Sankranthi Movies: సంక్రాంతి సినిమాల వార్ - ఆ విషయంలో గేమ్ ఛేంజర్‌ను బీట్ చేసిన వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం
Sankranthi Movies: ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌తో పాటు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం...బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలకు సంబంధించి ఇప్పటివరకు రిలీజ్ చేసిన పాటల్లో గోదారి గట్టు సాంగ్ హయ్యెస్ట్ వ్యూస్ దక్కించుకున్నది.
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సినిమాల పోటీ ఆసక్తికరంగా మారింది. ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌తో పాటు బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం...రెండు సినిమాలకు దిల్‌రాజు ప్రొడ్యూసర్ కావడం గమనార్హం. ఈ మూడు సినిమాల్లో సంక్రాంతి విన్నర్‌గా ఎవరు నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
గేమ్ ఛేంజర్ నాలుగు పాటలు...
ఇప్పటికే ఈ సంక్రాంతి సినిమాలకు సంబంధించి ఆయా మూవీ టీమ్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టాయి. గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటివరకు నాలుగు సింగిల్స్ రిలీజ్ కాగా...సంక్రాంతికి వస్తున్నాం...డాకు మహారాజ్ మూవీస్‌కు సంబంధించి రెండేసి సింగిల్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటలు మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోన్నాయి.
గోదారి గట్టు సాంగ్...
కాగా సంక్రాంతి సినిమాలకు సంబంధించి ఇప్పటివరకు రిలీజైన సింగిల్స్‌లో సంక్రాంతికి వస్తున్నాం మూవీలోని గోదారి గట్టు సాంగ్ హయ్యెస్ట్ వ్యూస్ దక్కించుకున్నది. రిలీజైన మూడు వారాల్లోనే యాభై మిలియన్ల వ్యూస్ దక్కించుకున్నది. సీనియర్ హీరోల్లో అత్యంత వేగంగా ఈ ఫీట్‌ను సాధించిన కథానాయకుడిగా వెంకటేష్ నిలిచాడు. గోదారి గట్టు పాటను రమణగోగులతో కలిసి మధుప్రియ ఆలపించింది. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించాడు. భాస్కరబట్ల సాహిత్యం సమకూర్చాడు.
జరగండి పాట...
గోదారి గట్టు తర్వాత రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌లోని జరగండి పాట 49 మిలియన్ల వ్యూస్‌తో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. జరగండి పాట రిలీజై మూడు నెలలు దాటిపోవడం గమనార్హం. ఆ తర్వాత ప్లేసుల్లో కూడా నానా హైరానా (45 మిలియిన్లు), రా రా మచ్చా (40 మిలియన్లు) వ్యూస్ దక్కించుకోవడం గమనార్హం. ధూప్ సాంగ్ 25 మిగిలిన్లతో కొనసాగుతోంది.
డాకు మహారాజ్...
డాకు మహారాజ్ పాటలు మాత్రం అంతగా మ్యూజిక్ లవర్స్‌ను మెప్పించలేకపోయాయి. ఈ సినిమాలోని రేజ్ ఆఫ్ డాకు (2.9 మిలియన్లు), చిన్ని పాట (2.3 మిలియన్ల) మోస్తారు వ్యూస్‌ను దక్కించుకున్నాయి.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు.
జనవరి 10న రిలీజ్
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీకి శంకర్ దర్శకత్వం వహిస్తోన్నాడు. దాదాపు 170 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ జనవరి 10న రిలీజ్ కాబోతోంది. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తోన్న డాకు మహారాజ్ మూవీ జనవరి 12న రిలీజ్ అవుతోంది. ఈ యాక్షన్ మూవీకి బాబీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోన్నాడు.