Gangs of Godavari Review: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రివ్యూ - విశ్వ‌క్ సేన్ మాస్ యాక్ష‌న్ మూవీ ఎలా ఉందంటే?-gangs of godavari review vishwak sen neha shetty action drama movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gangs Of Godavari Review: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రివ్యూ - విశ్వ‌క్ సేన్ మాస్ యాక్ష‌న్ మూవీ ఎలా ఉందంటే?

Gangs of Godavari Review: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రివ్యూ - విశ్వ‌క్ సేన్ మాస్ యాక్ష‌న్ మూవీ ఎలా ఉందంటే?

Nelki Naresh Kumar HT Telugu
May 31, 2024 01:52 PM IST

Gangs of Godavari Review: విశ్వ‌క్‌సేన్‌, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా న‌టించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి మూవీ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ ఎలా ఉందంటే?

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి మూవీ
గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి మూవీ

Gangs of Godavari Review: కెరీర్‌లో ఎక్కువ‌గా మోడ్ర‌న్ ల‌వ‌ర్ బాయ్ త‌ర‌హా పాత్ర‌ల్లోనే క‌నిపించారు విశ్వ‌క్‌సేన్. తొలిసారి రూర‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్ట‌ర్‌లో విశ్వ‌క్‌సేన్ (Vishwak Sen) న‌టించిన తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి. కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా శుక్ర‌వారం రిలీజైంది. నేహాశెట్టి హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో అంజ‌లి (Anjali) కీల‌క పాత్ర పోషించింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రితో విశ్వ‌క్‌సేన్‌కు హిట్టు ద‌క్కిందా? లేదా? అంటే?

yearly horoscope entry point

లంకల ర‌త్న రాజ‌కీయం...

ర‌త్నాక‌ర్ అలియాస్ లంకల ర‌త్న (విశ్వ‌క్‌సేన్‌) చిన్న‌త‌నంలోనే త‌ల్లిదండ్రుల‌ను కోల్పోతాడు. త‌న ధైర్యం, తెగువ‌తో ఎమ్మెల్యే దొర‌స్వామిరాజుకు న‌మ్మిన బంటుగా మారుతాడు. కొన్ని ప‌రిణామాల‌తో దొర‌స్వామిరాజుకు (గోప‌రాజు ర‌మ‌ణ‌) వ్య‌తిరేకంగా ర‌త్న‌ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాడు. నానాజీ (నాజ‌ర్‌) స‌హాయంతో ఎమ్మెల్యేగా గెలుపొందుతాడు. ఎమ్మెల్యేగా ఎన్నికైన త‌ర్వాతే ర‌త్న జీవితం ఊహించ‌ని మ‌లుపులు తిరుగుతుంది.

ర‌త్న జైలు పాల‌వుతాడు? ఎన్నిక‌ల్లో ఓటు వేసిన ర‌త్న‌ను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్ర‌జ‌లే అత‌డిని ఎందుకు ద్వేషించారు? లంక‌ల ర‌త్న టైగ‌ర్ ర‌త్న‌గా ఎలా మారాడు? లంక‌ల ర‌త్న‌ను ప్రేమించిన పెళ్లాడిన బుజ్జి (నేహాశెట్టి)అత‌డిని చంప‌డానికి ఎందుకు ప్ర‌య‌త్నించింది? ర‌త్న‌కు వేశ్య ర‌త్న‌మాల‌తో (అంజ‌లి) ఉన్న సంబంధం ఏమిటి? శ‌త్రువుల్ని ఎదురించి ర‌త్న త‌న కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అన్న‌దే గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి మూవీ క‌థ‌.

నెగెటివ్ షేడ్ క్యారెక్ట‌ర్స్‌...

హీరో అంటే ఇదివ‌ర‌కు మంచోడిగా చూపించేవారు ద‌ర్శ‌కులు. ఎన్ని క‌ష్టాలు ఎదురైన మంచికే క‌ట్టుబ‌డిన హీరో చివ‌ర‌కు విజ‌యం సాధించిన‌ట్లుగా చూపించేవారు. ఇప్పుడా ట్రెండ్ మారింది.

హీరోల‌ను నెగెటివ్ షేడ్స్ క్యారెక్ట‌ర్‌లో చూపించ‌డం ఓ ట్రెండ్‌గా మారిపోయింది. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క‌థ‌ల్లో ఎలాంటి ప‌రిమితులు లేకుండా హీరో క్యారెక్ట‌ర్‌ను లార్జ‌ర్ దేన్ లైఫ్‌గా చూపించే అవ‌కాశం ఉంటుంది. హీరోయిజాన్ని ప‌తాక స్థాయిలో పండించొచ్చు. అందుకే ఈ నెగెటివ్ షేడ్స్ క‌థ‌ల ప‌ట్ల స్టార్ హీరోల నుంచి మిడ్ రేంజ్ హీరోల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ ఆస‌క్తిని చూపుతోన్నారు.

విశ్వ‌క్‌సేన్ ఇమేజ్‌...

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి అలాంటి మూవీనే. క‌థ, క‌థ‌నాల కంటే విశ్వ‌క్‌సేన్ ఇమేజ్‌, అత‌డి క్యారెక్ట‌రైజేష‌న్‌ను న‌మ్మి ద‌ర్శ‌కుడు కృష్ణ చైత‌న్య గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి మూవీని తెర‌కెక్కించాడు. ఇదొక‌ పొలిటిక‌ల్ రివేంజ్ యాక్ష‌న్ డ్రామా మూవీ. ఈ స్టోరీకి లంక గ్రామాల నేప‌థ్యం బాగా సెట్ట‌య్యింది. అక్క‌డి రాజ‌కీయాలు, నేప‌థ్యాన్ని రా అండ్ ర‌స్టిక్‌గా స్క్రీన్‌పై చూపించ‌డంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడు.

మాసీ క్యారెక్ట‌ర్‌...

ఓ సాధార‌ణ దొంగ నీతి న్యాయాల‌తో ప‌నిలేకుండా అడ్డ‌దారుల్లో ఎలా ఎదిగాడు? రాజ‌కీయాల‌ను శాసించే స్థాయికి ఏ విధంగా చేరుకున్నాడు? అత‌డి ఎదుగుద‌ల‌, వ్య‌క్తి జీవితంలోని మ‌లుపుల చుట్టూ ఈ క‌థ‌ను అల్లుకున్నారు ద‌ర్శ‌కుడు.

మాస్ ఆటిట్యూడ్‌, ఎన‌ర్జీ తో కూడిన యాక్టింగ్‌తో ఎంత సింపుల్ క్యారెక్ట‌ర్‌నైనా హై ఇంటెన్స్‌గా స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేయ‌గ‌ల‌డు విశ్వ‌క్‌సేన్‌. ర‌త్నాక‌ర్ పాత్ర‌లో విశ్వ‌క్‌సేన్ అద‌ర‌గొట్టాడు. గ‌త సినిమాల‌కు పూర్తి భిన్నంగా మాసీగా క‌నిపించాడు. అయితే అత‌డికి ఇమేజ్‌కు మించిన క్యారెక్ట‌ర్ కావ‌డంతో వ‌ర్క‌వుట్ కానీ ఫీలింగ్ క‌లిగిస్తుంది.

రివేంజ్ డ్రామా...

విశ్వ‌క్ సేన్ చేసే అల్ల‌రి ప‌నులు, ఎమ్మెల్యే ద‌గ్గ‌ర అనుచ‌రుడిగా..బుజ్జి..ర‌త్న‌మాల‌తో అత‌డి అనుబంధంతో ఫ‌స్ట్ హాఫ్ స‌ర‌దాగా సాగిపోతుంది. సెకండాఫ్‌ను కంప్లీట్ రివేంజ్ మోడ్‌లో సీరియ‌స్‌గా న‌డిపించాడు డైరెక్ట‌ర్‌.

అడ్డ‌దారుల్లో ఎమ్మెల్యే అయిన ర‌త్న జీవితంలో ఎలా కింద‌ప‌డిపోయాడు? అందుకు దారి తీసిన ప‌రిస్థితుల చుట్టూ సెకండాఫ్ న‌డుస్తుంది. అయితే డ్రామాలో ఎమోష‌న్స్ స‌రిగా వ‌ర్క‌వుట్ కాలేదు. క‌థ రొటీన్ కావ‌డం కూడా సెకండాఫ్‌కు మైన‌స్‌గా మారింది. యాక్ష‌న్ ఎపిసోడ్స్, వాటి ప్లేస్‌మెంట్స్ బాగా కుదిరాయి.

ర‌త్న పాత్ర‌లో...

లంక‌ల ర‌త్న పాత్ర‌లో విశ్వ‌క్‌సేన్ జీవించాడు. అత‌డిని త‌ప్ప మ‌రొక‌రిని ఊహించుకోలేనంత‌గా క్యారెక్ట‌ర్‌ను ఓన్ చేసుకున్నాడు. బుజ్జి అనే ప‌ల్లెటూరి అమ్మాయి పాత్ర‌లో నేహా శెట్టి యాక్టింగ్ బాగుంది. ఆమె క్యారెక్ట‌ర్‌లోని వేరియేష‌న్స్ మెప్పిస్తాయి. ర‌

త్న‌మాల‌గా అంజ‌లి పాత్ర ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. వేశ్య‌గా మాస్ రోల్‌లో ఆమె బాడీలాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీ డిఫ‌రెంట్‌గా ఉన్నాయి. గోప‌రాజు ర‌మ‌ణ‌, నాజ‌ర్‌, గ‌గ‌న్ విహారి త‌మ ప‌రిధుల మేర మెప్పించారు. హైప‌ర్ ఆది, ప‌మ్మి సాయి కామెడీ కొన్ని చోట్ట వ‌ర్క‌వుట్ అయ్యింది. ఈ సినిమాకు సెకండ్ హీరోగా మ్యూజిక్ డైరెక్ట‌ర్ యువ‌న్ శంక‌ర్ రాజా నిలిచాడు. త‌న బీజీఎమ్‌తో సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాడు.

క‌థ పాత‌దే కానీ...

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి రొటీన్ మాస్ యాక్ష‌న్ మూవీ. క‌థ పాత‌దే అయినా నేప‌థ్యం మాత్రం కొత్త‌గా ఉంది. విశ్వ‌క్‌సేన్ యాక్టింగ్‌, బీజీఎమ్‌, విజువ‌ల్స్ కోసం ఈ మూవీ ఓ సారి చూడొచ్చు.

రేటింగ్‌: 2.75/5

Whats_app_banner