Game Changer Trailer Date: గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ డేట్ చెప్పేసిన దిల్‍రాజు.. ‘పవన్ డేట్ ఇచ్చాక ఏపీలో మెగా ఈవెంట్’
Game Changer Trailer Release Date: గేమ్ ఛేంజర్ సినిమా ట్రైలర్ ఎప్పుడు రానుందో నిర్మాత దిల్‍రాజు చెప్పేశారు. రామ్‍చరణ్ భారీ కటౌట్ లాంచ్ ఈవెంట్‍లో ఈ విషయాన్ని వెల్లడించారు. ట్రైలర్ ఓ రేంజ్‍లో ఉంటుందంటూ హైప్ పెంచేశారు.
మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న గుడ్‍న్యూస్‍ను నిర్మాత దిల్‍రాజు వెల్లడించారు. గేమ్ ఛేంజర్ సినిమా ట్రైలర్ డేట్‍ను ప్రకటించారు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన రిలీజ్ కానుంది. అయితే, ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మేకర్లను కొంతకాలంగా ప్రశ్నిస్తున్నారు. ఈ తరుణంలో ట్రైలర్ ఏరోజున రానుందో దిల్‍రాజు వెల్లడించారు. విజయవాడలో రామ్‍చరణ్ 256 అడుగుల భారీ కటౌట్ ఆవిష్కరణ సందర్భంగా నేడు (డిసెంబర్ 29) ట్రైలర్ డేట్ గురించి చెప్పారు.
ట్రైలర్ డేట్ ఇదే
గేమ్ ఛేంజర్ సినిమా ట్రైలర్‌ను కొత్త సంవత్సరం సందర్భంగా 2025 జనవరి 1వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు దిల్‍రాజు వెల్లడించారు. కటౌట్ లాంచ్ ఈవెంట్‍లో ఫ్యాన్స్ ట్రైలర్.. ట్రైలర్ అంటూ అప్‍డేట్ కోసం అరిచారు. దీంతో దిల్‍రాజు స్పందించారు. కొత్త సంవత్సరం రోజున ట్రైలర్ తెస్తామని అన్నారు.
గేమ్ ఛేంజర్ సినిమా ట్రైలర్ ఓ రేంజ్‍లో ఉంటుందని దిల్‍రాజు వెల్లడించారు. “ట్రైలర్ నా ఫోన్‍లో ఉంది. కానీ మీ దగ్గరికి వచ్చే వరకు చాలా పనులు చేయాల్సి ఉంది. ఈరోజు ట్రైలరే సినిమా రేంజ్‍ను డిసైడ్ చేస్తోంది. ఆ రేంజ్‍లో ట్రైలర్ ఇచ్చేందుకు రెడీ అయ్యాం. కొత్త సంవత్సరం జనవరి 1 రోజున మీరు ట్రైలర్ చూస్తారు” అని దిల్‍రాజు అన్నారు.
పవన్‍ను కలుస్తా.. చరిత్ర సృష్టించేలా ఈవెంట్
విజయవాడతో కటౌట్ లాంచ్ ఈవెంట్‍తో పాటు మరో పనిపై వచ్చానని దిల్‍రాజు చెప్పారు. గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‍ను ఆహ్వానిస్తానని చెప్పారు. ఆయనతో మాట్లాడేందుకు కూడా ఇక్కడికి వచ్చానని అన్నారు. గేమ్ ఛేంజర్ సినిమా ఈవెంట్ చరిత్ర సృష్టించేలా ఉండాలని అన్నారు. అమెరికాలో జరిగిన ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయిందని తెలిపారు.
పవన్ కల్యాణ్ డేట్ ఇచ్చాక గేమ్ ఛేంజర్ ఈవెంట్‍ను ఫిక్స్ చేస్తామని దిల్‍రాజు తెలిపారు. “ముందు జనవరి 1 ట్రైలర్. పవన్ కల్యాణ్ డేట్ ఇస్తే జనవరి 4 లేదా 5 ఆంధ్రప్రదేశ్‍లో ఓ మెగా ఈవెంట్. జనవరి 10తో సినిమా. ఈసారి సంక్రాంతి పండుగ ఈసారి ఓ రేంజ్‍లో చేసుకుందాం” అని దిల్‍రాజు చెప్పారు.
గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్‍చరణ్ నటవిశ్వరూపం చూపారని దిల్‍రాజు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి నేడే ఈ మూవీ చూసారని, సంక్రాంతికి మూములుగా కొట్టట్లేదని అభిమానులకు చెప్పమన్నారని అన్నారు. “జనవరి 10న కచ్చితంగా మెగా పవర్ స్టార్‌లో మెగాను చూస్తారు.. పవర్‌ను చూస్తారు” అని దిల్‍రాజు చెప్పారు.
గేమ్ ఛేంజర్ చిత్రాన్ని దిల్‍రాజు, శిరీష్ నిర్మించగా.. థమన్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి నాలుగు సాంగ్స్ వచ్చాయి. ట్రైలర్ వచ్చాక హైప్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రంలో కియారా అడ్వానీ, ఎస్‍జే సూర్య, అంజలి, శ్రీకాంత్, సునీల్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది.
సంబంధిత కథనం
టాపిక్