Gautham Karthik Manjima Mohan Marriage: పెళ్లిపీట‌లెక్కిన కోలీవుడ్ యువ‌ జంట - వెడ్డింగ్ ఫొటోస్ వైర‌ల్‌-gautham karthik manjima mohan tie the knot in chennai wedding photos viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Gautham Karthik Manjima Mohan Tie The Knot In Chennai Wedding Photos Viral

Gautham Karthik Manjima Mohan Marriage: పెళ్లిపీట‌లెక్కిన కోలీవుడ్ యువ‌ జంట - వెడ్డింగ్ ఫొటోస్ వైర‌ల్‌

Nelki Naresh Kumar HT Telugu
Nov 28, 2022 12:46 PM IST

Gautham Karthik Manjima Mohan Marriage: కోలీవుడ్ ల‌వ్ బ‌ర్డ్స్ గౌత‌మ్ కార్తిక్‌, మంజిమా మోహ‌న్ పెళ్లి చేసుకున్నారు. సోమ‌వారం చెన్నైలో వీరి వివాహం జ‌రిగింది. గౌత‌మ్‌, మంజిమా పెళ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

గౌత‌మ్ కార్తిక్‌, మంజిమా మోహ‌న్
గౌత‌మ్ కార్తిక్‌, మంజిమా మోహ‌న్

Gautham Karthik Manjima Mohan Marriage: కోలీవుడ్ యువ జంట గౌత‌మ్ కార్తిక్‌, మంజిమా మోహ‌న్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సోమ‌వారం చెన్నైలోని ఓ హోట‌ల్‌లో గౌత‌మ్‌, మంజిమా పెళ్లి జ‌రిగింది. వీరి పెళ్లికి కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితుల‌తో పాటు ప‌లువురు కోలీవుడ్ సినీ ప్ర‌ముఖులు హ‌జ‌ర‌య్యారు. గౌత‌మ్ కార్తిక్‌, మంజిమా మోహ‌న్ పెళ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి..

పెళ్లిలో వైట్ ప‌ట్టు పంచె, ష‌ర్ట్‌లో గౌత‌మ్‌, వైట్ సారీలో మంజిమా మోహ‌న్ మెరిశారు.2019లో వీరిద్ద‌రు క‌లిసి దేవ‌ర‌ట్టం అనే సినిమా చేశారు. ఆ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో గౌత‌మ్‌, మంజిమా ప్రేమ‌లో ప‌డ్డారు. క‌మ‌ర్షియ‌ల్‌గా దేవ‌ర‌ట్టం ఫెయిల్యూర్‌గా నిలిచినా వీరిద్ద‌రికి వ్య‌క్తిగ‌తంగా మాత్రం మ‌ర‌చిపోలేని సినిమాగా నిలిచింది.

నాగ‌చైత‌న్య హీరోగా గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ సాహ‌సం శ్వాస‌గా సాగిపో సినిమాలో మంజిమా మోహ‌న్ క‌థానాయిక‌గా న‌టించింది. ఇదే తెలుగులో ఆమె న‌టించిన తొలి సినిమా కావ‌డం గ‌మ‌నార్హం.

ఆ త‌ర్వాత బాల‌కృష్ణ హీరోగా న‌టించిన ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు సినిమాలో గెస్ట్ రోల్ చేసింది. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన క‌డ‌ల్ సినిమాతో హీరో గౌత‌మ్ కార్తిక్ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

IPL_Entry_Point