ఓటీటీలో ఎన్నో రకాల కాన్సెప్ట్‌లతో కుప్పలుతెప్పలుగా సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఎక్కువగా హారర్ జోనర్ సినిమాలపై ఓటీటీ ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే, హారర్ జోనర్‌కు క్రైమ్, ఫాంటసీ, అడ్వెంచర్, యాక్షన్ వంటి పలు ఎలిమెంట్స్ యాడ్ చేసి తెరకెక్కించిన సినిమాలు ఎన్నో వచ్చాయి.
కానీ, ఈ హారర్ థ్రిల్లర్ మూవీ కాన్సెప్టే డిఫరెంట్. ఏకంగా దెయ్యంతోనే ఎఫైర్ పెట్టుకుని రోజు శృంగారంలో మునిగితేలుతుంటుంది ఓ 30 ఏళ్ల మహిళ. ఇలాంటి వెరైటీ కాన్సెప్ట్ ఉన్న హారర్ ఫాంటసీ థ్రిల్లర్ సినిమానే ఘోస్టింగ్ గ్లోరియా. 2021లో స్పానిష్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు మౌరో సర్సర్, మార్సెల మట్టా దర్శకత్వం వహించారు.
ఘోస్టింగ్ గ్లోరియా సినిమాలో గ్లోరియా పాత్రలో స్టెఫానియా టోర్టోరెల్లా కీ రోల్ చేసింది. ఘోస్టింగ్ గ్లోరియా సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి 5.5 రేటింగ్ వచ్చినప్పటికీ కంటెంట్ ఎంత ఫ్రెష్‌దో చెప్పే రొట్టెన్ టొమాటోస్ సంస్థ ఈ మూవీకి 71 శాతం పర్సంటేజ్ ఇచ్చింది. అంటే, ఘోస్టింగ్ గ్లోరియా కంటెంట్ 71 శాతం ఫ్రెష్‌నెస్‌తో ఉంటుందని తెలుస్తోంది.
మరి ఈ ఘోస్టింగ్ గ్లోరియా ఓటీటీ సజెషన్ మూవీ కింద చూసేయొచ్చు. జీ5లో ఘోస్టింగ్ గ్లోరియా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, జీ5లో సబ్‌స్క్రిప్షన్ లేని వాళ్లు కూడా ఘోస్ట్ గ్లోరియా సినిమాను ఫ్రీగా చూసేయొచ్చు. అయితే, ఈ సినిమా హిందీ భాషలో ఎలాంటి సబ్ టైటిల్స్ లేకుండా డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.
యూట్యూబ్‌లో మాత్రం ఇంగ్లీష్ భాషలో ఘోస్టింగ్ గ్లోరియా అందుబాటులో ఉంది. హిందీ పర్వాలేదనుకునే వారు జీ5 ఓటీటీలో, ఇంగ్లీష్‌లోనే చూడాలనుకునే వారు యూట్యూబ్‌లో ఘోస్టింగ్ గ్లోరియాపై లుక్కేయొచ్చు.
ఇక ఘోస్టింగ్ గ్లోరియా సినిమా కథలోకి వెళ్తే.. ఓ బుక్ స్టోర్‌లో 30 ఏళ్ల గ్లోరియా సాధారణ జీవితాన్ని గడుపుతుంటుంది. తన సహోద్యోగి మాత్రం శృంగార జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. 30 ఏళ్లు వచ్చిన అలాంటి ముద్దు ముచ్చట లేదని గ్లోరియా తెగ బాధపడిపోతుంటుంది.
ఈ క్రమంలోనే కొత్తగా ఓ అపార్ట్‌మెంట్‌లోకి షిఫ్ట్ అయిన గ్లోరియాకు వింత సంఘటన ఎదురవుతుంది. అదే అపార్ట్‌మెంట్‌లో ఇదివరకు చనిపోయి డాంటే అనే వ్యక్తి దెయ్యంలా మారుతాడు. ఓ రాత్రి పడుకున్న గ్లోరియాతో సెక్స్ చేస్తుంది డాంటే దెయ్యం. ముందు భయపడిన గ్లోరియా ఆ శృంగార అనుభవం నచ్చి అలాగే దెయ్యంతో ఎఫైర్ పెట్టుకుంటుంది.
ఇక రోజు దెయ్యంతో శృంగారంలో మునిగిపోతుంటుంది. ఎంతలా అంటే ఆమె అరుపులు పక్కింటి వాళ్లు విని అనుమానపడేలా ఉంటాయి. దెయ్యంతో శృంగార అనుభవంతో తన జీవితంలోకి సుఖ సంతోషం వచ్చిందనుకున్న గ్లోరియా లైఫ్‌లోకి ఓ బాయ్‌ఫ్రెండ్ ఎంట్రీ ఇస్తాడు. అది తెలిసి డాంటే ఆత్మ ఇంట్లోంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే జీ5 ఓటీటీ లేదా యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఘోస్టింగ్ గ్లోరియా సినిమాను చూడాల్సిందే.
సంబంధిత కథనం