Bhagavanth Kesari Song Promo: ‘సప్పుడు జర గట్టిగా చేయమను’: 'భగవంత్ కేసరి' నుంచి తొలి పాట ప్రోమో వచ్చేసింది
Bhagavanth Kesari Song Promo: భగవంత్ కేసరి సినిమా నుంచి తొలి పాట ప్రోమో రిలీజ్ అయింది. ‘గణేశ్ యాన్‍థమ్’ పేరుతో ఈ పాట ప్రోమో వచ్చింది. పూర్తి సాంగ్ రిలీజ్ డేట్ గురించి కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది.
Bhagavanth Kesari Song Promo: నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘భగవంత్ కేసరి’ చిత్రంపై చాలా ఆసక్తి ఉంది. కామెడీ సినిమాలకు పాపులర్ అయిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో మాస్ హీరో అయిన బాలయ్య చేస్తుండటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ‘భగవంత్ కేసరి’ సినిమాకు ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తొలి పాట గణేశ్ యాన్‍థమ్ (Ganesh Anthem) ప్రోమో నేడు (ఆగస్టు 30) రిలీజ్ అయింది. పాట ఎలా ఉందంటే..
ట్రెండింగ్ వార్తలు
‘గణపతి బప్పా మోరియా’.. ‘జై బోలో గణేశ్ మహరాజ్‍కీ’ అంటూ ‘భగవంత్ కేసరి’ నుంచి గణేశ్ యాన్‍థమ్ పాట ప్రోమో మొదలైంది. హీరో బాలకృష్ణ, శ్రీలీల ఈ పాటలో కనిపించారు. మాస్ బీట్‍తో ఫుల్ జోష్‍గా ఈ పాట ఉంది. సినిమాలో గణేశ్ ఉత్సవాల సందర్భంగా వచ్చే పాట ఇది. ‘బిడ్డా ఆనుతలేదు.. సప్పుడు జర గట్టిగా చేయమను” అని బాలకృష్ణ డైలాగ్ చెప్పారు. “అరే తీసి పక్కన పెట్టండ్రా మీ తీనుమారు.. మా చిచ్చా ఒచ్చిండు.. ఎట్లుండాలే.. కొట్టరకొట్టు సౌమారు” అని శ్రీలీల చెప్పిన డైలాగ్ ఈ ప్రోమోలో అదిరిపోయింది.. సెప్టెంబర్ 1వ తేదీన ఈ పాట పూర్తి లిరికల్ సాంగ్ రిలీజ్ కానుంది.
ఈ పాటను ఫుల్ మాస్ బీట్‍తో స్వరపరిచారు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. కరీముల్లా, మనీశ్ పంద్రంకి ఈ సాంగ్‍ను పాడారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. ఈ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేశారు శేఖర్ మాస్టర్.
‘భగవంత్ కేసరి’ సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. బాలకృష్ణ కూతురి పాత్రను శ్రీలీల చేస్తున్నట్టు సమాచారం. అర్జున్ రాంపాల్ ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. తెలంగాణ యాసలో బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. ‘ఈ పేరు షానా ఏండ్లు యాదుంటది’ అనే డైలాగ్ మంచి పాపులర్ అయింది.
సన్‍షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ ‘భగవంత్ కేసరి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమ్మి రాజు ఈ చిత్రానికి ఎడిటర్‌గా ఉండగా.. సి.రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 19న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.