ఓటీటీలోకి వ‌చ్చేసిన కోర్టు డ్రామా థ్రిల్ల‌ర్‌.. ఆన్‌లైన్‌లో సెక్స్ వీడియోలో హ‌స్బెండ్‌.. భ‌ర్త కోసం భార్య పోరాటం-good wife web series ott release date digital streaming on jiohotstar from today july 3 ott priyamani court thrillers ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి వ‌చ్చేసిన కోర్టు డ్రామా థ్రిల్ల‌ర్‌.. ఆన్‌లైన్‌లో సెక్స్ వీడియోలో హ‌స్బెండ్‌.. భ‌ర్త కోసం భార్య పోరాటం

ఓటీటీలోకి వ‌చ్చేసిన కోర్టు డ్రామా థ్రిల్ల‌ర్‌.. ఆన్‌లైన్‌లో సెక్స్ వీడియోలో హ‌స్బెండ్‌.. భ‌ర్త కోసం భార్య పోరాటం

కోర్టు డ్రామాతో పాటు థ్రిల్ ను పంచే వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీ స్పెషల్ గా రూపొందించిన ఈ సిరీస్ డైరెక్ట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. భర్త కోసం పోరాడే భార్యగా ప్రియమణి లీడ్ రోల్ ప్లే చేసింది. మరి ఆ వెబ్ సిరీస్ ఏది? ఏ ఓటీటీలో ఉందో ఇక్కడ చూసేయండి.

ఓటీటీలోకి కోర్టు డ్రామా థ్రిల్లర్ (x/JioHotstar Tamil)

కోర్టు డ్రామా థ్రిల్లర్లకు ఆడియన్స్ నుంచి ఎప్పుడూ మంచి రెస్పాన్సే దక్కుతుంది. రీసెంట్ గా కోర్ట్ మూవీ ఎంతటి సూపర్ హిట్ గా నిలిచిందో తెలిసిందే. అలాగే ఓటీటీలో క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 అదరగొడుతోంది. ఇప్పుడు అదే బాటలో ఓటీటీ ఆడియన్స్ కు థ్రిల్ పంచేేందుకు మరో కోర్టు డ్రామా డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు (జులై 4) నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న ఆ వెబ్ సిరీస్ ‘గుడ్ వైఫ్’.

ఏ ఓటీటీలో అంటే?

భర్తను కాపాడుకోవడం కోసం మళ్లీ నల్లకోటు వేసుకుని కోర్టులో వాదించే భార్య కథే ఈ ‘గుడ్ వైఫ్’ వెబ్ సిరీస్. మంచి డ్రామాతో పాటు థ్రిల్ ను పంచే ఈ సిరీస్ శుక్రవారం డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. జియోహాట్‌స్టార్‌ స్పెషల్ గా రూపొందిన ఈ సినిమా అదే ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఆరు ఎపిసోడ్లూ ఒకేసారి రిలీజ్ అయ్యాయి.

ఏడు భాషల్లో

ప్రధానంగా తమిళ్ కోర్టు డ్రామాగా తెరకెక్కించిన గుడ్ వైఫ్ వెబ్ సిరీస్ ను మొత్తం ఏడు భాషల్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాళి, మరాఠి భాషల్లో ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో అందుబాటులో ఉంది. గుడ్ వైఫ్ అనేది అదే పేరుతో హిట్ అయిన అమెరికన్ సిరీస్ అధికారిక తమిళ రీమేక్. కానీ ఇది కార్బన్ కాపీ కాదు. ఇక్కడి పరిస్థితులకు తగ్గట్లు కథ మార్చారు.

గుడ్ వైఫ్ గురించి

తన భర్త ఉన్న ఓ సెక్స్ టేప్ వీడియో ఆన్ లైన్ లో వైరల్ గా మారుతుంది. అతణ్ని అరెస్టు చేస్తారు. మరోవైపు పిల్లలు, సమాజం.. ఇలా ప్రతి చోట ఆ భార్యకు సమస్యలు ఎదురవుతాయి. ఈ పరిస్థితుల్లో తన భర్తను కాపాడుకోవడం కోసం ఆ భార్య కోర్టులో న్యాయవాదిగా పోరాడుతుంది. ఆ న్యాయవాదిగా ప్రియమణి నటించింది. భర్తగా సంపత్ రాజ్ యాక్ట్ చేశాడు. మరి కుట్రలను దాటి ఆమె తన భర్తను నిర్దోషిగా నిరూపించిందా అన్నదే కథ. ఈ సిరీస్ కు రేవతి డైెరెక్టర్. ఓ వైపు సినిమాలు, మరోవైపు ఓటీటీ స్పెషల్ ఫిల్మ్స్ చేస్తూ ప్రియమణి సాగిపోతోంది.

భామాకలాపం అనే స్ఫై థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో ప్రియమణి అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ వెబ్ సిరీస్ రెండు సీజన్లు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లోనూ ప్రియమణి మెరిసింది. మంచి థ్రిల్ కావాలనుకునే వాళ్లు, కోర్టు డ్రామాను ఇష్టపడేవాళ్లు ఈ గుడ్ వైఫ్ వెబ్ సిరీస్ పై ఓ సారి చూసేయొచ్చు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం