Ram Charan Doctorate: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం.. ఆ ఇద్దరి సరసన నిలవనున్న మెగా పవర్ స్టార్
Ram Charan Doctorate: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం దక్కనుంది. అతనికి ప్రతిష్టాత్మక వెల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందజేయాలని నిర్ణయించింది.
Ram Charan Doctorate: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇక డాక్టర్ రామ్ చరణ్ కానున్నాడు. అతనికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయాలని ప్రతిష్టాత్మక వెల్స్ యూనివర్సిటీ నిర్ణయించింది. ప్రతి ఏటా వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి గౌరవ డాక్టరేట్ ఇస్తున్న ఈ యూనివర్సిటీ.. ఈ ఏడాది ఆ గౌరవాన్ని మెగా పవర్ స్టార్ కు ఇవ్వనుంది.

ఆ ఇద్దరి తర్వాత రామ్ చరణే..
చెన్నైలోని వెల్స్ యూనివర్సిటీ గతంలో ఈ గౌరవ డాక్టరేట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రముఖ డైరెక్టర్ శంకర్ షణ్ముగంలాంటి వాళ్లకు కూడా అందించింది. ఇప్పుడు చరణ్ కూడా వాళ్ల సరసన నిలవనున్నాడు. ప్రస్తుతం అదే శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ మూవీలో చెర్రీ నటిస్తున్న విషయం తెలిసిందే.
ఎంటర్‌టైన్మెంట్ రంగంలో రామ్ చరణ్ అందించిన సేవలతోపాటు ఓ పారిశ్రామికవేత్తగా కూడా అతన్ని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాలని వెల్స్ యూనివర్సిటీ నిర్ణయించింది. సుమారు 17 ఏళ్లుగా అతడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. రెండేళ్ల కిందట వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీతో మెగా పవర్ స్టార్ కాస్తా గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయాడు. ఈ మూవీలో అతడు పోషించిన రామ్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ ప్రదానోత్సవం శనివారం (ఏప్రిల్ 13) జరగనుంది. ఈ ఏడాది చరణ్ తోపాటు ఇస్రోలో చంద్రయాన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గా ఉన్న డాక్టర్ పి.వీరముత్తువేల్, ట్రివిత్రో హెల్త్ కేర్ ఫౌండర్ జీఎస్కే వేలు, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్ లను కూడా గౌరవ డాక్టరేట్లతో వెల్స్ యూనివర్సిటీ సత్కరించనుంది.
చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్
రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత మరో పూర్తిస్థాయి సినిమాలో కనిపించలేదు. శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ కోసం చాలా రోజులుగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యే ఆ మూవీ నుంచి జరగండి పాట రిలీజైంది. సినిమా రిలీజ్ కు మరో నాలుగైదు నెలలు పట్టనుంది. అయితే ఈలోపే చరణ్ మరో రెండు ప్రాజెక్టులకు సిద్ధమయ్యాడు.
బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో ఆర్సీ16, సుకుమార్ డైరెక్షన్ లో ఆర్సీ17 మూవీస్ రాబోతున్నాయి. రంగస్థలంలాంటి హిట్ ఇచ్చిన సుకుమార్ తో చరణ్ మరో సినిమా అంటే ఫ్యాన్స్ లో ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. ఈ సినిమా చెర్రీ బర్త్ డే సందర్భంగా గత నెల్లోనే అనౌన్స్ చేశారు. రంగస్థలం మూవీ చరణ్ కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఆ సినిమాలో అతని నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇప్పుడు సుకుమార్ మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడన్న ఆశతో ఉన్నారు.
మరోవైపు ఉప్పెనతో నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో చేస్తున్న ఆర్సీ16పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.