Raju Yadav OTT Release Date: ఓటీటీలోకి గెటప్ శ్రీను సినిమా.. రిలీజ్ డేట్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్ చూడొచ్చంటే..
Raju Yadav OTT Release Date: రాజుయాదవ్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. సుమారు రెండు నెలల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి వస్తోంది.

ఫేమస్ కమెడియన్ గెటప్ శ్రీను హీరోగా ‘రాజుయాదవ్’ చిత్రం వచ్చింది. ఎప్పుడూ నవ్వు ముఖంతోనే ఉండే డిజార్డర్ అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది. దీంతో ఈ చిత్రంపై మంచి బజ్ ఏర్పడింది. ఈ సినిమా మే 24వ తేదీన థియేటర్లలో రిలీజైంది. అయితే మిక్స్డ్ టాక్ రావడంతో ఆశించిన మేర కలెక్షన్లను దక్కించుకోలేకపోయింది. రాజుయాదవ్ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. స్ట్రీమింగ్ డేట్ కన్ఫార్మ్ అయింది.
ఓటీటీలోకి ఎప్పుడు?
రాజుయాదవ్ సినిమా జూలై 24వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. కొంతకాలం క్రితమే త్వరలో అంటూ ఆ ప్లాట్‍ఫామ్ అప్‍డేట్ ఇచ్చింది. అయితే, ఇప్పుడు డేట్ వెల్లడైంది. జూలై 24వ తేదీన ఆహాలో రాజుయాదవ్ స్ట్రీమింగ్‍కు రానుంది.
రాజుయాదవ్ చిత్రానికి కష్ణమాచారి కే దర్శకత్వం వహించారు. కామెడీతో పాటు ఎమోషనల్ లవ్ స్టోరీతో ఈ మూవీని తెరకెక్కించారు.ఈ చిత్రంలో గెటప్ శ్రీనుకు జోడీగా అంకిత ఖారత్ హీరోయిన్‍గా చేశారు. ఆనంద చక్రవాణి, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ, రాకెట్ రాఘవ, సంతోష్ కల్వచర్ల కీరోల్స్ చేశారు.
రాజు యాదవ్ మూవీని రాజేశ్ కళ్లేపల్లి, ప్రశాంత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందించగా.. సాయిరామ్ ఉదయ్ సినిమాటోగ్రఫీ చేశారు. ఈ చిత్రం కోసం మూవీ టీమ్ ప్రమోషన్లను బాగానే చేసింది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ చిత్రానికి సపోర్ట్ చేశారు. ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు.
రాజుయాదవ్ స్టోరీలైన్
మహబూబ్ నగర్‌లో డిగ్రీ చేసి ఖాళీగా ఉంటుంటాడు రాజు యాదవ్ (గెటప్ శ్రీను). ఓ రోజు స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా అతడికి ముఖానికి బంతి బలంగా తాకుతుంది. దీంతో అతడి ముఖంలో మార్పులు వస్తాయి. ఎప్పుడు నవ్వుతూనే ఉండే డిజార్డర్ అతడికి వస్తుంది. దీంతో ఎప్పుడు నవ్వుతున్నట్టే కనిపిస్తాడు. ఇది తగ్గేందుకు సర్జరీ అవసరమని వైద్యులు చెబుతారు. అందుకు డబ్బు లేక అతడు ఆగిపోతాడు. స్వీటి (అంకిత ఖారత్)తో రాజ్ యాదవ్‍కు ప్రేమలో పడతాడు. అయితే, ఏ పరిస్థితుల్లో అయినా నవ్వుతూ ఉండటంతో రాజుయాదవ్ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో అతడి జీవితం ఎలా మారింది.. సమస్యకు పరిష్కారం దొరికిందా.. లవ్ స్టోరీ సక్సెస్ అయిందా అనేది రాజుయాదవ్ మూవీలో ఉంటుంది.
ఆహాలో లేటెస్ట్‌గా..
ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో హరోం హర సినిమా ఈ వారం జూలై 15వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. నవ దళపతి సుధీర్ బాబు ఈ చిత్రం హీరోగా నటించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. జూలై 11వ తేదీన ఆహాలోకి రావాల్సిన ఈ మూవీ.. ఆలస్యంగా జూలై 15న స్ట్రీమింగ్‍కు వచ్చింది. హరోం హర సినిమా జూన్ 14న థియేటర్లలో రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం ఈటీవీ విన్ ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది. ఆహాలో జూలై 11న ‘ప్లాట్’ అనే తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ మూవీలో వికాస్ ముప్పాల హీరోగా నటించారు.