Chiranjeevi Speech at Godfather Success Meet: రిలీజ్‌కు ముందు రోజు భయంతో నిద్రపోలేదు: చిరంజీవి
Chiranjeevi Speech at Godfather Success Meet: గాడ్‌ఫాదర్ సినిమా రిలీజ్‌కు ముందురోజు భయంతో నిద్రపోలేదని అన్నాడు చిరంజీవి. ఇంద్ర, ఠాగూర్ తర్వాత ఆ స్థాయి విజయాన్ని మళ్లీ ఈసినిమాతో అందుకోవడం ఆనందంగా ఉందని సక్సెస్‌మీట్‌లో చిరంజీవి పేర్కొన్నాడు.
Chiranjeevi Speech at Godfather Success Meet:గాడ్‌ఫాదర్ రిజల్ట్ విషయంలో తనకంటే ఎక్కువగా తన భార్య సురేఖ టెన్షన్ పడిందని అన్నాడు. సురేఖ డల్‌గా ఉండటం చూసి తాను దిగాలు పడ్డానని పేర్కొన్నాడు. గత కొన్నేళ్లుగా బాగా ఉన్నాయనుకున్న సినిమాలు దెబ్బతిన్నా సందర్భాలు చాలా ఉన్నాయని చిరంజీవి తెలిపారు. అవన్నీ గుర్తు రావడంతో భయంతో రిలీజ్‌కు ముందు రోజు రాత్రి నిద్రపోలేదని చెప్పారు. చిరంజీవి హీరోగా నటించిన గాడ్‌ఫాదర్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. శనివారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు.
ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ ప్రతి సినిమాను ప్రాణం పెట్టి చేస్తాం. ఏ మాత్రం తేడా వచ్చినా అది ప్రాణసంకటంగా మారిపోతుంది. ఎన్ని డబ్బులు వచ్చాయనే కంటే ఎంత మంది బాగున్నారన్నది చాలా ముఖ్యం. నటుడిగా అలాంటి మాటలే మనల్ని ముందుకు నడిపిస్తాయి. ఇంద్ర ఠాగూర్ తర్వాత నా కెరీర్‌లో ఆ స్థాయి బ్లాక్‌బస్టర్ హిట్‌గా గాడ్‌ఫాదర్ నిలిచింది.
ఆడియెన్స్ గిఫ్ట్
గాడ్‌ఫాదర్ రూపంలో ఆడియెన్స్ మాకు బ్యూటీఫుల్ గిఫ్ట్ ఇచ్చారు.. థియేటర్స్‌కు ఆడియోన్స్ వచ్చే ప్రసక్తి లేదు, నెమ్మదిగా ఓటీటీలకు షిప్ట్ అవుతున్నారు, సినిమా చూసే విధానం మారిపోయిందని జరుగుతున్న ప్రచారానికి ఈ సినిమా మరోసారి పుల్‌స్టాప్ పెట్టింది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని నేను చెప్పిన మాటను నిజం చేసింది.
ప్రయోగం అని భయపడ్డా...
మలయాళ వెర్షన్‌లో సాంగ్స్ లేవు, హీరోయిన్ ఉండదు. అలాంటి క్యారెక్టర్‌లో నన్ను ప్రేక్షకులు చూస్తారో లేదో అనుకున్నా. ఇలాంటి ప్రయోగాన్ని ఏ ప్రొడ్యూసర్ చేస్తాడని అనుకుంటున్న సమయంలో చరణ్ తానే ఈ సినిమాను నిర్మిస్తానని ముందుకొచ్చాడు.
తొలుత ఈసినిమాకు ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లను అనుకున్నాం. కానీ కుదరలేదు. చివరకు మోహన్ రాజా పేరును చరణ్ సూచించాడు. ఈ సినిమాలో సత్యదేవ్‌ను పంచే క్లైమాక్స్ సీన్‌ను రిలీజ్‌కు ఇరవై రోజుల ముందు రీషూట్ చేశాం. తన ప్రతిసినిమాను సొంత బిడ్డలా కాకుండా క్రిటిక్‌లా చూస్తాను. నాకున్న అనుభవంతో ప్రతి పాయింట్‌ను దర్శకులతో పంచుకుంటాను.
సల్మాన్‌ఖాన్ డబ్బు వెనక్కి పంపించాడు.
ఈ సినిమాలో గెస్ట్ పాత్రలో నటించినందుకు సల్మాన్‌ఖాన్‌కు(Salman khan) పెద్ద ఎమౌంట్‌ను ప్రొడ్యూసర్స్ రెడీ చేశారు. చెక్‌పై సంతకం చేసి మేనేజర్‌కు ఇచ్చి పంపించాము. చిరు, చరణ్ ప్రేమను డబ్బుతో కొలుస్తావా అని మేనేజర్‌ను తిట్టి ఆ చెక్‌ను వెనక్కి పంపించాడు సల్మాన్‌ఖాన్. అతడి ప్రేమకు ఎప్పుడో ఒకసారి తప్పకుండా చరణ్ కృతజ్ఞత తీర్చుకుంటాడు, ప్రభుదేవా, పూరి జగన్నాథ్ ప్రతి ఒక్కరూ ప్రేమతో ఈసినిమా చేశారు. గాడ్‌ఫాదర్ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. నయనతార(Nayanthara), సత్యదేవ్ కీలక పాత్రలు పోషించారు. మూడు రోజుల్లోనే ఈసినిమా వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.