Game Changer Update: గేమ్ ఛేంజర్, ఇండియన్ 2పై శంకర్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్-game changer update given by shankar through his twitter account ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Game Changer Update Given By Shankar Through His Twitter Account

Game Changer Update: గేమ్ ఛేంజర్, ఇండియన్ 2పై శంకర్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Hari Prasad S HT Telugu
Apr 18, 2023 05:39 PM IST

Game Changer Update: గేమ్ ఛేంజర్, ఇండియన్ 2పై శంకర్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చాడు. ఈ రెండు బిగ్ బడ్జెట్ సినిమాలు అతని దర్శకత్వంలోనే తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

గేమ్‌ఛేంజ‌ర్
గేమ్‌ఛేంజ‌ర్

Game Changer Update: టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. చాలా రోజుల పాటు ఆర్సీ15గానే పిలిచిన ఈ మూవీకి ఈ మధ్యే గేమ్ ఛేంజర్ అనే పేరు పెట్టారు. ఈ మూవీకి ఇండియన్ సినిమాలోని గొప్ప దర్శకుల్లో ఒకరైన శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వస్తున్న విషయం తెలిసిందే.

ఓవైపు గేమ్ ఛేంజర్ తోపాటు మరోవైపు ఇండియన్ 2 సినిమాను కూడా ఒకేసారి శంకర్ తెరకెక్కిస్తుండటంతో షూటింగ్ ఆలస్యమవుతోంది. అయితే ఒకేరోజు ఇటు చరణ్, అటు కమల్ హాసన్ అభిమానులకు రెండు సినిమాల అప్‌డేట్ అందించాడు శంకర్. మంగళవారం (ఏప్రిల్ 18) తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఈ రెండు సినిమాల గురించి వెల్లడించాడు.

ఇండియన్ 2 షెడ్యూల్ ముగిసిందని, మళ్లీ మేలో షూటింగ్ కొనసాగించనున్నట్లు అతడు చెప్పాడు. ఈలోపు గేమ్ ఛేంజర్ క్లైమ్యాక్స్ షూట్ చేయనున్నట్లు కూడా తెలిపాడు. "ఈ పవర్ ప్యాక్డ్ షెడ్యూల్ కోసం థ్యాంక్యూ కమల్ హాసన్ సర్. మిమ్మల్ని మళ్లీ మేలో కలుస్తాను. ఈలోపు ఇండియన్ 2 నుంచి గేమ్ ఛేంజర్ క్లైమ్యాక్స్ షూట్ చేస్తాను" అని శంకర్ ట్వీట్ చేశాడు. ఇండియన్ 2 సౌతాఫ్రికా షెడ్యూల్ ముగిసింది.

మరోవైపు ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్య మూవీలో గెస్ట్ రోల్ లో కనిపించిన చరణ్.. మరో పూర్తి స్థాయి సినిమా చేయలేదు. దీంతో అతని అభిమానులు ఈ గేమ్ ఛేంజర్ కోసం ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. శంకర్ డైరెక్షన్, ఒక పాట కోసమే రూ.40 కోట్లు ఖర్చు పెట్టారన్న వార్తల నేపథ్యంలో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇండియన్ 2ను వచ్చే సంక్రాంతికి, గేమ్ ఛేంజర్ ను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని శంకర్ భావిస్తున్నాడు.

ఈ మధ్యే గేమ్ ఛేంజర్ నుంచి చరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. చెర్రీ బర్త్ డే సందర్భంగా వచ్చిన ఈ పోస్టర్ లో అతడు చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ సరసన కియారా నటిస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం