Comedy Thriller OTT: మార్కో ఫేమ్ ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన గెట్ సెట్ బేబీ ఓటీటీలోకి రాబోతోంది. ఈ కామెడీ థ్రిల్లర్ మూవీ మనోరమా మ్యాక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెలాఖరు నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.
గెట్ సెట్ బేబీ మూవీలో నిఖిలా విమల్ హీరోయిన్‌గా నటించింది. చెంబన్ వినోద్ జోస్, శ్యామ్ మోహన్, సురభి లక్ష్మి కీలక పాత్రలు పోషించారు. మార్కో బ్లాక్‌బస్టర్ తర్వాత ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన ఈ మూవీపై మలయాళంలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ కమర్షియల్‌గా మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ హిట్‌గా నిలిచింది.
గెట్ సెట్ బేబీ మూవీకి వినయ్ గోవింద్ దర్శకత్వం వహించాడు. లిమిటెడ్ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఐదు కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. సామ్ సీఏస్ మ్యూజిక్ అందించాడు.
అర్జున్ బాలకృష్ణ (ఉన్ని ముకుందన్) ఓ గైనకాలజిస్ట్ డాక్టర్. ఐవీఎఫ్ స్పెషలిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకుంటాడు. ఈగో ఎక్కువ. స్వాతిని (నిఖిలా విమల్) ఇష్టపడి పెళ్లిచేసుకుంటాడు. పెళ్లై చాలా ఏళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో ఐవీఎఫ్ ద్వారా భార్యను గర్భం దాల్చడానికి ఒప్పించాలని చూస్తాడు అర్జున్.
కానీ స్వాతి అందుకు ఒప్పుకోదు. దాంతో అర్జున్ ఈగో దెబ్బ తింటుంది. ఈ విషయం బయటపడితే తన కెరీర్‌కే ప్రమాదమని అర్జున్ భయపడతాడు. ఆ తర్వాతే ఏమైంది. స్వాతిని ఐవీఎఫ్ కోసం అర్జున్ ఎలా ఒప్పించాడు? స్వాతి, అర్జున్ మధ్య అపోహలకు కారణం ఏమిటి అన్నదే ఈ మూవీ కథ.
ఇన్నోవేటివ్ ఐడియాతో కథను రాసుకున్నాడు దర్శకుడు. కానీ ఆ పాయింట్‌నుతెరపై ఆవిష్కరించడంలో తడబడటంతో సినిమా మోస్తారు వసూళ్లను రాబట్టింది.
ఉన్నిముకుందన్ హీరోగా నటించిన గత మూవీ మార్కో ఏకంగా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకున్నది. ఉన్ని ముకుందన్ కెరీర్‌లోనే కాకుండా గత ఏడాది మలయాళంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ నిర్మాతలకు మూడింతల లాభాలను తెచ్చిపెట్టింది. ఉన్ని ముకుందన్ తెలుగులో భాగమతి, యశోద, జనతా గ్యారేజ్‌తో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు.
సంబంధిత కథనం