Game Changer Trailer: రా కి రా.. సర్ కి సర్.. ఐ యామ్ అన్‌ప్రెడిక్టబుల్.. అదిరిపోయిన గేమ్ ఛేంజర్ ట్రైలర్..
Game Changer Trailer: గేమ్ ఛేంజర్ ట్రైలర్ వచ్చేసింది. రామ్ చరణ్ నటించిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 10న రిలీజ్ కానుండగా.. గురువారం (జనవరి 2) రాజమౌళి చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు.
Game Changer Trailer: గేమ్ ఛేంజర్ మూవీ ట్రైలర్ రిలీజైంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్ గురువారం (జనవరి 2) హైదరాబాద్ లోని ఏఎంబీలో సింపుల్ గా జరిగిపోయింది. పుష్ప 2 సంధ్య థియేటర్ ఘటన తర్వాత జరుగుతున్న ఈవెంట్ కావడంతో మరింత జాగ్రత్తగా ఈవెంట్ నిర్వహించారు. దర్శక ధీరుడు రాజమౌళి ఈ ట్రైలర్ రిలీజ్ చేశాడు.
2 నిమిషాల 4 సెకన్ల నిడివితో ఉన్న ఈ ట్రైలర్లో రామ్ చరణ్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించి అలరించాడు. గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రామ్ చరణ్, శంకర్, రాజమౌళితోపాటు మూవీలో నటించిన శ్రీకాంత్, అంజలి, ఎస్‌జే సూర్య, సముద్రఖని, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నిర్మాత దిల్ రాజు పాల్గొన్నారు.
గేమ్ ఛేంజర్ గురించి..
ఓ రాజకీయ నాయకుడు, ఓ ఆఫీసర్ కు మధ్య జరిగే వారే ఈ మూవీ స్టోరీ అని డైరెక్టర్ శంకర్ చెప్పాడు. ఇది శంకర్ మూవీ కాదు.. రామ్ చరణ్ మూవీ అని అతడు అనడం విశేషం. సినిమాలో వివిధ రూపాల్లో చరణ్ కనిపిస్తాడని, అద్భుతంగా నటించాడని శంకర్ అన్నాడు.
గేమ్ ఛేంజర్ మూవీని తమిళ దర్శకుడు శంకర్ షణ్ముగం తెరకెక్కించాడు. ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న మూవీ మూడేళ్లుగా ఊరిస్తోంది. షూటింగ్ చాలా ఆలస్యం కావడంతో రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి సంక్రాంతి సందర్భంగా జనవరి 10న రిలీజ్ కాబోతోంది. ఈ భారీ బడ్జెట్ మూవీలో చరణ్.. ఓ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. అతని సరసన కియారా అద్వానా నటించింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి పలు పాటలు, టీజర్ వచ్చాయి.
ఈ మధ్యే విజయవాడలో అతిపెద్ద రామ్ చరణ్ కటౌట్ ను కూడా లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇదే అతిపెద్ద కటౌట్ కావడం విశేషం. ట్రైలర్ లాంచ్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మేకర్స్.. ప్రీరిలీజ్ ఈవెంట్ మాత్రం రాజమండ్రిలో నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వస్తుండటంతో మరింత ఆసక్తి నెలకొంది. ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ ఓ మూవీ ఈవెంట్ కు తొలిసారి రాబోతున్నాడు. గేమ్ ఛేంజర్ ఈవెంట్లో అతడు ఏం మాట్లాడబోతున్నాడో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ జనవరి 4న జరగనుంది.