Game Changer: గేమ్ ఛేంజర్ చిత్రంపై సోషల్ మీడియాలో మరో రచ్చ-game changer poster scam hashtag trending on social media after ram charam movie day 1 box office collections reveal ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Game Changer: గేమ్ ఛేంజర్ చిత్రంపై సోషల్ మీడియాలో మరో రచ్చ

Game Changer: గేమ్ ఛేంజర్ చిత్రంపై సోషల్ మీడియాలో మరో రచ్చ

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 11, 2025 02:52 PM IST

Game Changer Movie: గేమ్ ఛేంజర్ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాలను మూవీ టీమ్ వెల్లడించింది. ఈ తరుణంలో సోషల్ మీడియాలో మరో రచ్చ షురూ అయింది. ఈ విషయంలో హ్యాష్‍ట్సాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

Game Changer: గేమ్ ఛేంజర్ చిత్రంపై సోషల్ మీడియాలో మరో రచ్చ
Game Changer: గేమ్ ఛేంజర్ చిత్రంపై సోషల్ మీడియాలో మరో రచ్చ

గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్ మూవీ శుక్రవారం (జనవరి 10) థియేటర్లలో రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం వచ్చింది. ఈ మూవీకి మొదటి నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల లెక్కను మూవీ టీమ్ నేడు (జనవరి 11) వెల్లడించింది. వసూళ్లతో ఓ పోస్టర్ తీసుకొచ్చింది.

yearly horoscope entry point

తొలి రోజు కలెక్షన్లు ఇలా..

గేమ్ ఛేంజర్ చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిందంటూ మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. హెలీకాప్టర్ నుంచి చెర్రీ కత్తి దూస్తున్న పోస్టర్‌తో ఈ వసూళ్ల లెక్కను వెల్లడించింది.

కలెక్షన్లు తప్పు అంటూ రచ్చ

గేమ్ ఛేంజర్ సినిమా కలెక్షన్లను మూవీ టీమ్ పెంచేసి చూపిస్తోందని కొందరు నెటిజన్లు.. సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు. గేమ్ ఛేంజర్ పోస్టర్ స్కామ్ అంటూ ఓ హ్యాష్‍ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. బుకింగ్స్ ట్రెండ్ చూస్తే.. ఈ చిత్రానికి ఫస్ట్ డే అంత మొత్తం వచ్చి ఉండదని.. కావాలనే ఎక్కువ వచ్చినట్టు చెబుతున్నారంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇది కాస్త రచ్చ మారింది. ఈ కలెక్షన్లు సరికాదంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారు.

తిప్పికొడుతున్న చెర్రీ ఫ్యాన్స్

ఈ విషయంపై కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ జరుగుతోంది. గేమ్ ఛేంజర్ సినిమా తొలి రోజు కలెక్షన్ల లెక్క సరికాదంటూ చేస్తున్న ఆరోపణలను రామ్‍చరణ్ అభిమానులు కొట్టిపారేస్తున్నారు. కావాలనే ఈ మూవీకి నెగెటివ్ ప్రచారం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రానికి తొలి రోజు భారీగా బుకింగ్స్ జరిగాయని, ఆ కలెక్షన్లు నిజమేనంటూ పోస్టులు చేస్తున్నారు. మొత్తంగా ఈ విషయంపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది.

గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్‍చరణ్ రెండు పాత్రలు పోషించారు. ఆయన నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. కియారా అడ్వానీ, అంజలి ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్స్ చేశారు. ఎస్‍జే సూర్య, సముద్రఖని, శ్రీకాంత్, జయరాం కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని భారీ బడ్జెట్‍తో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ నిర్మించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా.. తిరుణావకురసు సినిమాటోగ్రఫీ చేశారు.

గేమ్ ఛేంజర్ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన తీరుపై మిక్స్డ్ టాక్ వస్తోంది. కొత్తదనం లేదనే కామెంట్లు ప్రేక్షకుల నుంచి వినిపిస్తున్నాయి. చరణ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్‌ ఆకట్టుకుంది. ఈ చిత్రం సుమారు రూ.350 కోట్ల బడ్జెట్‍తో రూపొందింది.

Whats_app_banner

సంబంధిత కథనం