OTT Releases: గత వారం ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు చిత్రాలు ఇవే.. ఈగల్‍తో పాటు మరో మూడు..
Recent OTT Releases: గత వారం ఓటీటీలోకి మరిన్ని తెలుగు సినిమాలు అడుగుపెట్టాయి. ఈగల్‍తో పాటు మరిన్ని చిత్రాలు స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చాయి. అవేవో ఇక్కడ తెలుసుకోండి.
OTT Releases: ఓటీటీల్లోకి ప్రతీ వారం కొత్త సినిమాలు స్ట్రీమింగ్‍కు వస్తున్నాయి. ఈ క్రమంలో గత వారం (ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1 వరకు) కూడా కొన్ని తెలుగు చిత్రాలు వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చాయి. రవితేజ నటించిన ఈగల్ చిత్రం ఏకంగా రెండు ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మరిన్ని సినిమాలు కూడా ఓటీటీల్లోకి అడుగుపెట్టాయి. గత వారం ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లోకి వచ్చిన తెలుగు చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.
గేమ్ ఆన్
‘గేమ్ ఆన్’ తెలుగు సినిమా ఫిబ్రవరి 27వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. గీతానంద్, నేహా సోలంకి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ఫిబ్రవరి 2న థియేటర్లలో విడుదలైంది. నెల ముగియకుండానే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. గేమ్ ఆన్ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహించారు. ఫోన్ ద్వారా హీరోకు ఓ వ్యక్తి చెప్పే టాస్కులతో రియల్ టైమ్ గేమ్‍ల చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది.
బూట్‍కట్ బాలరాజు
బిగ్‍బాస్ ఫేమ్ సయ్యద్ సోహెల్ హీరోగా నటించిన ‘బూట్‍కట్ బాలరాజు’ సినిమా ఫిబ్రవరి 26వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో లవ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు శ్రీకోనేటి. ఫిబ్రవరి 2న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. నాలుగు వారాల్లోగానే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమా కూడా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. మార్చి 1వ తేదీన స్ట్రీమింగ్ మొదలైంది. టాలెంటెడ్ యాక్టర్ సుహాస్, శివానీ నగారం ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి మొదట్లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నెల దాటకుండానే ఆహాలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. దష్యంత్ కటికనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శరణ్య ప్రదీప్ కూడా ప్రధాన పాత్ర చేశారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు చిత్రానికి శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.
ఈగల్
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఈగల్ సినిమా మార్చి 1వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో ఈ చిత్రం అడుగుపెట్టింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజైంది. మూడు వారాలు తిరగకుండానే రెండు ఓటీటీల్లోకి ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈగల్ మూవీలో కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్, నవ్‍దీప్, శ్రీనివాస్ అవసరాల, మధూ, అజయ్ ఘోష్ కీలకపాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రానికి డావ్ జంద్ సంగీతం అందించారు.
షీనా బోరా హత్య కేసుపై రూపొందించిన ది ఇంద్రాణి ముఖర్జియా: బరీడ్ ట్రూత్ డాక్యుమెంటరీ సిరీస్.. ఫిబ్రవరి 29న తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, ఇంగ్లిష్ భాషల్లోనూ స్ట్రీమ్ అవుతోంది.