీ ఇంటివాళ్లు ఐర‌న్ బాక్స్ ముఖం చూసి ఎర‌గ‌ర‌ని, శ్రీరామ‌న‌వ‌మి, దేవీన‌వ‌రాత్రుల‌ అన్న‌దానాల టైమ్‌లో అస‌లు మీరు పొయ్యి కూడా వెలిగించ‌ర‌ని మీనా పుట్టింటిని త‌క్కువ చేసి మాట్లాడుతుంది ప్ర‌భావ‌తి. ఆవిడ‌కు ఈ యుగాంతం గాడిని మేపడం త‌ప్ప ఇంకెం తెలియ‌ద‌ని ప్ర‌భావ‌తిపై కోప్ప‌డుతాడు బాలు.

త‌ల్లిని డ‌బ్బులు అడిగిన మ‌నోజ్‌...

ఇస్త్రీ బ‌ట్ట‌లు నేను ఇచ్చాన‌ని మ‌నోజ్ అంటాడు. ఇంట‌ర్వ్యూకు వెళ్లాలంటే బ‌ట్ట‌లు ఐర‌న్ చేసి ఉండాల‌ని చెబుతాడు. ప‌న్నెండు వంద‌లు బిల్ అయ్యింద‌ని లాండ్రీ షాప్ అత‌డు అంటాడు. ఆ డ‌బ్బులు ప్ర‌భావ‌తిని అడుగుతాడు మ‌నోజ్‌. నేను త‌ర్వాత పంపిస్తాన‌ని, నువ్వు వెళ్ల‌మ‌ని లాండ్రీ షాప్ అత‌డితో ప్ర‌భావ‌తి చెబుతుంది. న‌మ్మోద్ద‌ని, పార్కు ప‌క్క‌న టీ స్టాల్ అత‌డికి మూడు వంద‌లు అప్పు చేసి ఎగ్గొట్టాడ‌ని మ‌నోజ్‌, ప్ర‌భావ‌తిని బాలు ఇరికిస్తాడు. ఆ డ‌బ్బులు నేను ఇస్తాన‌ని రోహిణి కోపంగా అంటుంది.

పార్ల‌ర్ లేదు క‌దా...

లాండ్రీ షాప్ పెట్టుకోమ‌ని మ‌నోజ్‌కు స‌ల‌హా ఇస్తాడు బాలు. నీ పేరు మీద పెడితే ఇది మూడో వ్యాపారం అవుతుంది అని అంటాడు. అవును మ‌ర్చిపోయాను పార్ల‌ర్ లేదు క‌దా అని నోరు జారుతాడు. బాలు మాట‌ల‌తో రోహిణి షాక‌వుతుంది. పార్ల‌ర్ లేక‌పోవ‌డం ఏంటి ప్ర‌భావ‌తి అంటుంది. మ‌న ఇంటి ముందు లేదు క‌దా అని స‌త్యం క‌వ‌ర్ చేస్తాడు. నా కోడ‌లు పార్ల‌ర్‌ను చాలా బాగా చూసుకుంటుంది ప్ర‌భావ‌తి గొప్ప‌లు చెబుతుంది.

అంద‌రి నోర్లు మూత‌ప‌డ‌తాయి...

మ‌నోజ్‌కు జాబ్ వ‌స్తుంది...మీ అంద‌రి నోర్లు మూత‌ప‌డ‌తాయ‌న్ ఆవేశంగా రోహిణి అంటుంది. రేంజ్ గురించి ఆలోచించ‌కుండా ఏదో ఒక జాబ్ చేసుకో అని భ‌ర్త‌కు స‌ల‌హా ఇస్తుంది. నేను కూడా పార్ల‌ర్‌లో ప‌ని చేస్తున్న క‌దా అని నోరుజారుతుంది. ఆమె మాట‌ల‌తో అంద‌రు షాక‌వుతారు. నువ్వు పార్ల‌ర్‌లో ప‌నిచేయ‌డం ఏంటి ప్ర‌భావ‌తి అనుమానంగా అడుగుతుంది. ఓన‌ర్‌ను అయివుండి ఎంప్లాయ్‌లా క‌ష్ట‌ప‌డుతున్నాన‌ని అర్థం అని అబ‌ద్ధం ఆడుతుంది రోహిణి. ఈ రోజు ఏదో ఒక జాబ్‌తో వ‌చ్చి న‌న్ను ఇంట్లో త‌లెత్తుకునేలా చేయ‌మ‌ని మ‌నోజ్‌ను బ‌తిమిలాడుతుంది రోహిణి.

పంచాయితీ పెద్ద‌...

బాలుకు ట్రిప్‌కు వెళ్ల‌బోతుండ‌గా...అత‌డిని మీనా ఆపుతుంది. మ‌నోజ్‌కు స‌ల‌హాలు ఇచ్చింది చాల‌ని, అత‌డి విష‌యంలో జోక్యం చేసుకోవ‌ద్ద‌ని చెబుతుంది. ఏదో పెద్ద పంచాయితీ పెద్ద అయిన‌ట్లు ఎప్పుడో ఎవ‌రో ఒక‌రిని అంటూనే ఉంటార‌ని భ‌ర్త‌పై కోప్ప‌డుతుంది. త‌ప్పు ఎవ‌రు చేసిన నేను ఇలాగే మాట్లాడుతాన‌ని బాలు అంటాడు.

అత్త‌గారిలో అమ్మ‌...

మా అమ్మ ద‌గ్గ‌ర ఎందుకు అన్నింటికి త‌లుపుతావ‌ని, అమ్మ‌తో ఆమెతో ధైర్యంగా మాట్లాడ‌లేవా అని మీనాను అడుగుతాడు. అత్త‌గారికి అమ్మ స్థానంలో చూస్తున్నాన‌ని, అంత‌కంటే ఎక్కువేన‌ని మీనా అంటుంది. అత్తారింట్లో ఉన్నంత‌కాలం ఎవ‌రికి ఎదురుచెప్ప‌న‌ని అమ్మ‌కు మాటిచ్చాన‌ని, ప్ర‌భావ‌తి ఎన్ని మాట‌లు అన్న ఆమె మీద కోపం రాద‌ని మీనా అంటుంది.

స‌ప్ల‌య‌ర్ జాబ్‌లో బాలు...

జాబ్ కోసం తిరిగి తిరిగి అల‌సిపోతాడు. అత‌డి డిగ్రీలు చూసి ఎవ‌రు జాబ్ ఇవ్వ‌డానికి ముందుకు రారు. ఓ హోట‌ల్‌లో స‌ప్ల‌య‌ర్స్ కావాల‌ని బోర్డ్ క‌నిపించ‌డంతో ఆ జాబ్‌లో జాయిన్ కావాల‌ని ఫిక్స‌వుతాడు.తొలుత మ‌నోజ్ వాల‌కం చూసి హోట‌ర్ ఓన‌ర్ మీరు అంటూ గౌర‌విస్తాడు. స‌ప్ల‌య‌ర్ జాబ్ ఇంట‌ర్వ్యూ కోసం వ‌చ్చాడ‌ని తెలిసి నువ్వు అంటూ పిలుస్తాడు. మీరు అని పిలిచి అప్పుడే మాట‌మార్చేసి నువ్వు అంటున్నార‌ని మ‌నోజ్ అడుగుతాడు. నీకు జాబ్ కావాలా? రెస్పెక్ట్ కావాలా అని రెస్టారెంట్ ఓన‌ర్ అంటాడు.

జాబ్ కండీష‌న్స్‌...

ఉద‌యం ప‌ది నుంచి రాత్రి ప‌ది గంట‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంటాడు. ప‌న్నెండు గంట‌లా అని మ‌నోజ్ షాక‌వుతాడు. శాల‌రీ ఎంత అని మ‌నోజ్ అడుగుతాడు. నాలుగు రోజులు ప‌ని చేసిన త‌ర్వాత చెబుతాన‌ని ఓన‌ర్ అంటాడు. జాబ్ విష‌యంలో కండీష‌న్స్ మీద కండీష‌న్స్ పెడ‌తాడు ఓన‌ర్‌. ఆ త‌ర్వాత మ‌నోజ్ క్వాలిఫికేష‌న్ అడుగుతాడు. ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుకున్నాన‌ని మ‌నోజ్ అబ‌ద్ధం ఆడుతాడు. నాకు అంత‌కంటే ఎక్కువ చ‌దివిన వాడు అవ‌స‌రం లేద‌ని ఓన‌ర్ అంటాడు.

బిల్డ‌ప్ అవ‌స‌రం లేదు...

ఈ రోజు నుంచే జాబ్‌లో జాయిన్ క‌మ్మ‌ని ఓన‌ర్ అంటాడు. రేప‌టి నుంచి జాయిన్ అవుతాన‌ని, కొత్త జాబ్ వ‌చ్చిన ఆనందంలో గుడికి వెళ‌తాన‌ని మ‌నోజ్ అంటాడు. ఈ జాబ్‌కు అంత బిల్డ‌ప్ అవ‌స‌రం లేద‌ని మ‌నోజ్‌కు క్లాస్ ఇస్తాడు ఓన‌ర్‌.

క్వీన్ పార్ల‌ర్‌...

మీనా పూల షాప్‌లో క‌నిపించ‌క‌పోవ‌డంతో బాలు కోప్ప‌డుతాడు. ఇంట్లో ప్ర‌భావ‌తి, రోహిణిల‌కు కాఫీ తాగుతుండ‌టం చూసి...ఈ మ‌హారాణికి, రాజ‌మాత‌కు కాఫీ నువ్వే ఇచ్చావా అని అంటాడు. మ‌హారాణిని ఇంగ్లీష్‌లో ఏమంటారో తెలుసా అని రోహిణినే అడుగుతాడు బాలు. క్వీన్ అని రోహిణి బ‌దులిస్తుంది. ఆ త‌ర్వాత ప్ర‌భావ‌తి, స‌త్యంతో కూడా క్వీన్ అనే మాట చెప్పిస్తాడు. క్వీన్ వాళ్ల‌కు పార్ల‌ర్ అమ్మిన విష‌యం బాలుకు తెలిసిందా అని రోహిణి కంగారు ప‌డుతుంది.

ప‌నిలేనివాళ్ల‌తో పొల్చ‌ద్దు...

నీకు ప‌ని ఉన్న‌ప్పుడు నేను పూల షాప్‌లో కూర్చుంటాన‌ని మీనాతో బాలు అంటాడు. బాలు మోచేయి పొడ‌వుగా ఉండ‌టంతో మీరు పూల మాల‌లు అమ్మితే మ‌న‌మే న‌ష్టం అని మీనా అంటుంది. ఆమె తెలివితేట‌లు చూసి బాలు మురిసిపోతాడు. నీకున్న తెలివితేట‌లు మా అమ్మ‌కు లేవ‌ని బాలు అంటాడు. మీనాతో నాకు పోలిక ఎంటి అని ప్ర‌భావ‌తి కోపంతో ఎగిరిప‌డుతుంది. ప‌నిచేసేవాళ్ల‌తో ఏ ప‌నిపాట లేకుండా ఖాళీగా తిని కూర్చునే వాళ్ల‌ను పోల్చ‌డం స‌రికాదంటూ ప్ర‌భావ‌తిపై సెటైర్లు వేస్తాడు స‌త్యం.

నౌక‌ర్లు ఓన‌ర్ల‌లా...

కొంద‌రు నౌక‌ర్లు ఓన‌ర్ల‌లు బిల్డ‌ప్‌లు ఇవ్వ‌గా లేనిది...నువ్వు ఓన‌ర్‌వి...నౌక‌ర్‌గా ఇంట్లో ప‌నిచేయ‌డం ఏంటి మీనాతో అంటాడు బాలు. త‌న గురించి మొత్తం తెలిసిన‌ట్లే బాలు మాట్లాడ‌టం చూసి రోహిణి భ‌యంతో వ‌ణికిపోతుంది. అప్పుడే మ‌నోజ్ స్వీట్ బాక్స్ తీసుకొని ఇంట్లో అడుగుపెడ‌తాడు. అంద‌రిని పిలుస్తాడు.

ఆయ‌న ఎప్పుడు కొనిస్తే...

మీనా ద‌గ్గ‌ర నుంచి తీసుకున్న బంగారం మొత్తం ఆమెకు ఇచ్చేయ‌మ‌ని ప్ర‌భావ‌తిపై కోప్ప‌డుతాడు స‌త్యం. అదేగా బంగారం మొత్తం ఒలిచి నా మొహాన కొట్టింది అని ప్ర‌భావ‌తి అంటుంది. మీరు పెట్టిన బంగారం చ‌చ్చినా వేసుకోన‌ని, ఆయ‌న ఎప్పుడు కొనిస్తే అప్పుడే మెడ‌లో వేసుకుంటాన‌ని మీనా అంటుంది. వాడిని న‌మ్ముకుంటే ముస‌లిదానివి అయ్యే వ‌ర‌కు ప‌సుపుతాడుతోనే ఉండాల‌ని ప్ర‌భావ‌తి అంటుంది. నా భ‌ర్త‌పై నాకు న‌మ్మ‌క‌ముంద‌ని మీనా బ‌దులిస్తుంది. అక్క‌డితో నేటి గుండె నిండా గుడి గంట‌లు సీరియ‌ల్ ముగిసింది.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం