Game On OTT: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Game On Telugu Movie OTT Streaming: గేమ్ ఆన్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలో రిలీజై నెల గడవక ముందే ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. సడెన్‍గా ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.
Game On Movie OTT: సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా ‘గేమ్ ఆన్’ సినిమా ఫిబ్రవరి 2వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. మోస్తరు టాక్ తెచ్చుకుంది. గీతానంద్, నేహా సోలంకీ ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటించారు. ట్రైలర్‌తో బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం థియేటర్లలో అంతంత మాత్రమే ఆడింది. ఇప్పుడు ఈ ‘గేమ్ ఆన్’ సినిమా సడెన్‍గా ఓటీటీలోకి వచ్చేసింది.
గేమ్ ఆన్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేడు స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ముందస్తు ప్రకటనలు లేకుండా హఠాత్తుగా ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టేసింది. ఫోన్ కాల్ ద్వారా ఓ రియల్ టైమ్ గేమ్ ఆడడం చుట్టూ ఈ థ్రిల్లర్ మూవీ కథ తిరుగుతుంది.
థియేటర్లలో రిలీజై నెల రోజులు ముగియకుండానే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో గేమ్ ఆన్ చిత్రం స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.
గేమ్ ఆన్ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహించారు. గీతానంద్, నేహా సోలంకి ప్రధాన పాత్రలు చేయగా.. మధూ, శుభలేఖ సుధాకర్, ఆదిత్య మీనన్, కిరీటి, వాసంతి కృష్ణ కీరోల్స్ చేశారు. ఈ చిత్రానికి అభిషేక్ ఏఆర్ సంగీతం అందించగా.. వంశీ అట్లూరి ఎడిటింగ్ చేశారు. రవి కస్తూరి నిర్మించిన ఈ మూవీకి అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ చేశారు.
‘గేమ్ ఆన్’ స్టోరీ బ్యాక్‍డ్రాప్ ఇదే..
ఫోన్ కాల్స్ ద్వారా వచ్చిన టాస్కులు చేస్తూ సాగే యువకుడికి ఎదురైన సవాళ్లు, పరిస్థితులు గేమ్ ఆన్ మూవీలో ప్రధానంగా ఉంటాయి. సిద్ధార్థ్ (గీతానంద్) ఓ గేమింగ్ కంపెనీలో పని చేస్తుంటాడు. అయితే, అతడి మంచి తనాన్ని స్నేహితులు వాడుకుంటారు. లవ్ కూడా బ్రేకప్ అవుతుంది. ఉద్యోగాన్ని కూడా అతడు పోగొట్టుకుంటాడు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని సిద్ధార్థ్ నిర్ణయించుకుంటాడు. ఆ తరుణంలో అతడికి ఓ ఫోన్ కాల్ వస్తుంది. తాను చెప్పిన టాస్కులు చేస్తూ ఉంటే డబ్బులు పంపిస్తామని ఆ కాల్‍లో వ్యక్తి చెబుతారు. ఆరంభంలో సులువైన టాస్కులు ఇస్తుండటంతో సిద్ధార్థ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో తార (నేహా సోలంకి)తో అతడు ప్రేమలో పడతాడు. అయితే, ఆ తర్వాత ఓ దశలో ఓ వ్యక్తిని మర్డర్ చేయాలని సిద్ధార్థ్‌కు టాస్క్ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ గేమ్ వెనుక ఎవరు ఉన్నారు? సిద్ధార్థ్‌తో ఎందుకు ఈ మర్డర్ చేయించాలనుకుంటున్నారు? అనేదే గేమ్ ఆన్ సినిమాలో ప్రధాన అంశాలుగా ఉంటాయి.
గేమ్ ఆన్ సినిమాలో గీతానంద్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ హైలైట్‍గా నిలిచింది. అయితే, స్క్రీన్‍ప్లే విషయంలోనే మిక్స్డ్ టాక్ వచ్చింది.
అమెజాన్ ప్రైమ్‍లో ‘ఈగల్’!
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈగల్ సినిమాను త్వరలో స్ట్రీమింగ్‍కు తీసుకొస్తామని ప్రైమ్ వీడియో ఇటీవల ప్రకటించింది. స్ట్రీమింగ్ డేట్‍ను ఖరారు చేయలేదు. అయితే, మరో వారంలోగానే ఈగల్ మూవీ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. మరోవైపు, ఆహా ఓటీటీలోనూ ఈగల్ చిత్రం రానుంది. ఈ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు.