కాంతార‌కు భిన్నంగా కొర‌గ‌జ్జ - క‌రావ‌ళి దేవ‌త క‌థతో పాన్ ఇండియ‌న్ మూవీ -తెలుగులో రిలీజ్‌-gopi sundar composing music for the pan indian movie koragajja mythological film will release multi languages ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  కాంతార‌కు భిన్నంగా కొర‌గ‌జ్జ - క‌రావ‌ళి దేవ‌త క‌థతో పాన్ ఇండియ‌న్ మూవీ -తెలుగులో రిలీజ్‌

కాంతార‌కు భిన్నంగా కొర‌గ‌జ్జ - క‌రావ‌ళి దేవ‌త క‌థతో పాన్ ఇండియ‌న్ మూవీ -తెలుగులో రిలీజ్‌

Nelki Naresh HT Telugu

కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌లోని తులునాడు ప్రాంతంలో ప్ర‌ధాన దేవ‌త‌గా పూజింప‌బ‌డే కొరగజ్జ క‌థ‌తో ఓ పాన్ ఇండియ‌న్ మూవీరాబోతుంది. కొర‌గ‌జ్జ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు సుధీర్ అత్తవర్ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాకు గీత‌గోవిందం ఫేమ్ గోపీసుంద‌ర్ మ్యూజిక్ అందిస్తోన్నాడు.

కొరగజ్జ మూవీ

కర్ణాటక, కేరళలోని కరావళి (తులునాడు)లో ప్ర‌ధాన దేవ‌త‌గా పూజింప‌బ‌డే కొరగజ్జ నేప‌థ్యంలో ఓ మూవీ రాబోతుంది. ఈ సినిమాకు సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుధీర్ అత్తవర్ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాకు గీత‌గోవిందం ఫేమ్ గోపీసుంద‌ర్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. కొర‌గ‌జ్జ పోస్ట‌ర్‌ను ఇటీవ‌ల మేక‌ర్స్ రిలీజ్ చేశారు. కొర‌గ‌జ్జ మూవీ మ్యూజిక్ డైరెక్టర్‌గా త‌న‌కు కొత్త ఎక్స్‌పీరియ‌న్స్‌ను పంచింద‌ని గోపీ సుంద‌ర్ పేర్కొన్నాడు. ఈ సినిమాలో మ్యూజిక్ ప‌రంగా స‌రికొత్త‌ ప్రయోగాల్ని చేశానని గోపీ సుంద‌ర్ తెలిపాడు.

మ్యూజిక్ కోసం రీసెర్స్‌..

కొర‌గ‌జ్జ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేయడానికి ఎంతో రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. సంగీతంలో కొత్త ప్రయోగాలు చేశా. గత చరిత్రను తెలుసుకోవాల్సి వచ్చింది. అందుకే మ్యూజిక్ అందించ‌డానికి కాస్త ఎక్కువ సమయం పట్టింది. నాటి ఆచారాలను, సంప్రదాయాల్ని అర్థం చేసుకున్న తర్వాతే ట్యూన్స్ వచ్చాయి. ‘కొరగజ్జ’ మూవీ కొత్త సంగీతాన్ని అన్వేషించడానికి, కొత్త శైలిని కనిపెట్టడానికి నాకు వీలు కల్పించింది. నా కెరీర్‌లో ఛాలెంజింగ్ మూవీ ఇది’ అని అన్నారు.

శ్రేయా ఘోష‌ల్‌...

కొర‌గ‌జ్జ మూవీలో మొత్తం ఆరు పాటలు ఉంటాయి, . ఈ పాటలకు డైరెక్ట‌ర్‌ సుధీర్ అత్తవర్ స్వయంగా సాహిత్యం అందించారు. ఈ పాట‌ల‌ను శ్రేయాఘోషల్, సునిధి చౌహాన్, శంకర్ మహదేవన్, జావేద్ అలీ, స్వరూప్ ఖాన్, అర్మాన్ మాలిక్ ఆల‌పించారు.

తులునాడు ప్రాంతంలో...

కర్ణాటక, కేరళలోని కరావళి (తులునాడు) ప్రాంతంలో, ముంబైలోని కొన్ని ప్రదేశాలలో పూజించబడే ప్రధాన దేవత కొరగజ్జ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. "కాంతారకుభిన్నంగా కొర‌గ‌జ్జ మూవీ ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు. వేల దేవతలకు నిలయమైన కర్ణాటక, కేరళ గొప్ప సాంస్కృతిక వారసత్వంలో ‘కాంతార’ ఒకరిని మాత్రమే చూపించింద‌ని పేర్కొన్నారు. కొర‌గ‌జ్జ ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త థియేట్రిక‌ల్ ఎక్స్‌పీరియ‌న్స్‌ను పంచుతుంద‌ని అన్నారు. ‘కాంతార’ తర్వాత పాన్ ఇండియ‌న్ లెవెల్ ఈ మూవీపై ఆస‌క్తి ఏర్ప‌డింద‌ని చెప్పారు.

క‌బీర్ బేడీ…

కొర‌గ‌జ్జ మూవీలో బాలీవుడ్ యాక్ట‌ర్ కబీర్ బేడితో పాటు కొరియోగ్రాఫర్లు సందీప్ సోపార్కర్, గణేష్ ఆచార్య, భవ్య, శ్రుతి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళం, మ‌ల‌యాళంతో పాటు హిందీ భాష‌లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం