Ground Movie Review: గ్రౌండ్ రివ్యూ - గల్లీ బాయ్స్ మూవీ ఎలా ఉందంటే?
Ground Movie Review:సూరజ్ తాడి దర్శకత్వం వహిస్తూ నిర్మించిన గ్రౌండ్ మూవీ ఇటీవల థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాలో హరినాథ్, తేజస్విని ప్రధాన పాత్రలు పోషించారు.
Ground Movie Review: హరినాథ్, తేజస్విని ప్రధాన పాత్రల్లో నటించిన గ్రౌండ్ మూవీ ఇటీవల థియేటర్లలో విడుదలైంది. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో టీనేజ్ లవ్ స్టోరీతో దర్శకుడు సూరజ్ తాడి ఈ సినిమాను తెరకెక్కించాడు. అందరూ కొత్తవాళ్లతో రియలిస్టిక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందంటే?
గల్లీ క్రికెట్ మ్యాచ్...
హరి, తేజూ ప్రేమలో ఉంటారు. తమ ప్రేమ విషయం ఇంట్లో తెలియకుండా జాగ్రత్తపడుతుంటారు. హరికి క్రికెట్ అంటే ఇష్టం. ఓ రోజు క్రికెట్ ఆడటానికి తన స్నేహితులతో కలిసి గ్రౌండ్‌కు వెళతాడు. స్నేహితులకు ఇష్టం లేకపోయినా హరి బలవంతం కారణంగా మరో టీమ్‌తో కలిసి బెట్టింగ్ మ్యాచ్ ఆడుతారు. ఆ మ్యాచ్ కారణంగా హరికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? బెట్టింగ్ విషయం తేజూ దగ్గర హరి ఎందుకు దాచాడు? ఒక్కరోజులో వారి ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగింది అన్నదే గ్రౌండ్ మూవీ కథ.
రియలిస్టిక్ లవ్ స్టోరీ...
స్పోర్ట్స్ డ్రామా కు లవ్‌స్టోరీని జోడించి దర్శకుడు సూరజ్ తాడి గ్రౌండ్ సినిమాను తెరకెక్కించాడు. సినిమా మొత్తం రియలిస్టిక్‌గా ఉంటుంది. సినిమా కాకుండా కళ్లముందు నిజంగానే గల్లీ క్రికెట్ మ్యాచ్ చూసిన ఫీలింగ్‌ను కలిగిస్తుంది. డైలాగ్స్ కూడా సినిమాటిక్ ఫీల్‌తో కాకుండా నాచురల్‌గా ఉండేలా దర్శకుడు జాగ్రత్తపడ్డాడు. బీజీఎమ్ విషయంలో దర్శకుడు తన క్రియేటివిటీని చాటుకున్నాడు ట్రైన్ సౌండ్స్, పక్షుల అరుపులు ఇలాంటివి మిక్స్ చేస్తూ మ్యూజిక్ వినిపిస్తుంది.
ట్విస్ట్‌లు..టర్న్‌లు లేకుండా...
ఓవైపు క్రికెట్...మరోవైపు లవ్ స్టోరీ రెండింటిని మిక్స్ చేస్తూ డైరెక్టర్ కథను నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది.రెగ్యులర్ సినిమాల్లో మాదిరిగా ట్విస్ట్, టర్న్‌లు లేకుండా నిజంగానే గల్లీ క్రికెట్‌లో స్నేహితుల మధ్య ఉండే గొడవలు, అపోజిట్ టీమ్‌పై గెలవడానికి వేసే ఎత్తులను చూపించారు.రొమాంటిక్ డ్యూయెట్స్, యాక్షన్ సీక్వెన్స్, ఛేజింగ్‌లు కూడా ఉండవు. కథ మొత్తం ఒకే రోజులో ఒకే గ్రౌండ్‌లో నడుస్తుంది. గ్రౌండ్ మూవీ నిడివి గంట నలభై రెండు నిమిషాలే కావడం కూడా ప్లస్ పాయింట్‌గా చెప్పవచ్చు.
నిదానమే మైనస్…
పాత్రల పరిచయం కోసం దర్శకుడు కాస్తంత టైమ్ ఎక్కువగా తీసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని చోట్ల కామెడీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ప్రధాన పాత్రధారుల్లో కొందరి నటన అర్టిఫీషియల్ గా అనిపిస్తుంది.
హరి, తేజస్విని...
క్రికెట్ టీం కెప్టెన్ గా హీరో, లవర్‌గా హరినాథ్ నటన బాగుంది. నిజమైన గల్లీ కుర్రాడిలా చక్కటి హావభావాలు కనబరిచాడు. హరి లవర్‌గా తేజస్విని సహజ నటనను కనబరించింది. ఆమె ఎక్స్‌ప్రెషన్స్, ఆకట్టుకున్నాయి. ప్రధాన పాత్రలో న టించిన నాగరాజు డైలాగ్స్ నవ్వులను పంచుతాయి. మిగిలిన వారందరూ కూడా ఆర్టిస్టుల్లా కాకుండా నిజంగానే గల్లీ కుర్రాళ్లలానే కనిపించారు. కమర్షియల్ ఫార్ములా సినిమాలకు భిన్నంగా దర్శకుడు సూరజ్ చేసిన ఓ వైవిధ్యమైన ప్రయత్నమిది. భాస్కర్ మ్యూజిక్ జహీర్ భాషా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బడ్జెట్‌కు తగ్గట్లుగా ఉన్నాయి.
కొత్తదనం కోరుకునే…
కొత్తదనాన్ని కోరుకునే ఆడియెన్స్‌ను గ్రౌండ్ కొంత వరకు మెప్పిస్తుంది.
రేటింగ్: 2.5/5