Pinaka Teaser: పుర్రెల సింహాసనపై గోల్డెన్ స్టార్.. మాంత్రికుడిగా హీరో.. విజువల్స్‌తో పినాక టీజర్ అదుర్స్-golden star ganesh pinaka teaser released gives stunning visual thrilling experience produced by people media factory ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pinaka Teaser: పుర్రెల సింహాసనపై గోల్డెన్ స్టార్.. మాంత్రికుడిగా హీరో.. విజువల్స్‌తో పినాక టీజర్ అదుర్స్

Pinaka Teaser: పుర్రెల సింహాసనపై గోల్డెన్ స్టార్.. మాంత్రికుడిగా హీరో.. విజువల్స్‌తో పినాక టీజర్ అదుర్స్

Sanjiv Kumar HT Telugu
Jan 02, 2025 04:50 PM IST

Golden Star Ganesh Pinaka Teaser Released: కన్నడ గోల్డెన్ స్టార్ గణేష్‌తో తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తున్న సినిమాకు పినాక అని టైటిల్ పెట్టారు. తాజాగా పినాక టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేశారు. స్టన్నింగ్ విజువల్స్‌తో, ఇంట్రెస్టింగ్ సీన్స్‌తో పినాక టీజర్ అదిరిపోయింది.

పుర్రెల సింహాసనపై గోల్డెన్ స్టార్.. మాంత్రికుడిగా హీరో.. విజువల్స్‌తో పినాక టీజర్ అదుర్స్
పుర్రెల సింహాసనపై గోల్డెన్ స్టార్.. మాంత్రికుడిగా హీరో.. విజువల్స్‌తో పినాక టీజర్ అదుర్స్

Golden Star Ganesh Pinaka Teaser Released: కన్నడ నాట గోల్డెన్ స్టార్‌గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు గణేష్‌. గోల్డెన్ స్టార్ గణేష్ అప్ కమింగ్ మూవీ 'పినాక' మోస్ట్ అవైటెడ్ టీజర్ రిలీజైయింది. టీజర్ అభిమానులను, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే విజువల్ ట్రీట్‌ను అందిస్తోంది.

yearly horoscope entry point

పినాక టైటిల్ టీజర్

తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పినాక సినిమాను నిర్మిస్తోంది. ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, ఆయన కుమార్తె కృతి ప్రసాద్‌ నిర్మాణంలో ఈ మూవీ తెరకెక్కనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మైల్ స్టోన్ 49వ ప్రాజెక్ట్‌గా (PMF49) కన్నడ సినిమాని రీడిఫైన్ చేయనుంది. ఈ సినిమాకు పినాక అని టైటిల్ పెడుతూ టీజర్ రిలీజ్ చేశారు.

పుర్రెల సంహాసనంపై

పినాక టీజర్‌లో గోల్డెన్ స్టార్ గణేష్ క్షుద్ర, రుద్రగా స్టన్నింగ్ న్యూ అవాతర్‌లో తన వెర్సటాలిటీ చూపించించారు. సినిమా ఆద్యంతం ఇలాగే కొనసాగుతుందని చెప్పకనే చెప్పారు. పుర్రెల సింహాసనంపై గోల్డెన్ స్టార్ కూర్చోవడం, మాంత్రికుడుగా, శివుడిగా గణేష్‌ను చూపించిన తీరు ఆకట్టుకుంది. మొదటి నుంచి వచ్చే విజువల్స్, శవాలు, పుర్రెల గుట్టతో స్టన్నింగ్‌గా సాగింది పినాక టీజర్.

బ్లాక్ మ్యాజిక్ ఎలిమెంట్స్

ప్రముఖ కొరియోగ్రాఫర్ బి. ధనంజయ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కన్నడ సినిమాలో మునుపెన్నడూ లేనివిధంగా గ్రిప్పింగ్ స్టోరీలైన్, విజువల్ స్పేక్లింగ్‌తో బ్లాక్ మ్యాజిక్ ఎలిమెంట్స్‌తో కూడిన గ్రాండ్ పీరియాడిక్ డ్రామాగా టీజర్ చెబుతోంది. బ్రీత్ టేకింగ్ వీఎఫ్ క్స్, అత్యాధునిక విజువల్స్‌తో పినాక ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసింది.

హై క్వాలిటీ స్టోరీ టెల్లింగ్

క్షుద్ర పూజలతో గణేష్ ఉన్న పోస్టర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. బ్లాక్‌బస్టర్‌లను అందించడంలో ప్రసిద్ధి చెందిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, హై క్యాలిటీ స్టొరీ టెల్లింగ్, అత్యాధునిక నిర్మాణం ద్వారా కన్నడ సినిమాను నెక్ట్స్ లెవల్‌కి చేర్చాలనే విజన్‌కి ఈ ప్రాజెక్ట్ నిదర్శనంగా ఉండనుందని తెలుస్తోంది. ఇక టీజర్ క్లైమాక్స్‌లో వచ్చే పాము మరింత హైలెట్ అయింది. అలాగే, గణేష్ మెడలో పాము చుట్టుకుని త్రిశూలానికి అగ్ని అందించే సీన్ ఉత్కంఠంగా ఉంది.

ఛాలెంజింగ్ రోల్స్

ఇక పినాక మూవీ గోల్డెన్ స్టార్ గణేష్ కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్‌గా నిలిచే అవకాశం ఉందని మేకర్స్ చెబుతున్నారు. ఛాలెంజింగ్ రోల్స్ చేయడంలో అతని వెర్సటాలిటీని ప్రజెంట్ చేస్తోంది. మరిచిపోలేని సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తూ టీజర్ గ్రేట్ ఎగ్జయిట్‌మెంట్‌ని క్రియేట్ చేసింది. ఇక ఈ ప్రాజెక్ట్‌కి సంబధించిన మరిన్ని అప్‌డేట్స్ మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

Whats_app_banner