Game Changer Update: గేమ్ ఛేంజర్ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన డైరెక్టర్ శంకర్.. షూటింగ్ పూర్తయినట్లే..-game changer release date director shankar reveals the release details ram charan movie almost completes shooting ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Game Changer Update: గేమ్ ఛేంజర్ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన డైరెక్టర్ శంకర్.. షూటింగ్ పూర్తయినట్లే..

Game Changer Update: గేమ్ ఛేంజర్ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన డైరెక్టర్ శంకర్.. షూటింగ్ పూర్తయినట్లే..

Hari Prasad S HT Telugu
Jun 27, 2024 09:14 AM IST

Game Changer Update: రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయినట్లే కనిపిస్తోంది. ఈ మూవీ రిలీజ్ పై తాజా ఇంటర్వ్యూలో డైరెక్టర్ శంకర్ స్పందించాడు.

గేమ్ ఛేంజర్ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన డైరెక్టర్ శంకర్.. షూటింగ్ పూర్తయినట్లే..
గేమ్ ఛేంజర్ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన డైరెక్టర్ శంకర్.. షూటింగ్ పూర్తయినట్లే..

Game Changer Update: రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ ఆలస్యం అవుతుండటంపై ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూవీపై ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంపై డైరెక్టర్ శంకర్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో శంకర్.. ఈ మూవీ రిలీజ్ పై కీలకమైన అప్డేట్ ఇచ్చాడు.

yearly horoscope entry point

షూటింగ్ మరో పది రోజులే..

రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఇప్పటి వరకూ మరో పూర్తిస్థాయి సినిమాలో కనిపించలేదు. గేమ్ ఛేంజర్ పేరుతో రెండేళ్లుగా ఊరిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ మూవీ రిలీజ్ పై స్పష్టత లేదు. అటు డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం ఇండియన్ 2 మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా జులై 12న రిలీజ్ కానుంది. ఈ ప్రమోషన్లలో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ పై కూడా అతడు స్పందించాడు.

"సినిమా దాదాపు పూర్తయింది. మరో 10 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఇండియన్ 2 రిలీజ్ అవగానే ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తాను. ఆ తర్వాత ఫైనల్ ఫుటేజ్ చూసి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెడతాను. అన్ని పనులు పూర్తయిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను. సినిమా సాధ్యమైనంత త్వరగానే రిలీజ్ అవుతుంది" అని శంకర్ అన్నాడు.

దీపావళికి డౌటేనా?

నిజానికి గేమ్ ఛేంజర్ మూవీ దీపావళికైనా వస్తుందని అభిమానులు ఆశగా ఎదురు చూశారు. కానీ తాజాగా శంకర్ చెప్పడాన్ని బట్టి చూస్తే అప్పుడు కూడా సందేహంగానే మారింది. సాధ్యమైనంత త్వరగా అన్నాడు తప్ప ఎప్పుడన్నది చెప్పలేదు. పది రోజుల షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రమోషన్లకు చాలా సమయమే పడుతుంది. ఆ లెక్కన దీపావళికి కాకుండా క్రిస్మస్ కు రావచ్చని భావిస్తున్నారు.

దీపావ‌ళికి గేమ్‌ఛేంజ‌ర్‌ను రిలీజ్ చేయాల‌ని ఫిక్స‌యిన‌ట్లు తెలిసింది. ఈ ఏడాది దీపావ‌ళి పండుగ బ‌రిలో రామ్‌చ‌ర‌ణ్ మూవీ నిల‌వ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఒక‌వేళ అప్ప‌టివ‌ర‌కు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కంప్లీట్ కాక‌పోతే రిలీజ్ డేట్ విష‌యంలో సెకండ్ ఆప్ష‌న్‌గా క్రిస్మ‌స్‌ను ప‌రిశీలిస్తోన్న‌ట్లు స‌మాచారం. దాదాపుగా ఈ మూవీ దీపావ‌ళికే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని చెబుతోన్నారు.

దీపావ‌ళినే క‌రెక్ట్ డేట్ గా మేక‌ర్స్‌ భావిస్తోన్న‌ట్లు తెలిసింది. సెప్టెంబ‌ర్‌లో దేవ‌ర‌, డిసెంబ‌ర్‌లో పుష్ప‌తో పాటు స్టార్ హీరోలు న‌టించిన మ‌రికొన్ని భారీ బ‌డ్జెట్ సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. ఈ రెండింటి మ‌ధ్య గ్యాప్‌లోనే గేమ్ ఛేంజ‌ర్‌ను విడుద‌ల చేయాల‌ని ఫిక్సైన‌ట్లు స‌మాచారం. జూలైలోనే రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ రానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తోన్నాయి.

ఇండియ‌న్ 2 కార‌ణంగా..

2021లో గేమ్ ఛేంజ‌ర్ సినిమా మొద‌లైంది. దాదాపు మూడేళ్లుగా షూటింగ్ సాగుతూనే ఉంది. ప్ర‌స్తుతం గేమ్ ఛేంజ‌ర్‌తో పాటు ఇండియ‌న్ 2 సినిమాకు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ రెండు సినిమాల షూటింగ్‌ల‌ను ఒకేసారి చేస్తూ వ‌చ్చారు శంక‌ర్‌. ఇండియ‌న్ 2 కార‌ణంగా గేమ్ ఛేంజ‌ర్ షూటింగ్ ఆల‌స్య‌మైంది. ఇప్పుడా సినిమా రిలీజ్ కు సిద్ధం కావడంతో శంకర్ ఇక పూర్తిగా గేమ్ ఛేంజర్ పైనే దృష్టి సారించనున్నాడు.

Whats_app_banner