ఓటీటీలోకి రీసెంట్ గా వచ్చిన తమిళ్ ఒరిజినల్ వెబ్ సిరీస్ అదరగొడుతోంది. ఒరిజినల్ లాంగ్వేజ్ తమిళం కంటే కూడా ఇతర డబ్బింగ్ భాషల్లో సత్తాచాటుతోంది. ఆ సిరీసే.. ‘గుడ్ వైఫ్’. కోర్టు డ్రామా థ్రిల్లర్ గా వచ్చిన ఈ సిరీస్ ను ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తోంది. ఓటీటీలో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
జియోహాట్‌స్టార్ ఒరిజినల్ వెబ్ సిరీస్ గా గుడ్ వైఫ్ రిలీజ్ అయింది. ఈ సిరీస్ జూలై 4న డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఒరిజినల్ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం, బెంగాలీ, మరాఠి భాషల్లోనూ ఈ సిరీస్ ఓటీటీలో అడుగుపెట్టింది. ఇతర భాషల్లోకి డబ్ అయింది.
గుడ్ వైఫ్ వెబ్ సిరీస్ తెలుగులో టాప్ నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. జియోహాట్‌స్టార్ ఓటీటీలో ఈ కోర్టు డ్రామా థ్రిల్లర్ సిరీస్ తెలుగులో టాప్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత కూకు విత్ జాతిరత్నాలు అనే కుకింగ్ కామెడీ షో ఉంది. అదే హిందీలో అయితే టాప్-5లో కొనసాగుతోంది గుడ్ వైఫ్ సిరీస్. మరో కోర్టు థ్రిల్లర్ క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 టాప్ లో ఉంది.
తమిళ్ ఒరిజినల్ వెబ్ సిరీస్ గా గుడ్ వైఫ్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. కానీ తమిళంలో మాత్రం సెకండ్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. కుకింగ్ షో టాప్ ప్లేస్ లో ఉంది. ఇక మలయాళంలో నాలుగో ప్లేస్ లో, బెంగాలీలో టాప్ ప్లేస్ లో, మరాఠీలో మూడో ప్లేస్ లో, కన్నడలో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది ఈ సిరీస్.
గుడ్ వైఫ్ వెబ్ సిరీస్ సీజన్ 1లో ఆరు ఎపిసోడ్ లు ఉన్నాయి. సెక్స్ టేప్ కుంభకోణంలో చిక్కుకున్న భర్త నిజంగానే తప్పు చేశాడా? అతణ్ని భార్య ఎలా కాపాడిందన్నదే కథ. భార్యభర్తలు, పిల్లలతో ఉన్న కుటుంబంలో ఓ వీడియో కలకలం రేపుతోంది. తన భర్త సెక్స్ వీడియోను ఆన్ లైన్ లో ఆ భార్య చూస్తుంది. ఫ్యామిలీ మొత్తం చూస్తారు. బయటి వ్యక్తులు కూడా చూస్తారు. దీంతో ఓ వైపు అవమానాలు.. అయినా భర్త కోసం, నిజం కోసం మళ్లీ నల్లకోటు వేసుకుని ఆ భార్య కోర్టులో అడుగుపెడుతుంది.
మరి భర్త నిజంగానే సెక్స్ టేప్ లో ఉన్నాడా? అసలేం జరిగింది? ఆ భార్య నిజాలను ఎలా బయటపెట్టిందన్నదే కథ. ఇందులో లాయర్ గా ప్రియమణి నటించింది.
సంబంధిత కథనం