Graham Nation: 39 ఏళ్ల వయసులోనే కన్నుమూసిన సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్.. జిమ్ చేస్తూనే..-graham nation passes away 39 years old celebrity hair stylist died while at gym ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Graham Nation: 39 ఏళ్ల వయసులోనే కన్నుమూసిన సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్.. జిమ్ చేస్తూనే..

Graham Nation: 39 ఏళ్ల వయసులోనే కన్నుమూసిన సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్.. జిమ్ చేస్తూనే..

Hari Prasad S HT Telugu
Published Feb 19, 2025 10:44 PM IST

Graham Nation: సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ గా పేరుగాంచిన గ్రాహమ్ నేషన్ 39 ఏళ్ల వయసులోనే కన్నుమూశాడు. జిమ్ లో ఉన్నప్పుడే అతడు కుప్పకూలడం గమనార్హం.

 39 ఏళ్లకే కన్నుమూసిన సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్.. జిమ్ చేస్తూనే..
39 ఏళ్లకే కన్నుమూసిన సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్.. జిమ్ చేస్తూనే.. (@grahamnation/Instagram)

Graham Nation: హాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. 39 ఏళ్ల వయసులోనే గ్రాహమ్ నేషన్ అనే సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ కన్నుమూశాడు. వాలెంటైన్స్ డే నాడు జిమ్ లో కుప్పకూలిన అతడు.. ఆ తర్వాత కన్నుమూసినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. అతని అకాల మరణం హాలీవుడ్ ను షాక్ కు గురి చేసింది.

గ్రాహమ్ నేషన్ కన్నుమూత

కన్నుమూసిన ఆ హెయిర్ స్టైలిస్ట్ కు తల్లిదండ్రులు రోడ్నీ, డోనా, అతని ముగ్గురు తోబుట్టువులతో పాటు అతని భాగస్వామి టోన్యా, ఒక పసికందు కూడా ఉన్నారని అమెరికన్ సేలన్ తెలిపింది. బీటిల్ జుయిస్ నటి కేథరిన్ ఓ'హరా నటించిన తన మొదటి సూపర్ బౌల్ యాడ్ లో అతడు ఈ మధ్యే పనిచేశాడు. ఆ వెంటనే ఇలా కన్నుమూయడం మింగుడు పడటం లేదు.

గ్రాహమ్ నేషన్ క్లయింట్ జాబితాలో హాలీవుడ్ కు చెందిన డెమి మూర్, విక్టోరియా బెక్‌హామ్, జార్జ్ క్లూనీ వంటి ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. లూయిస్ విట్టన్, అమెరికన్ ఈగిల్, స్కిమ్స్ వంటి ప్రసిద్ధ బ్రాండ్ల ప్రమోషన్లలోనూ పనిచేశాడు. నేషన్ మరణవార్తపై హాలీవుడ్ సంతాపం తెలిపింది. నేషన్ కన్నుమూసినట్లు సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుపై పలువురు ప్రముఖులు స్పందించారు.

గ్రాహమ్ నేషన్ లాస్ ఏంజిల్స్ లోని బేటన్ రోగ్ లో జన్మించాడు. డెన్వర్ లో 25 ఏళ్ల వయసులో అవేదా ఇన్‌స్టిట్యూట్ లో చేరి 2011లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. డెన్వర్ లోనే హెయిర్ స్టైలిస్ట్, మోడల్, పలు బ్యాండ్లలో డ్రమ్మర్ గా పని చేశాడు. లాస్ ఏంజిల్స్ కు వెళ్లిన తర్వాత సెలబ్రిటీ స్టైలిస్ట్ కెన్ పాయెస్ కు అసిస్టెంట్ గా చేశాడు. తర్వాత సొంతంగా పని చేయడం మొదలు పెట్టాడు.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం