Bheema OTT : పదేళ్లలో రెండు హిట్స్ - అయినా గోపీచంద్ క్రేజ్ తగ్గలేదు - షూటింగ్ కాకుండానే భీమా ఓటీటీ డీల్ క్లోజ్
Bheema OTT: షూటింగ్ పూర్తికాకుండానే గోపీచంద్ భీమా మూవీ ఓటీటీ శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. భీమా ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకున్నది.
Bheema OTT: 2014 నుంచి 2024 వరకు గత పదేళ్లలో గోపీచంద్ కెరీర్‌లో రెండే బ్లాక్‌బస్టర్స్ ఉన్నాయి. లౌక్యం, సీటీమార్ మినహా అతడు నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. జిల్ యావరేజ్‌గా నిలిచింది. అయినా అతడి అప్‌కమింగ్ మూవీ భీమా ఓటీటీ, శాటిలైట్ రైట్స్ షూటింగ్ పూర్తికాకుండానే అమ్ముడుపోయాయి.
భీమా ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకోగా...శాటిలైట్ హక్కులను స్టార్ మా దక్కించుకున్నది. ఓటీటీ, శాటిలైట్ హక్కులు కలిపి ఇరవై కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. గోపీచంద్ గత సినిమాలు చాలా వరకు డిజాస్టర్స్‌గా నిలిచినా ఓటీటీ, శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోవడం హాట్‌టాపిక్‌గా మారింది.
టాలీవుడ్ ఎంట్రీ...
భీమా సినిమాతో కన్నడ డైరెక్టర్ ఏ. హర్ష టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. కంప్లీట్‌గా నెగెటివ్ షేడ్స్‌తో గోపీచంద్ పాత్ర సాగుతుందని సమాచారం. గత సినిమాలకు పూర్తి భిన్నంగా పవర్‌ఫుల్‌గా ఉంటుందని అంటున్నారు. డివోషనల్ టచ్‌తో లార్జర్‌దెన్ లైఫ్ మూవీగా భీమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం.
ఇద్దరు హీరోయిన్లు...
జనవరి 5న భీమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఎద్దుపై కూర్చొని వైల్డ్ లుక్‌లో గోపీచంద్ కనిపించాడు. ఈ రాక్షసుల్ని వేటాడే బ్రహ్మరాక్షసుడు వచ్చాడ్రా అంటూ టీజర్‌లో వినిపించిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భీమా సినిమాలో గోపీచంద్‌కు జోడీగా ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రవి బస్రూర్ బీజీఎమ్ భీమా మూవీకి స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండబోతున్నట్లు మేకర్స్ చెబుతోన్నారు.
భీమా రిలీజ్ ఎప్పుడంటే?
భీమా మూవీ 2024 ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టీజర్ తో పాటు సినిమా రిలీజ్ డేట్‌ను ఇటీవలే అనౌన్స్ చేశారు. ఈ రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు లేదని సమాచారం. ప్రస్తుతం భీమా షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు తెలిసింది. జనవరి నెలాఖరులోగా పాటలతో పాటు టాకీపార్ట్ మొత్తం పూర్తికానున్నట్లు తెలిసింది.
శ్రీనువైట్లతో మూవీ...
గోపీచంద్ గత సినిమాలు పక్కా కమర్షియల్, రామబాణం భారీ అంచనాలతో రిలీజై డిజాస్టర్స్‌గా మిగిలాయి. భీమా సక్సెస్ గోపీచంద్ కెరీర్‌కు కీలకంగా మారింది. భీమా సినిమాకోసం గోపీంద్ తన రెమ్యునరేషన్‌ను తగ్గించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం భీమాతో పాటు శ్రీనువైట్ల దర్శకత్వంలో గోపీచంద్ ఓ సినిమా చేస్తున్నాడు. హై వోల్టెజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. 2024లో గోపీచంద్ హీరోగా నటించిన భీమాతో పాటు శ్రీనువైట్ల మూవీ కూడా రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.