అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఓ యాక్షన్ థ్రిల్లర్ అదరగొడుతోంది. కశ్మీర్ లో ఉగ్ర స్థావరాలను అంతం చేయడమే టార్గెట్ గా కొనసాగించే ఆర్మీ ఆపరేషన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఓటీటీని ఊపేస్తోంది. ఆ సినిమా పేరే ‘గ్రౌండ్ జీరో’. రీసెంట్ గా ఓటీటీలోకి అడుగుపెట్టిన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ ఇది అని మూవీ లవర్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఇమ్రాన్ హష్మి లీడ్ రోల్ ప్లే చేసిన గ్రౌండ్ జీరో మూవీ థియేటర్లలో అంచనాలను అందుకోలేకపోయింది. ఈ హిందీ సినిమా అనుకున్న స్థాయిలో ఆడియన్స్ కు రీచ్ కాలేకపోయింది. ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా రూ.10.5 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ మూవీ జూన్ 20న ఓటీటీలోకి వచ్చింది.
థియేటర్లలో ప్లాఫ్ గా నిలిచిన గ్రౌండ్ జీరో మూవీ ఓటీటీలో మాత్రం అదుర్స్ అనిపిస్తోంది. ఈ మూవీని ఓటీటీ లవర్స్ తెగ చూసేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇండియాలో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది ఈ మూవీ. బీఎస్ఎఫ్ సెకండ్ ఇన్ కమాండ్ ఆఫీసర్ గా ఇమ్రాన్ హష్మి యాక్ట్ చేశాడు. 2011లో భారత పార్లమెంట్ పై దాడి వెనుకు మాస్టర్ మైండ్ ను హంతం చేయడమే టార్గెట్ గా సాగే ఆపరేషన్ థ్రిల్ పంచుతుంది. ఈ థ్రిల్లర్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది.
ప్రైమ్ వీడియో ఓటీటీలో ఇండియాలో గ్రౌండ్ జీరో నంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఆ తర్వాత విజయ్ సేతుపతి తమిళ్ సినిమా ఏస్ ఉంది. ఈ మూవీ కూడా యాక్షన్ థ్రిల్లరే. ఇక టాలీవుడ్ యాక్టర్ నవీన్ చంద్ర కు ప్రైమ్ వీడియోలో తిరుగులేదు. అతని రెండు సినిమాలో టాప్-5లో ట్రెండ్ అవుతున్నాయి.
నవీన్ చంద్ర రెండు థ్రిల్లర్ మూవీస్ ప్రైమ్ వీడియో టాప్-5లో ట్రెండ్ అవుతున్నాయి. ఎలెవన్, బ్లైండ్ స్పాట్ సినిమాలు ఆడియన్స్ ను అలరిస్తున్నాయి. ఓ కేసును సాల్వ్ చేసే క్రమంలో కవలల విచారణ సినిమా ఎలెవన్ లో ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ్ సినిమాల్లో ఈ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇక బ్లైండ్ స్పాట్ సినిమాలో 24 ఏళ్ల యువతి మిస్టరీ కేసును సాల్వ్ చేసే ఆఫీసర్ గా నవీన్ చంద్ర కనిపిస్తాడు.
టాప్-5లో చివరగా బాలీవుడ్ కామెడీ ఫ్యాంటసీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ భూల్ చుక్ మాఫ్ ఉంది. థియేటర్లలో ఉండగానే ఈ సినిమా ఓటీటీలోకి రావడం గమనార్హం. తన పెళ్లి రోజు టైమ్ లూప్ లో చిక్కుకునే హీరో కథే ఈ సినిమా.
సంబంధిత కథనం