Game Changer: గేమ్ ఛేంజర్ న్యూ ఇయర్ పోస్టర్ - పంచెకట్టులో రామ్‌చరణ్ - ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
Game Changer: న్యూ ఇయర్ సందర్భంగా గేమ్ ఛేంజర్ టీమ్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. రామ్‌చరణ్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో పంచెకట్టులో ట్రెడిషనల్ లుక్‌లో రామ్‌చరణ్ కనిపిస్తోన్నాడు. గేమ్ ఛేంజర్ ట్రైలర్‌ను జనవరి 2న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
Game Changer: నూతన సంవత్సరం వేళ రామ్‌చరణ్ అభిమానులకు గేమ్ ఛేంజర్ టీమ్ గుడ్‌న్యూస్ వినిపించింది. రామ్‌చరణ్ కొత్త లుక్‌తో కూడిన పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో పంచెకట్టులో మెడలో కండువా ధరించి ట్రెడిషనల్ లుక్‌లో రామ్‌చరణ్ కనిపిస్తోన్నాడు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పన్న పాత్రకు సంబంధించిన లుక్ ఇదని సమాచారం.
ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే...
కొత్త పోస్టర్‌తో పాటు ట్రైలర్ రిలీజ్‌పై అప్‌డేట్‌ను రివీల్ చేశారు మేకర్స్. జనవరి 2న సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు గేమ్ ఛేంజర్ ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ప్రభుత్వ అధికారి కథ...
అగ్ర దర్శకుడు శంకర్ గేమ్ ఛేంజర్ మూవీకి దర్శకత్వం వహిస్తోన్నాడు. శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఫస్ట్ తెలుగు మూవీ ఇదే కావడంతో గేమ్ ఛేంజర్‌పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. రాజకీయ నాయకులను ఎదురించి పోరాడిన ఓ ప్రభుత్వ అధికారి కథతో గేమ్ ఛేంజర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రామ్‌చరణ్ రెండు డిఫరెంట్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు.ఈ సినిమాకు తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించాడు.
170 కోట్ల బడ్జెట్...
గేమ్ ఛేంజర్ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అంజలి, శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. దాదాపు 170 కోట్ల బడ్జెట్‌తో దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తోన్నాడు. తమన్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. పాన్ ఇండియన్ లెవెల్‌లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ అవుతోంది.
సంక్రాంతి సినిమాల్లో...
ఈ సంక్రాంతికి రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్‌తో పాటు బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. సంక్రాంతి సినిమాల ప్రమోషన్స్‌లో రామ్‌చరణ్, బాలకృష్ణ కంటే వెంకటేష్ ముందున్నాడు.తన సినిమాను భారీగా ప్రమోట్ చేస్తోన్నాడు. మరోవైపు ప్రమోషన్స్‌లో గేమ్ ఛేంజర్ పూర్తిగా వెనుకబడిపోయింది.
ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌తో గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ స్పీడు పెంచబోతున్నట్లు తెలుస్తోంది.ఈ వారంలోనే ఏపీలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్‌కు ఏపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా హాజరుకాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.