Game Changer Pre Release Business: గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ బిజినెస్.. తెలుగు రాష్ట్రాల్లో టార్గెట్ ఇదీ.. కష్టమేమీ కాదు
Game Changer Pre Release Business: గేమ్ ఛేంజర్ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలోనే జరిగింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో లాభాలు రావాలంటే ఈ మూవీకి పెద్ద కష్టమైన పనిలా కనిపించడం లేదు. కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా ఆ టార్గెట్ అందుకోవచ్చు.
Game Changer Pre Release Business: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. చాలా ఏళ్లుగా ఊరించి వస్తున్న సినిమా కావడంతో సహజంగానే భారీ అంచనాలు ఉన్నాయి. గురువారం (జనవరి 2) రిలీజైన ట్రైలర్ ఈ అంచనాలను మరింత పెంచేసింది. ఈ నేపథ్యంలో మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. మరి తెలుగు రాష్ట్రాల్లో గేమ్ ఛేంజర్ బిజినెస్ ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం.
గేమ్ ఛేంజర్ టార్గెట్ ఇదీ
శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన గేమ్ ఛేంజర్ మూవీ జనవరి 10న రిలీజ్ కాబోతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటించిన పూర్తి స్థాయి మూవీ కావడంతో భారీగా ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ.127 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. అయితే మూవీపై ఉన్న అంచనాలతోపాటు కాస్త పాజిటివ్ రివ్యూలు వచ్చినా.. ఈ టార్గెట్ పెద్ద కష్టం కాకపోవచ్చు.
పుష్ప 2 తర్వాత తెలుగులో రిలీజ్ అవుతున్న పెద్ద మూవీ ఇదే కావడంతో భారీ ఓపెనింగ్స్ ఖాయం. అందులోనూ సంక్రాంతికి వస్తుండటంతో తొలి వారం వసూళ్లు ఆశించిన స్థాయిలోనే ఉంటాయని అంచనా వేయొచ్చు. నిజానికి మరింత భారీ స్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉన్నా.. శంకర్ చివరి మూవీ ఇండియన్ 2 ఫలితం నేపథ్యంలో మేకర్స్ ఓ మోస్తరుకే పరిమితమయ్యారు.
గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ బిజినెస్
తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా గేమ్ ఛేంజర్ చేసిన ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు కూడా వచ్చాయి. అత్యధికంగా నైజాంలో ఈ మూవీ రూ.44 కోట్ల బిజినెస్ చేసింది. ఇక గుంటూరులో రూ.11 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.10.5 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ.9 కోట్లు, సీడెడ్ లో రూ.24 కోట్లు, కృష్ణాలో రూ.8.5 కోట్లు, నెల్లూరులో రూ.5 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.15 కోట్లు ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. అంటే మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.127 కోట్లుగా ఉంది.
నిజానికి ఈ సినిమాకు ఊహించిన స్థాయిలో హైప్ లేదు. రిలీజ్ వాయిదా పడుతూ ఊరిస్తూ రావడంతో ట్రేడ్ సర్కిల్స్ లో ఆసక్తి తగ్గింది. అయితే గురువారం (జనవరి 2) రిలీజైన ట్రైలర్ కు పాజిటివ్ టాక్ రావడంతో చివరి నిమిషంలో సినిమాకు హైప్ క్రియేట్ అవుతోంది. దీనికితోడు రాజమండ్రిలో శనివారం (జనవరి 4) ప్రీరిలీజ్ ఈవెంట్ ను పెద్ద ఎత్తున నిర్వహించనుండటంతో ప్రమోషన్లు జోరందుకోనున్నాయి. ఈ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ వస్తుండటంతో మూవీ క్రేజ్ మరో రేంజ్ కు వెళ్లనుంది. ఇక అటు అమెరికాలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. మిలియన్ డాలర్ల మార్క్ దాటేసింది.
సంక్రాంతి సినిమాల్లో గేమ్ ఛేంజర్ కు డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నుంచి పోటీ ఎదురు కానుంది. ఈ మూడు సినిమాలు రెండేసి రోజుల వ్యవధిలో రిలీజ్ కానున్నాయి. వచ్చే శుక్రవారం (జనవరి 10) గేమ్ ఛేంజర్ మొదటగా వస్తోంది. తొలి రెండు రోజుల పాటు ఎంత వీలైతే అంత వసూలు చేసుకుంటే చరణ్ మూవీ గట్టెక్కినట్లే.
టాపిక్