Goodachari 2 Pre Vision: గూఢాచారి 2 ప్రీవిజన్ వచ్చేసింది.. శేష్ స్టైలిష్ లుక్
Goodachari 2 Pre Vision: గూఢాచారి 2 ప్రీవిజన్ రిలీజ్ చేశారు. ఇందులో అడివి శేష్ స్టైలిష్ లుక్‌లో అదరగొడుతున్నాడు. గతంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ గూఢాచారికి ఇది సీక్వెల్.
Goodachari 2 Pre Vision: టాలీవుడ్‌లో వరుస హిట్స్‌తో దూసుకెళ్తున్న హీరో అడివి శేష్. గతేడాది అతడు మేజర్, హిట్ 2 లాంటి హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడదే ఊపులో తన సూపర్ హిట్ మూవీ గూఢాచారికి సీక్వెల్‌తో వస్తున్నాడు. జీ2 (G2)గా పిలుస్తున్న గూఢాచారి 2 మూవీ షూటింగ్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
అయితే సోమవారం (జనవరి 9) ప్రీవిజన్ పేరుతో మేకర్స్ ఓ వీడియో రిలీజ్ చేశారు. దీనిని అడివి శేష్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. గూఢాచారి మూవీ ఇండియాకు పరిమితం కాగా.. ఈ జీ2 ఇంటర్నేషనల్ లెవల్‌కు వెళ్తోంది. ఈ సినిమాకు స్టోరీని శేష్ ఇవ్వడం విశేషం. ఈ లేటెస్ట్ వీడియోలో అతడు చాలా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు.
ఈ సినిమా కోసం శేష్ మేకోవర్ ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తోంది. 2023లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోందని మేకర్స్ ఈ వీడియో ద్వారా అనౌన్స్ చేశారు. అయితే కచ్చితంగా ఏ నెలలో ఈ షూటింగ్ ప్రారంభం కానున్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ముంబైలో జరిగిన ప్రెస్‌మీట్‌లో జీ2 ఫస్ట్‌లుక్ పోస్టర్‌తోపాటు ప్రీవిజన్ వీడియోను కూడా రిలీజ్ చేశారు.
గత నెలలోనే గూఢాచారికి సీక్వెల్ వస్తున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. వినయ్ కుమార్ సిరిగినీడి ఈ మూవీకి డైరెక్టర్. మేజర్ మూవీకి అతడు ఎడిటర్‌గా పని చేశాడు. కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, మేజర్‌లాంటి పాన్ ఇండియా మూవీస్‌ను నిర్మించిన నిర్మాతలు టీజీ విశ్వ, అభిషేక్ అగర్వాల్ ఈ జీ2 మూవీని నిర్మిస్తున్నారు. 2018లో వచ్చిన గూఢాచారి మూవీ స్పై డ్రామాగా ఆకట్టుకుంది. అందులో అడివి శేష్, శోభితా నటించారు.
ఫస్ట్ పార్ట్ ముగిసిన ఆల్ప్స్ పర్వతాల్లోనే ఈ సెకండ్ పార్ట్ ప్రారంభం కానుంది. ప్రీవిజన్ వీడియోచూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. అయితే సెకండ్ పార్ట్ చూడాలంటే ఫస్ట్ పార్ట్ చూడాల్సిన అవసరం లేదని గతంలో సీక్వెల్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా అడివి శేష్ చెప్పాడు.
సంబంధిత కథనం