Bigg Boss 6 Telugu: లొల్లి మొదలైంది.. ఈ ‘బొచ్చు' గొడవ ఏంట్రా బాబు.. ఎక్కువ చేసిన గీతూ..!-geetu royal fight with inaya sultana in bigg boss season 6 day 1 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Geetu Royal Fight With Inaya Sultana In Bigg Boss Season 6 Day 1

Bigg Boss 6 Telugu: లొల్లి మొదలైంది.. ఈ ‘బొచ్చు' గొడవ ఏంట్రా బాబు.. ఎక్కువ చేసిన గీతూ..!

Maragani Govardhan HT Telugu
Sep 06, 2022 11:05 AM IST

Geetu Royal fight with Inaya Sultana: బిగ్‌బాస్ సీజన్ 6 తొలి రోజే ఇద్దరి కంటెస్టెంట్ల మధ్య గొడవ ప్రారంభమైంది. గీతూ రాయల్, ఇనాయా సుల్తాన మద్య హెయిర్ వార్ జరిగింది. బాత్రూంలో జుట్టును తీసేయాలనే అంశంపై వీరి మధ్య లొల్లి ప్రారంభమైంది.

గీతూ-ఇనాయా సుల్తానా మధ్య గొడవ
గీతూ-ఇనాయా సుల్తానా మధ్య గొడవ

Geetu Royal fight with Inaya Sultana: బుల్లితెర పాపులర్ షో బిగ్‌బాస్‌ ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆదివారం నాడు ఘనంగా ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ల మధ్య అప్పుడే గొడవలు మొదలయ్యాయి. ఎప్పుడూ రెండో వారమో లేదా మూడో వారంలోనో జరిగేవి. కానీ ఈ సారి మాత్రం ఫస్ట్ వీక్ తొలి రోజే గొడవ స్టార్టయింది. గీతూ రాయల్, ఇనాయా సుల్తానా మధ్య హెయిర్స్ వార్ జరిగింది. ఇద్దరూ నీకు తిక్క అంటే నీకు తిక్క అని తిట్టుకున్నారు.

ఉదయాన్నే బిగ్‌బాస్ పక్కా లోకల్ పాటతో నిద్ర లేపారు. ఈ పాటకు అందరూ తమదైన శైలిలో స్టెప్పులేశారు. ఇంతలా గలాట గీతూ గలాట మొదలు పెట్టేసింది. బాత్రూంలో ఎవరివో హెయిర్స్ ఉన్నాయని, తలస్నానం చేసేటప్పుడు ఎవరి జుట్టు వారు తీసి పడేయాలని స్పష్టం చేసింది. నిన్న స్నానం మొదట స్నానం చేసింది ఇనాయా అని చెప్పేసరికి.. గీతూ ఆమె వద్దకు వెళ్లి ఈ విషయం గురించి చెప్పింది. అయితే ఇనాయా మాత్రం నా తర్వాత ఇంకొంతమంది చేశారని, కానీ నువ్వు నా వద్దకు మాత్రమే వచ్చి ఎందుకు చెబుతున్నావంటూ గీతూపై మండిపడింది. గీతూ హెయిర్స్ విషయాన్ని అందరికీ చెబుతున్నానని, నువ్వు ముందు స్నానం చేశావు కాబట్టి నిన్ను అడిగానని కొంచెం హార్ష్‌గా మాట్లాడింది.

తను మాత్రం ఎవరి హెయిర్స్ తీయనని, ఒకవేళ బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చినా తను మాత్రం చేయనని చెప్పుకొచ్చింది గీతూ. బాత్రూ డ్యూటీ ఇచ్చినప్పుడు ఇలాంటివి తప్పదని ఇనాయా వాదించింది. ఇంత మంది ఉన్నప్పుడు బాత్రూంలో ఎవరి జట్టు పడిందో ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది? అయితే ఈ ప్రశ్నకు గీతూ అందుకే ఎవరిది వాళ్లు తీయాలని పదే పదే చెప్పింది. ఇనాయా మాత్రం స్నానం చేసినవాళ్లు ఎవరైనా తీయకపోతే ఇతరులకు అది వారి జుట్టే అని ఎలా తెలుస్తుంది? అంటూ ప్రశ్నించింది. ఈ విషయంలో ఇద్దరికి వాదనలు జరిగాయి. గీతూ ఇనాయాను నీకు తిక్క, తిక్కదానివి నువ్వు అంటూ ఆరోపించింది. అందుకు ఇనాయా కూడా నీకే తిక్క అంటూ గట్టిగా ప్రతిస్పందించింది.

ఈ గొడవపై గీతూకు బాలాదిత్య ఓ సలహా ఇచ్చాడు. నువ్వు చెప్పిన విషయం కరెక్టే అయినా.. విధానం సరిగ్గా లేదని గీతూతో అన్నాడు. అయితే ఈ సలహాలను గీతూ పెద్దగా పట్టించుకున్నట్లు అనిపించలేదు. మరోపక్క ఇదే అదనుగా ఆర్జే సూర్య.. కీర్తి భట్‌తో పులిహోర స్టార్ట్ చేశాడు. నువ్వేసుకున్న టీ షర్ట్ బాగుందని, అలాంటిదే తన వద్ద కూడా ఉందని చెప్పగా.. అవునా మరి వేసుకోవాల్సిందని కౌంటర్ ఇచ్చింది. రేపు వేసుకుంటాలే అని సూర్య బదులిచ్చాడు. అంతటితో ఆగకుండా ఇంకేంటి పిచ్చి అని పిలిచాడు.. ఏమన్నావ్ అంటూ సూర్యను ప్రశ్నించింది. పిచ్చి అని నేను పిలుస్తుంటాను..అలా అనడం నాకు ఇష్టం అనగా.. పిచ్చి అనేది ఫేవరెట్ వర్డ్ అంటూ కీర్తి సిగ్గు పడింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం