OTT Telugu Movie: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సుకుమార్ కూతురు నటించిన మూవీ.. ఎక్కడ చూడాలంటే?
OTT Telugu Movie: ఓటీటీలోకి ఓ రీసెంట్ తెలుగు మూవీ సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. రెండు నెలల కిందట థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. అసలు ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండానే రావడం విశేషం. సుకుమార్ కూతురు నటించిన సినిమా ఇది.
OTT Telugu Movie: టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి ప్రధానపాత్రలో నటించిన సినిమా గాంధీ తాత చెట్టు. ఈ సినిమా జనవరి 24న థియేటర్లలో రిలీజైంది. రెండు నెలలుగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై ఎలాంటి సమాచారం లేకపోగా.. ఇప్పుడు సడెన్ గా శుక్రవారం (మార్చి 21) డిజిటల్ ప్రీమియర్ అయింది. థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాని ఈ సినిమాను ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
గాంధీ తాత చెట్టు ఓటీటీ స్ట్రీమింగ్
గాంధీ తాత చెట్టు మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాను తెరకెక్కించింది. సందేశాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను పద్మావతి మల్లాది డైరెక్ట్ చేశారు.
ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ముందుగా ఎలాంటి సమాచారం లేదు. అయితే సడెన్ గా శుక్రవారం (మార్చి 21) ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ప్రత్యక్షమైంది. కనీసం సోషల్ మీడియాలోనూ ఆ ఓటీటీ ఈ విషయాన్ని వెల్లడించలేదు.
గాంధీ తాత చెట్టు మూవీ ఎలా ఉందంటే?
సామాజిక సమస్యల్ని కథా వస్తువులుగా తీసుకొని సినిమాలు చేసే ట్రెండ్ ఇదివరకు టాలీవుడ్ ఎక్కువగా కనిపించేది. మాస్, యాక్షన్, కామెడీలతో కూడిన కమర్షియల్ మూవీస్ కు ఆదరణ పెరిగిపోవడంతో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల ఒరవడి టాలీవుడ్ చాలా తగ్గుముఖం పట్టింది. ఆ లోటును కొంత వరకు భర్తీ చేస్తూ తెరకెక్కిన మూవీ గాంధీ తాత చెట్టు.
అహింసను ఆయుధంగా చేసుకొని బ్రిటీషర్లను దేశం నుంచి తరిమికొట్టాడు గాంధీ. ఆయన బాటలోనే కార్పొరేట్ శక్తుల బారి నుంచి తమ ఊరిని ఓ అమ్మాయి ఎలా కాపాడిందనే పాయింట్‌తో దర్శకురాలు పద్మావతి మల్లాది ఈ సినిమాను తెరకెక్కించారు. చెట్లకు ప్రాణం ఉంటుందని, ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందనే సందేశాన్ని ఇచ్చారు.
తమ స్వార్థం కోసం పచ్చని పల్లెలను కార్పొరేట్ శక్తులు ఎలా నాశనం చేయాలని చూస్తున్నాయో గాంధీ తాత చెట్టులో ఆలోచనాత్మకంగా చూపించారు. తెలంగాణ నేటివిటీతో ఈ కథను చెప్పడంతో ఫ్రెష్‌ఫీల్ వచ్చింది.
తెలంగాణ యాసలో...
గాంధీ పాత్రకు సుకుమార్ కూతురు సుకృతి వేణి చాలా వరకు న్యాయం చేసింది. తెలంగాణ యాసలో ఆమె చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి. క్యారెక్టర్‌ను ఎంత ప్రేమించి చేసింది అన్నది ప్రతి ఫేమ్‌లో కనిపిస్తుంది. తాత పాత్రలో నటించిన ఆనంద చక్రపాణి, నాచరల్ యాక్టింగ్‌ను కనబరిచాడు.
చెట్టుకు తనికెళ్ల భరణి వాయిస్ ఓవర్ చక్కగా కుదిరింది. రామ్‌మయూర్, రఘురాం, లావణ్యతో పాటు మిగిలిన వాళ్లు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. డైరెక్టర్‌గా పద్మావతి మల్లాదికి ఇదే తొలి సినిమా. ఆమె ఎంచుకున్న కాన్పెప్ట్ బాగుంది. రీ మ్యూజిక్, బీజీఎమ్ కథకు తగ్గట్లుగా సాగాయి.
ప్రైమ్ వీడియో ఈరోజు రిలీజెస్
అమెజాన్ ప్రైమ్ వీడియోలో శుక్రవారం (మార్చి 31) ఈ గాంధీ తాత చెట్టు మూవీతోపాటు మరో హిందీ సినిమా, ఓ తమిళ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కొన్నాళ్లుగా రెంట్ విధానంలో అందుబాటులో ఉన్న హిందీ మూవీ స్కై ఫోర్స్ శుక్రవారం నుంచి సబ్‌స్క్రైబర్లందరికీ ఫ్రీగా చూసే వీలు కలిగింది. ఇక తమిళంలో ధనుష్ డైరెక్ట్ చేసి తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా టైటిల్ తో వచ్చిన మరో సినిమా కూడా స్ట్రీమింగ్ కు వచ్చింది.
సంబంధిత కథనం