Gopichand Malineni Plans Thriller: బాలయ్యతో థ్రిల్లర్ చేయాల్సింది.. ఫ్యాక్షన్ తీసిన దర్శకుడు.. అసలేమైంది?
Gopichand Malineni Plans Thriller: నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే గోపీచంద్ మలినేని తొలుత బాలయ్యకు ఈ సినిమా కథకు బదులు ఓ థ్రిల్లర్ స్టోరీ చెప్పాడట.
Gopichand Malineni Plans Thriller: నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే బాలయ్య అభిమానులకు మాత్రం ఈ సినిమా ఆకట్టుకునేలా ఉండటంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం.. అన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ముఖ్యంగా గోపీచంద్ మలినేని గత చిత్రం క్రాక్‌తో పోలిస్తే ఈ సినిమా ఆకట్టుకోలేదనేది వాస్తవం. క్రాక్‌లో ఉండే మలుపులు, స్క్రీన్ ప్లే లాంటివి ఇందులో ఉండవు. తాజాగా వీరసింహారెడ్డి చిత్రం గురించి ఆసక్తికర విషయం బయటకొచ్చింది.
ట్రెండింగ్ వార్తలు
ఫిల్మ్ వర్గాల సమచారం ప్రకారం గోపీచంద్ మలినేని తొలుత బాలయ్యతో వీరసింహారెడ్డి కథతో వెళ్లలేదంట. ఆయనతో ఓ మంచి థ్రిల్లర్ సినిమా తీయాలనుకున్నాడట. 24 గంటల వ్యవధిలో జరిగే థ్రిల్లర్ కథాంశాన్ని గోపీచంద్ మలినేని బాలయ్యకు వివరించగా.. ఆయన మాత్రం మాస్ కథ కావాలని అడిగినట్లు తెలుస్తోంది. ఇందుకు గోపీచంద్ కూడా అంగీకరించి వీరసింహారెడ్డి కథతో వచ్చాడట. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేదు. చెన్నకేశవరెడ్డికి అటు ఇటుగా ఉన్న ఈ కథతో విమర్శకులను మెప్పించలేకపోయింది.
ఏదిఏమైనప్పటికీ బాలకృష్ణకు ముందు గోపీచంద్ మలినేని చెప్పిన కథ వీరసింహారెడ్డి కాదని మాత్రం తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ గోపీచంద్ మలినేని ఇప్పటికే తన తదుపరి చిత్రంపై ఫోకస్ పెట్టారు. బాలయ్యకు మొదట చెప్పిన థ్రిల్లర్ కథతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు.. అయితే ఈ సినిమాను ఓ యువ హీరోతో చేస్తాడని సమాచారం.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమాను నవీన్ యర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా చేసింది. తమన్ సంగీతాన్ని సమకూర్చారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి డైలాగ్స్ అందించగా.. నవీన్ నూలి ఎడిటర్‌గా పనిశారు. ఈ చిత్రానికి ఫైట్ మాస్టార్లుగా రామ్-లక్ష్మణ్ పనిచేశారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది.
సంబంధిత కథనం