L2: సూపర్ స్టార్ మూవీలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు.. ఇండియాలో గడిపిన తర్వాత లైఫ్ పూర్తిగా మారిపోయిందన్న జెరోమ్ ఫ్లిన్!-game of thrones actor jerome patrick flynn plays role in malayalam super star mohanlal l2 empuraan and says about india ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  L2: సూపర్ స్టార్ మూవీలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు.. ఇండియాలో గడిపిన తర్వాత లైఫ్ పూర్తిగా మారిపోయిందన్న జెరోమ్ ఫ్లిన్!

L2: సూపర్ స్టార్ మూవీలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు.. ఇండియాలో గడిపిన తర్వాత లైఫ్ పూర్తిగా మారిపోయిందన్న జెరోమ్ ఫ్లిన్!

Sanjiv Kumar HT Telugu

Game Of Thrones Actor Jerome Patrick Flynn In L2 Empuraan: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ బ్లాక్ బస్టర్ సీక్వెల్ మూవీ ఎల్2 ఎంపురాన్‌లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ యాక్టర్ జెరోమ్ పాట్రిక్ ఫ్లిన్ నటించనున్నారు. ఎల్2 ఎంపురాన్‌లో బోరిస్ ఆలివర్ పాత్రలో జెరోమ్ ఫ్లిన్ నటిస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.

సూపర్ స్టార్ మూవీలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు.. ఇండియాలో గడిపిన తర్వాత లైఫ్ పూర్తిగా మారిపోయిందన్న జెరోమ్ ఫ్లిన్!

Game Of Thrones Actor Jerome Flynn In L2 Empuraan: గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఓటీటీ వెబ్ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇందులో ప్రతి ఒక్క పాత్ర ఎంతగానో అలరించింది. అందులో ఒకటే బ్రాన్ క్యారెక్టర్. డబ్బు కోసం మాత్రమే పని చేసే ఈ పాత్రలో హాలీవుడ్ యాక్టర్ జేరోమ్ పాట్రిక్ ఫ్లిన్ ఒదిగిపోయి నటించాడు.

కామెడీ యాక్షన్ సీన్స్‌లో

కామెడీ, యాక్షన్ సీన్లలో అదరగొట్టి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న జెరోమ్ ఫ్లిన్ ఇప్పుడు ఇండియన్ సినిమాలో నటించనున్నాడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ లూసిఫర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న సినిమా ఎల్2 ఎంపురాన్. మొదటి సినిమాకు లాగే ఈ మూవీకి కూడా సలార్ విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్నారు.

బ్లాక్ బస్టర్ కాంబో

మోహన్‌ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్‌ల బ్లాక్‌ బస్టర్ కాంబో ‘L2 ఎంపురాన్’ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. 2019లో ఈ ఇద్దరూ కలిసి చేసిన లూసిఫర్‌ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ లూసిఫర్‌కు సీక్వెల్ అయిన ‘L2 ఎంపురాన్’ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ అంచనాలు పెంచేస్తున్నారు.

బోరిస్ ఆలివర్‌గా

ఈ క్రమంలోనే ఎల్‌2లో నటిస్తోన్న జెరోమ్ ఫ్లిన్‌ పాత్రను పరిచయం చేశారు. ఎల్2 ఎంపురాన్ సినిమాలో బోరిస్ ఆలివర్ అనే కీలక పాత్రను జెరోమ్ ఫ్లిన్ పోషించినట్లు మేకర్స్ వెల్లడించారు. ఏడో క్యారెక్టర్‌గా పరిచంయ చేస్తూ దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు జెరోమ్ ఫ్లిన్ పంచుకున్న వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.

భిన్నమైన అనుభవాన్ని

ఈ వీడియోలో జెరోమ్ ఫ్లిన్ మాట్లాడుతూ.. "నేను ఈ ప్రాజెక్టులోకి ఎలా వచ్చానో నాకు పూర్తిగా గుర్తులేదు. కానీ, నేను యూకే, యూఎస్‌లో గడిపిన దానికంటే పూర్తిగా భిన్నమైన అనుభవాన్ని పొందాను. మాలీవుడ్ కల్చర్‌లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మలయాళ సంస్కృతిలో భాగం కావడం, ఇక్కడి రుచుల్ని ఆస్వాధించడం నిజంగా ప్రత్యేకమైంది" అని తెలిపాడు.

ఆధ్యాత్మిక ప్రదేశాలను

"నాకు ఇండియాతో ఎంతో అనుబంధం ఉంది. నా యంగ్ ఏజ్‌లో నేను ఎక్కువగా ఇక్కడి ఆధ్యాత్మిక ప్రదేశాల్ని తిరిగాను. ఇండియాలో గడిపిన తరువాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఈ సినిమాలో నటించడంతో మళ్లీ నేను నా ఇంటికి వచ్చినట్టు అనిపించింది" అని జెరోమ్ పాట్రిక్ ఫ్లిన్ చెప్పుకొచ్చాడు.

పాత్ర గురించి చెప్పకుండా

అయితే, ఎల్‌2 ఎంపురాన్ సినిమాలో తన పాత్ర గురించి చెప్పకుండా, ఖురేషి ప్రయాణంలో తనది ఒక ముఖ్యమైన పాత్ర అని, ప్రేక్షకులు అతని పాత్రను ఇష్టపడతారని ఆశిస్తున్నట్లు జెరోమ్ ఫ్లిన్ పేర్కొన్నారు. ఇక గేమ్ ఆఫ్ థ్రోన్స్‌ ఓటీటీ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న జెరోమ్ ఫ్లిన్ జాన్ విక్ చాప్టర్ 3, సోల్జర్ సోల్జర్, బ్లాక్ మిర్రర్ వంటి సినిమాల్లో నటించాడు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం