Good Bad Ugly teaser: అజిత్ ఫుల్ యాక్షన్ మోడ్ ఆన్.. గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్ రిలీజ్.. సమ్మర్‌లో వస్తున్న స్టార్-good bad ugly teaser released ajith kumar action mode on movie to release on 10th april ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Good Bad Ugly Teaser: అజిత్ ఫుల్ యాక్షన్ మోడ్ ఆన్.. గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్ రిలీజ్.. సమ్మర్‌లో వస్తున్న స్టార్

Good Bad Ugly teaser: అజిత్ ఫుల్ యాక్షన్ మోడ్ ఆన్.. గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్ రిలీజ్.. సమ్మర్‌లో వస్తున్న స్టార్

Hari Prasad S HT Telugu

Good Bad Ugly teaser: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్ శుక్రవారం (ఫిబ్రవరి 28) రిలీజైంది. అంతేకాదు ఈ మూవీ రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు.

అజిత్ ఫుల్ యాక్షన్ మోడ్ ఆన్.. గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్ రిలీజ్.. సమ్మర్‌లో వస్తున్న స్టార్

Good Bad Ugly teaser: అజిత్ ఈ మధ్యే పట్టుదల (విదాముయర్చి) అనే మూవీతో వచ్చి ఫ్లాప్ తో నిరాశపరిచిన విషయం తెలుసు కదా. ఇక ఇప్పుడతడు మరో ఫుల్ యాక్షన్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీతో రాబోతున్నాడు. తాజాగా శుక్రవారం (ఫిబ్రవరి 28) మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు.

గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్ రిలీజ్

అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. అజిత్, త్రిష నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేయగా.. సినిమా సమ్మర్ హాలిడేస్ ను టార్గెట్ చేస్తూ ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతోంది. ఈ మధ్యే పట్టుదల మూవీలో కనిపించిన జంటే ఇప్పుడీ సినిమాలోనూ నటిస్తుండటం విశేషం. ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్ ఫుల్ యాక్షన్ తో నిండిపోయింది.

టీజర్ మొదట్లోనే అజిత్ ను రెడ్ డ్రాగన్ గా పరిచయం చేస్తారు. ఒకవేళ అతడు వస్తే అక్కడున్నవాళ్లంతా చచ్చనట్లే అని ఓ రౌడీ మరొకడికి వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత అజిత్ ఎంట్రీ ఉంటుంది. టీజర్ లోనే డిఫరెంట్ గెటప్స్ తో అతడు అభిమానులను అలరించాడు. అతని లుక్ అదుర్స్ అనిపించేలా ఉంది. ముఖ్యంగా అతని యంగ్ వెర్షన్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

దూసుకెళ్తున్న టీజర్

గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా అతడు నటించిన విదాముయర్చి మూవీ ఫ్లాపయిన నేపథ్యంలో ఫ్యాన్స్ ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ యాక్షన్ మూవీ టీజర్ రిలీజ్ కాగానే యూట్యూబ్ లో దూసుకెళ్తోంది. తొలి గంటలోనే రెండు మిలియన్ల వ్యూస్ రావడం విశేషం.

ఈ టీజర్ రిలీజ్ చేస్తూ డైరెక్టర్ అధిక్ ఎమోషనల్ అవుతున్నట్లు చెప్పాడు. “చాలా ఎమోషనల్ గా ఫీలవుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్యూ సర్. ఇది మా సర్ కి, మా కింగ్ కి. హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్ చూడండి” అనే క్యాప్షన్ తో అతడు ఈ టీజర్ షేర్ చేశాడు.

విదాముయర్చి ఓటీటీ రిలీజ్ డేట్

మరోవైపు అజిత్, త్రిష జంటగా నటించిన విదాముయర్చి మూవీ మార్చి 3 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఈ మధ్యే తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఆ ఓటీటీ వెల్లడించింది. ఈ మూవీలో అజిత్ ఓ ఇంటెన్స్ లుక్ లో కనిపించే పోస్టర్ ను షేర్ చేస్తూ రిలీజ్ డేట్ తెలిపింది.

“బ్రేక్స్ లేవు. లిమిట్స్ లేవు. కేవలం విదాముయర్చి. ఈ విదాముయర్చి మూవీని నెట్‌ఫ్లిక్స్ లో మార్చి 3 నుంచి తమిళం, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలలో చూడండి” అనే క్యాప్షన్ తో ఈ విషయాన్ని చెప్పింది. తెలుగులో పట్టుదల పేరుతో ఈ సినిమా రిలీజైనా పెద్దగా రెస్పాన్స్ రాలేదు.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం