Good Bad Ugly Release Date: ప్రభాస్‌తో అజిత్ ఢీ.. ది రాజా సాబ్ రిలీజ్ రోజే వస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ-good bad ugly release date ajith movie to release on 10th april to fight with prabhas the raja saab ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Good Bad Ugly Release Date: ప్రభాస్‌తో అజిత్ ఢీ.. ది రాజా సాబ్ రిలీజ్ రోజే వస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ

Good Bad Ugly Release Date: ప్రభాస్‌తో అజిత్ ఢీ.. ది రాజా సాబ్ రిలీజ్ రోజే వస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ

Hari Prasad S HT Telugu
Jan 06, 2025 07:31 PM IST

Good Bad Ugly Release Date: ప్రభాస్ ది రాజా సాబ్ తో పోటీ పడబోతున్నాడు అజిత్. అతడు నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ డేట్ ను సోమవారం (జనవరి 6) మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రభాస్‌తో అజిత్ ఢీ.. ది రాజా సాబ్ రిలీజ్ రోజే వస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ
ప్రభాస్‌తో అజిత్ ఢీ.. ది రాజా సాబ్ రిలీజ్ రోజే వస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ

Good Bad Ugly Release Date: తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అదే రోజు ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మూవీ కూడా రిలీజ్ కానుండటంతో ఇద్దరు స్టార్ల మధ్య బాక్సాఫీస్ వార్ నడవనుంది. అజిత్ మూవీ రిలీజ్ తేదీని సోమవారం (జనవరి 6) తమ సోషల్ మీడియా ద్వారా మేకర్స్ అనౌన్సస్ చేశారు.

yearly horoscope entry point

గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ డేట్

గుడ్ బ్యాడ్ అగ్లీ అంటూ ఓ డిఫరెంట్ టైటిల్ తో అజిత్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మూవీ అధికారిక ఎక్స్ అకౌంట్ రిలీజ్ డేట్ ను తెలిపింది. "మామే.. వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్ కోసం డేట్ లాక్ అయింది. గుడ్ బ్యాడ్ అగ్లీ బిగ్ స్క్రీన్లలోకి ఏప్రిల్ 10, 2025న రాబోతోంది" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా అజిత్ సాల్ట్ పెప్పర్ లుక్ లో ఉన్న పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. చేతిలో గన్ పట్టుకొని సోఫాలో రాజసంగా కూర్చున్న అజిత్ ను ఇందులో చూడొచ్చు.

అయితే అదే రోజు పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మూవీ కూడా రిలీజ్ కానుంది. దీంతో ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ నడవనుంది.

విదాముయర్చి ఎప్పుడు?

అజిత్ నటిస్తున్న మరో మూవీ విదాముయర్చి. ఈ సినిమా నిజానికి సంక్రాంతికే రావాల్సి ఉంది. కానీ మేకర్స్ రిలీజ్ ను వాయిదా వేసుకున్నారు. మగిళ్ తిరుమణి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను అనివార్య పరిస్థితుల్లో వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. "అనివార్య పరిస్థితుల నేపథ్యంలో మా మూవీ విదాముయర్చి పొంగల్ నాడు రిలీజ్ కావడం లేదు. శ్రేయోభిలాషులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు" అని మేకర్స్ ట్వీట్ చేశారు. మూవీ రిలీజ్ వాయిదా పడటంతో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ డేట్ రావడంతో వాళ్లకు కాస్తయిన ఊరట లభించింది.

ప్రస్తుతం అజిత్ దుబాయ్ లో ఉన్నాడు. రేసింగ్ ఇష్టపడే అతడు.. అక్కడ అదే పనిలో ఉండటం విశేషం. ఈ మధ్యే భార్య షాలిని, పిల్లలతో కలిసి సింగపూర్ వెకేషన్ కు వెళ్లి వచ్చిన అతడు.. తర్వాత దుబాయ్ వెళ్తూ కనిపించాడు. ఈ రేసింగ్ లో ఓ టీమ్ ఓనర్ గా, డ్రైవర్ గానూ అతడు పార్టిసిపేట్ చేయనున్నాడు. అజిత్ చివరిసారి రెండేళ్ల కిందట వచ్చిన తునివు మూవీలో కనిపించాడు. అంతకుముందు ఏడాది వలీమై మూవీలోనూ నటించాడు. రెండేళ్లుగా ఎలాంటి మూవీ రాలేదు. అయితే ఈ ఏడాది రెండు సినిమాలు వస్తుండటంతో అజిత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీలో అజిత్ తోపాటు ప్రభు, ప్రసన్న, అర్జున్ దాస్, సునీల్, రాహుల్ దేవ్, యోగి బాబులాంటి వాళ్లు నటించారు. అటు విదాముయర్చి మూవీలో అజిత్ తోపాటు త్రిష కృష్ణన్, అర్జున్ సర్జా, రెజీనాలాంటి వాళ్లు నటించారు.

Whats_app_banner