ఓటీటీలో ఈ వారం చాలా వరకు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో నిన్న (మే 8) ఒక్కరోజే 9 వరకు మూవీస్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అయితే, వాటిలో రెండు సినిమాలు ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి. అయితే, అవి రెండు కూడా తెలుగు భాషలో స్ట్రీమింగ్ అవడం విశేషం.
ఇక వాటిలో ఒకటి బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా చేసింది. అలాగే, ప్రియా ప్రకాష్ వారియర్, అర్జున్ దాస్, షైన్ టామ్ చాకో వంటి పాపులర్ యాక్టర్స్ కీలక పాత్రలు పోషించారు.
గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను రూ. 270 నుంచి 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఎన్నో అంచనాలతో ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తమిళంలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అలాగే, తమిళంలో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా కూడా నిలిచింది. మొత్తంగా వరల్డ్ వైడ్‌గా రూ. 246 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ.
అలాంటి గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీలో దుమ్ములేపుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో మే 8న గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ వంటి ఐదు భాషల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ రిలీజ్ అయింది. ఓటీటీ రిలీజైన మరుసటి రోజు అంటే తెల్లారి నుంచే టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది ఈ సినిమా.
నెట్‌ఫ్లిక్స్ ఇండియా టాప్ 10 సినిమాల్లో మొదటి స్థానంలో ట్రెండింగ్ అవుతోంది గుడ్ బ్యాడ్ అగ్లీ. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ టాప్ 1లో నిలిచి ఈ మూవీ సత్తా చాటింది. ఇక నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో టాప్ 2 ప్లేసులో తెలుగు సినిమా దంచికొడుతోంది. ఆ మూవీనే జాక్. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన తెలుగు స్పై కామెడీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా జాక్.
చాలా కాలం తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించి జాక్ ఓటీటీలో టాప్ 2 స్థానంలో అలరిస్తోంది. ఈ సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్‌లో మే 8 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ వంటి ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇలా ఒకేరోజు ఓటీటీ రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు వరుసగా టాప్ 1, టాప్ 2 స్థానాల్లో నిలవడం విశేషం.
సంబంధిత కథనం