Girls Will Be Girls Review: ఓటీటీ రివ్యూ.. శృంగార కోరికలతో రగిలిపోయే కూతురు కథ.. ఓటీటీ మలయాళ బోల్డ్ మూవీ ఎలా ఉందంటే?-girls will be girls review in telugu amazon prime ott release malayalam bold movie girls will be girls explained telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Girls Will Be Girls Review: ఓటీటీ రివ్యూ.. శృంగార కోరికలతో రగిలిపోయే కూతురు కథ.. ఓటీటీ మలయాళ బోల్డ్ మూవీ ఎలా ఉందంటే?

Girls Will Be Girls Review: ఓటీటీ రివ్యూ.. శృంగార కోరికలతో రగిలిపోయే కూతురు కథ.. ఓటీటీ మలయాళ బోల్డ్ మూవీ ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu
Jan 31, 2025 05:30 AM IST

OTT Bold Movie Girls Will Be Girls Review In Telugu: అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న న్యూ మలయాళ బోల్డ్ మూవీ గర్ల్స్ విల్ బీ గర్ల్స్. బాలీవుడ్ నటి రిచా చద్దా నిర్మించిన ఈ సినిమా నేరుగా ఓటీటీ రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో గర్ల్స్ విల్ బీ గర్ల్స్ రివ్యూలో తెలుసుకుందాం.

ఓటీటీ రివ్యూ.. శృంగార కోరికలతో రగిలిపోయే కూతురు కథ.. ఓటీటీ మలయాళ బోల్డ్ మూవీ ఎలా ఉందంటే?
ఓటీటీ రివ్యూ.. శృంగార కోరికలతో రగిలిపోయే కూతురు కథ.. ఓటీటీ మలయాళ బోల్డ్ మూవీ ఎలా ఉందంటే?

Malayalam OTT Bold Movie Girls Will Be Girls Review Telugu: ఓటీటీ రిలీజ్ అయ్యే మలయాళ సినిమాలకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. అలాంటిది గతేడాది డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయిన మలయాళ బోల్డ్ మూవీ గర్ల్స్ విల్ బీ గర్ల్స్. ఈ సినిమాకు బాలీవుడ్ నటి రిచా చద్దా నిర్మాతగా, ఆమె భర్త, మీర్జాపూర్ హీరో ఫహాద్ ఫాజిల్ ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.

yearly horoscope entry point

ప్రీతి పాణిగ్రాహి, కని కుశృతి, కేశవ్ బినోయ్ కిరణ్ ప్రధాన పాత్రల్లో కాజోల్ చుగ్, దేవికా షహాని, జితిన్ గులాటి ఇతర కీ రోల్స్ పోషించిన గర్ల్స్ విల్ బీ గర్ల్స్ సినిమాకు శుచి తలాటి దర్శకత్వం వహించారు. సుమారు 8 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించిన ఈ మూవీ ఐదారు అవార్డ్స్ గెలుచుకుంది. ఇలాంటి గర్ల్స్ విల్ బీ గర్ల్స్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి గర్ల్స్ విల్ బీ గర్ల్స్ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

హిమాలయన్ బోర్డర్ స్కూల్‌లో మీరా (ప్రీతి పాణిగ్రాహి) అనే 17 ఏళ్ల యువతి చదువుకుంటుంది. చాలా స్ట్రిక్ రూల్స్ పాటించే ఆ స్కూల్‌లో మీరా చాలా బ్రిలియంట్ స్టూడెంట్. తన తెలివితేటలతో మొదటి గర్ల్ హెడ్ ప్రిఫెక్ట్ (స్టూడెంట్స్ లీడర్) అవుతుంది. మీరాకు తల్లి అనిలా (కని కుశృతి), తండ్రి హరిష్ (జితిన్ గులాటి) ఉంటారు. అయితే, తండ్రి ఎక్కువ ఆఫీస్ వర్క్ పరంగా ఇంట్లో ఉండడు. ఎక్కువ సమయం తల్లితోనే ఉండాల్సి వస్తుంది.

కానీ, తల్లి అంటే మీరాకు కాస్తా ఇష్టముండదు. మరోవైపు మీరాకు సాధారణ అమ్మాయికి కౌమార దశలో వచ్చే సెక్సువల్ ఫీలింగ్స్ ఎక్కువగానే ఉంటాయి. ఇదే సమయంలో తన క్లాస్‌మేట్, ఎన్నారై స్టూడెంట్ శ్రీనివాస్ (కేశవ్ బినోయ్ కిరణ్)పై ఫీలింగ్స్ పెంచుకుంటుంది. మీరా అంటే శ్రీనివాస్ కూడా ఇష్టపడతాడు. ఓ రోజు అర్థరాత్రి శ్రీతో మీరా సీక్రెట్‌గా ఫోన్ మాట్లాడిన తల్లి అనిలా అతన్ని ఇంటికే రమ్మనమని చెబుతుంది.

ట్విస్టులు

తరచుగా శ్రీ ఒక ఫ్రెండ్‌లా మీరా ఇంటికి వస్తుంటాడు. ఆ తర్వాత అనిలా ఇంట్లో ఏం జరిగింది? శ్రీని ఇంటికే రమ్మని అనిలా ఎందుకు పిలిచింది? మీరా, శ్రీ మధ్య ఏం జరిగింది? మీరా తన శృంగార కోరికలు తీర్చుకుందా? కూతురు చదువు పాడవుకుండా తల్లి చూసుకోగలిగిందా? ఈ క్రమంలో మీరా టీచర్ బన్సాలి (దేవికా షహాని), ఇతర స్టూడెంట్స్ పాత్ర ఏంటీ? చివరికి క్లైమాక్స్ ఏంటీ? అనే విషయాలు తెలియాలంటే గర్ల్స్ విల్ బీ గర్ల్స్ చూడాల్సిందే.

విశ్లేషణ:

ఈ సినిమా 1990 కాలంలో జరుగుతుంటుంది. అప్పటి కాలానికి అనుగుణంగా పద్ధతులు, ఆచారాలు, రూల్స్, వాతావరంతో చక్కగా తెరకెక్కించారు. అలాగే, ఈ సినిమా ఒక తల్లీకూతుళ్ల కథ. సాధారణంగానే 16 నుంచి 20 ఏళ్ల మధ్య కౌమార దశలో ఉండే యువతియువకులకు శృంగారపరమైన కోరికలు రావడం సహజం. అపోజిట్ జెండర్స్‌పై ఆకర్షితులవుతుంటారు. ఈ క్రమంలో వారి చదువు, టాలెంట్‌ను నెగ్లెట్ చేసి జీవితాన్నే నాశనం చేసుకుంటారు.

ఈ విషయాన్నే కాస్తా నెమ్మదిగా, బోల్డ్‌గా, ఇంకా చెప్పాలంటే పచ్చిగా చూపించారు లేడి డైరెక్టర్ శుచి తలాటి. అలాగని అక్కర్లేనే సన్నివేశాలు పెట్టలేదు. కావాల్సిన సీన్స్‌తో అటు స్టూడెంట్స్, ఇటు పేరెంట్స్‌కు అర్థమయ్యే రీతిలో సినిమా సాగుతుంది. ఫ్రెండ్‌ అని చెప్పి బాయ్‌ఫ్రెండ్ వచ్చిన తర్వాత ఇంట్లో తల్లీకూతుళ్ల మధ్య జరిగే డ్రామా, అసూయ, ఫన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇదంతా మొదటి గంటపాటు బోర్ కొట్టకుండా నడుస్తుంది.

శృంగార సీన్స్- ఎమోషనల్ మూమెంట్స్

కానీ, ఆ తర్వాత అరగంట చాలా స్లోగా ఉంటుంది. ఇక చివరి అరగంట పరుగెడుతుంది. సినిమాలో లిప్ కిస్ మాత్రమే కాకుండా శృంగారపరమైన సీన్స్‌తోపాటు ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయి. కూతురు చదువు పాడవకుండా, అబ్బాయితో తప్పు చేయకుండా తల్లి చేసే ప్రయత్నం పైకి విచిత్రంగా, వింతగా కనిపించినా లోపల తెలియని డెప్త్ ఉంటుంది. ఉదాహరణకు కూతురు ఎక్కడ తప్పు చేస్తుందో అని ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను తన బెడ్‌పైనే పడుకోమని రూల్ పాస్ చేసేంత కఠినంగా, ప్రేమగా, బాధ్యతగా వ్యవహరించే తల్లిగా అనిలా పాత్రను మలిచారు.

ఇక బాయ్‌ఫ్రెండ్‌తో చనువుగా ఉంటుందని తల్లిపైనే ఈర్శ్యపడే యువతిగా మీరా, గర్ల్‌ఫ్రెండ్‌ను కలవడానికి ఆమె తల్లిని ఆంటీ నుంచి పేరు పెట్టి పిలిచేంత క్లోజ్ అయ్యే పాత్రగా శ్రీనివాస్‌ క్యారెక్టర్ ఆసక్తిగా ఉంటాయి. క్లైమాక్స్ ఓకే పర్వాలేదు. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో కూతురు తెలుసుకోవడంతో సింపుల్‌గా కథ సుఖాంతం అవుతుంది. అయితే, గంట తర్వాత చాలావరకు ఆడియెన్స్‌కు మూవీ బోర్ కొట్టే ఛాన్స్ ఉంది.

మంచి మెసేజ్ ఇచ్చే సినిమా

కని కుశ్రుతి, ప్రీతి పాణిగ్రాహి, కేశవ్ బినోయ్ కిరణ్ ఎవరికి వారు నటనతో చాలా బాగా ఆకట్టుకున్నారు. సినిమా ఎంగేజ్ చేయడానికి కారణం వాళ్ల నటనే. సినిమా బీజీఎమ్, సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు ఓటీటీ మూవీకి కావాల్సినంత మేర ఉన్నాయి. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన రిచా చద్దా తొలి సినిమాను మంచి మెసేజ్‌ ఇచ్చారు. దర్శకురాలు శుచి తలాటీ ఎలాంటి ఫెమినిజం చూపించకుండా సగటు యువతి, తల్లి పాత్రల తీరును బాగా చూపించారు.

చూడాలంటే ధైర్యం చేయాల్సిందే

ఇక ఫైనల్‌గా చెప్పాలంటే రెండు గంటల రన్ టైమ్ ఉన్న గర్ల్స్ విల్ బీ గర్ల్స్ తల్లీ కూతుళ్ల కథ అయినప్పటికీ ఫ్యామిలీతో చూడలేం. చాలా వరకు బోల్డ్ సీన్స్ ఉన్నాయి. కానీ, తల్లీ కూతుళ్లు ధైర్యం చేసి చూసి అర్థం చేసుకుంటే సెక్సువల్ ఫీలింగ్స్, బాయ్‌ఫ్రెండ్స్, తల్లి ప్రేమ, కఠినత్వం విలువ తెలుస్తుంది. అయితే, అమెజాన్ ప్రైమ్‌లో గర్ల్స్ విల్ బీ గర్ల్స్ ఇంగ్లీష్, మలయాళం, హిందీ భాషల్లో ఆంగ్ల సబ్ టైటిల్స్‌తో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

Whats_app_banner

సంబంధిత కథనం