Godari Gattu Meeda Song Lyrics: గోదారి గట్టు మీద రామ సిలకవే సాంగ్ లిరిక్స్ ఇవే.. రొమాంటిక్ మూడ్‌లో ఉన్నప్పుడు పాడుకోండి
Godari Gattu Meeda Song Lyrics: సంక్రాంతికి వస్తున్నాం మూవీలోని గోదారి గట్టు మీద సాంగ్ తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. ఎక్కడ చూసినా ఈ పాటపై చేసిన రీల్సే కనిపిస్తున్నాయి. భార్యాభర్తలు మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నప్పుడు పాడుకునే పాట లిరిక్స్ ఇక్కడ చూడండి.
Godari Gattu Meeda Song Lyrics: గోదారి గట్టు మీద రామ సిలకవే పాట లిరిక్స్ కోసం చూస్తున్నారా? అయితే ఇక్కడ చూసేయండి. సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ తో అదే సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మూవీలోని ఈ పాట తెగ వైరల్ అవుతోంది. వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్ పై చిత్రీకరించిన ఈ పాటకు సంబంధించిన ఎన్నో రీల్స్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. జనవరి 14న రిలీజ్ కాబోతున్న సంక్రాంతికి వస్తున్నాం మూవీలోని ఈ సాంగ్ లిరిక్స్ చూస్తూ మీరూ పాడండి.
గోదారి గట్టు మీద సాంగ్.. ఇన్‌స్టాంట్ హిట్
సంక్రాంతికి వస్తున్నాం మూవీలోని గోదారి గట్టు మీద సాంగ్ యూట్యూబ్ లో ఓ సెన్సేషన్ గా మారింది. గత నెల రిలీజైన ఈ పాటకు ఇప్పటికే సుమారు 7 కోట్ల వరకూ వ్యూస్ రావడం విశేషం. రమణ గోగుల, మధుప్రియ పాడిన ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించాడు.
భాస్కరభట్ల రవి కుమార్ లిరిక్స్ అందించాడు. ఈ సాంగ్ ఇన్‌స్టాంట్ హిట్ లా నిలిచింది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకీ మామతోపాటు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఎంతో ఆసక్తి రేపుతోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సంక్రాంతి విజేతగా నిలుస్తుందన్న అంచనాలు ఉన్నాయి.
గోదారి గట్టు మీద సాంగ్ లిరిక్స్
గోదారి గట్టు మీద రామ సిలకవే
గోరింటా కెట్టుకున్న సంద మామవే
ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్దరపోయిందే
ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే
నాకంటూ ఉన్నా ఒకే ఒక్క ఆడ దిక్కువే
నీతోటీ కాకుండా నా బాధలు యెవరుకు చెప్పుకుంటానే
గోదారి గట్టు మీద రామ సిలకనే
గీ పెట్టి గింజుకున్నా నీకు దొరకనే
హే .. విస్తరి ముందేసి.. పస్తులు పెట్టావే
తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేసావే
ఛీ ఛీ ఛీ సిగ్గే లేని మొగుడు గారొండోయ్
గుయ్ గుయ్ గుయ్ గుయ్ మంటూ మీదికి రాకొండోయ్
ఒయ్ ఒయ్ గంపెడు పిల్లల్తో.. ఇంటిని నింపావే
సాప దిండు సంసారాన్ని మేడెక్కించావే
ఇరుగు పొరుగు ముందు సరసాలొద్దండోయ్
గురకెట్టి పొడుకోరే గూర్కాల్లాగా మీ వాళ్ళు
ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు
పెళ్ళైయి సాన్నాల్లే అయినా కానీ మాస్టారు
తగ్గేదే లేదంటూ నా కంగెనకే పడుతుంటారు
గోదారి గట్టు మీద రామ సిలకవే
గోరింటాకెట్టుకున్న సంద మామవే
కొత్త కోకేమో కన్నే కొట్టిందే
తెల్లారేలోగా తొందర పడమని చెవిలో చెప్పిందే
ఈ మాత్రం హింటే ఇస్తే సెంటే కొట్టేయనా
ఓ రెండు మూరల మల్లెలు చేతికి చుట్టేయినా
ఈ అల్లరి గాలేమో అల్లుకుపొమ్మందే
మాటల్తోటి కాలక్షేపం మానెయ్ మంటుందే
అబ్బా కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చెయ్నా
ఏవండోయ్ శ్రీవారు మళ్లీ ఎప్పుడో అవకాశం
ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం
ఓసోసి యిల్లాలా బాగుందే నీ సహకారం
ముద్దులతో చెరిపెద్దాం నీకు నాకు మధ్యన దూరం
గోదారి గట్టు మీద రామ సిలకనే
నీ జంట కట్టుకున్న సంద..మామనే